చంద్రపూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రపూర్ జిల్లా
चंद्रपूर जिल्हा
మహారాష్ట్ర పటంలో చంద్రపూర్ జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో చంద్రపూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనునాగపూర్
ముఖ్య పట్టణంChandrapur
మండలాలు1. చంద్రపూర్, 2. భద్రావతి, 3. వరోరా, 4. చిమూర్, 5. నాగ్‌భీడ్, 6. బ్రహ్మపురి, 7. సిందేవాహి, 8. మూల్, 9. సవోలి, 10. గోండ్‌పింప్రి, 11. రాజూరా, 12. కోర్పానా, 13. పంబూర్నా, 14. బలార్‌పూర్, 15. జివాటి
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Chandrapur (shared with Yavatmal district), 2. Gadchiroli-Chimur (shared with Gadchiroli district)
 • శాసనసభ నియోజకవర్గాలు6
Area
 • మొత్తం10,690 km2 (4,130 sq mi)
Population
 (2001)
 • మొత్తం20,71,101
 • Density190/km2 (500/sq mi)
 • Urban
32.11%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత59.41%
సగటు వార్షిక వర్షపాతం1398 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
ముల్ సమీపంలో ఒక నది

చంద్రపూరు జిల్లా (మహారాష్ట్ర:चंद्रपूर जिल्हा) భారతదేశ మహారాష్ట్రలోని నాగ్పూరు విభాగంలోని జిల్లా. ఈ జిల్లాను గతంలో చందా జిల్లాగా పిలిచేవారు. 1964 లో దీనికి చంద్రపూరు అని పేరు మార్చారు. గాడ్చిరోలి ప్రత్యేక జిల్లాగా విభజించబడే వరకు ఇది భారతదేశంలో అతిపెద్ద జిల్లాగా ఉండేది. జిల్లా జనసంఖ్య 2,071,101, వీరిలో 32.11% (2001 నాటికి) పట్టణ ప్రజలు ఉన్నారు.[1]

ఈ ప్రసిద్ధి చెందిన " సూపరు థర్మల్ పవరు ప్లాంటు " ఉంది. వార్ధా వ్యాలీ కోల్‌ఫీల్డులోని బొగ్గు నిల్వలు ఉన్న కారణంగా ఇది ఆసియాలో అతిపెద్దదిగా గుర్తించబడింది. చంద్రపూరులో పెద్ద సున్నపురాతిజలాశయాలు కూడా ఉన్నాయి. సున్నపురాయి, బొగ్గు సమృద్ధిగా ఉన్న ఈ జిల్లాలో " లార్సను అండ్ ట్యూబరో " (ఎల్ అండ్ టి, ఇప్పుడు అల్ట్రాటెక్ సిమెంట్), గుజరాతు అంభుజా (మరాఠా సిమెంటు వర్క్సు), మణిక్గడు, ముర్లి సిమెంటు, ఎసిసి సిమెంటు వంటి అనేక సిమెంటు కర్మాగారాలు ఉన్నాయి. చంద్రపూరు సమీపంలోని తడోబా నేషనల్ పార్కు భారతదేశంలోని 28 ప్రాజెక్టు టైగరు రిజర్వులలో ఒకటి. జిల్లా రాజధాని చంద్రపూరు నగరంలో పురాతన దేవాలయాలైన అంకాలేశ్వరు (శివుడు), మహాకాళి (దేవత మహాకాళి) ఆలయాలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

సాంప్రదాయ పురాణాల ఆధారంగా ఈ ప్రదేశం పేరు 'లోకాపురా'. దీనిని మొదట 'ఇందుపూరు' గా తరువాత చంద్రపూరుగా మార్చారు. బ్రిటీషు వలసరాజ్యాల కాలంలో దీనిని చందాజిల్లా అని పిలిచేవారు. 1964 లో ఈ జిల్లా పేరు 'చంద్రపూరు' మార్చారు. పురాతన కాలంలో ఈ ప్రాంతంలో వైరంగడు, కోసల, భద్రావతి, మార్కండ వంటి ఇతర ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని చాలాకాలం హిందూ, బౌద్ధ రాజులు పాలించారు. 9 వ శతాబ్దంలో తరువాత చంద్రపూరును పాలించిన డానా అధిపతులను గోడులు అధిగమించారు. 1751 వరకు గోండు రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత మరాఠా కాలం ప్రారంభమైంది. రాజవంశపాలనలో చివరి రాజు రఘుజీ భోసలే 1853 లో వారసుడు లేకుండా మరణించాడు. తరువాత చంద్రపూరును నాగ్పూరు ప్రావిన్సులో చేర్చి బ్రిటిషు సామ్రాజ్యానికి అనుసంధానించబడినట్లు ప్రకటించారు.

1854 లో చంద్రపూరు ఒక స్వతంత్ర జిల్లాగా ఏర్పడింది. 1874 లో ఇందులో మూడు తహసీల్సు ఉన్నాయి: విజ్ ముల్, వరోరా, బ్రహ్మపురి. 1874 లో మద్రాసు ప్రొవింసు నుండి ఎగువ గోదావరిజిల్లా రద్దు చేసి అందులోని నాలుగు తహసీలులను చంద్రపూరు జిల్లాకు చేర్చారు. తరువాత ఇది సిరోంచా రాజధానిగా ఒకే తహసిలుగా రూపొందించబడింది. 1895 లో ఒక తహసీలు రాజధాని ఎం.యు.ఐ. నుండి చంద్రపూరుకు బదిలీ చేయబడింది. 1905 లో బ్రహ్మపురి, చంద్రపూరు తహసీల నుండి జమీందారీ సంస్థానాలను బదిలీ చేయడం ద్వారా గడ్చోరోలి రాజధానిగా కొత్త తహసీలు సృష్టించబడింది. 1907 లో చంద్రపూరు జిల్లా నుండి ఒక చిన్న జమీందారీ సంస్థానం కొత్తగా రూపొందించిన జిల్లాకు బదిలీ చేయబడింది. అదే సంవత్సరంలో సుమారు 1560 కిమీ 2 విస్తీర్ణంలో దిగువ సిరోంచా తహసీలులోని మూడు విభాగాలున్న (చెర్లా, అల్బాకు నాడు, నుగిరు) మద్రాసు రాష్ట్రానికి బదిలీ చేయబడ్డాయి. 1911-1955 మధ్య జిల్లా సరిహద్దులలో కాని దాని తహసిలులలో పెద్ద మార్పులు సంభవించలేదు. 1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జిల్లాను మధ్యప్రదేశు నుండి బొంబాయి రాష్ట్రానికి బదిలీ చేశారు. హైదరాబాదు రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో భాగమైన అదే రాజురా తహసీలు నాందేడు జిల్లాకు బదిలీ చేశారు. 1959 లో దీనిని చంద్రపూరు జిల్లాకు బదిలీ చేశారు. 1960 మే నుండి ఈ జిల్లా మహారాష్ట్రలో భాగమైంది. 1981 జనాభా లెక్కల తరువాత పరిపాలనా సౌలభ్యం, పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి కొరకు ఈ జిల్లా నుండి కొంతభాగం విభజించి గాడ్చిరోలి జిల్లాను రూపొందించారు. చంద్రపూరు జిల్లాలో ఇప్పుడు చంద్రపూరు, భద్రావతి, వరోరా, చిమూరు, నాగ్భీరు, బ్రహ్మపురి, సింధేవాహి, ములు, గోండ్పిప్రి, పోంబూర్న, సావోలి, రాజురా, కోర్పనా, జీవతి, బల్హర్షా తహసీళ్ళు ఉన్నాయి.

1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత పూర్వ సెంట్రలు ప్రావిన్సు మధ్యప్రదేశు రాష్ట్రంగా సరికొత్త రాష్ట్రం అవతరించింది. 1911–1955 మధ్య జిల్లా సరిహద్దులలో దాని తహసిళ్ళలో పెద్ద మార్పులు సంభవించలేదు. 1956 లో భారతీయ రాష్ట్రాలు భాషా పరంగా పునర్వ్యవస్థీకరించబడ్డాయి. ఎక్కువగా మరాఠీ మాట్లాడే చంద్రపూరు జిల్లాను మధ్యప్రదేశు నుండి బదిలీ చేయబడి బొంబాయి రాష్ట్రంలో భాగమైంది. 1960 లో బొంబాయి రాష్ట్రానికి మహారాష్ట్రగా పేరు మార్చబడింది.

విభాగాలు[మార్చు]

చంద్రపూరు జిల్లాను బల్లార్పూరు, రాజురా, భద్రావతి, వరోరా, చిమూరు, నాగ్భీదు, బ్రహ్మాపురి, సింధేవాహి, ముల్, సవాలి, గోండ్పిప్రి, కోర్పనా, పోంభూర్ణ, జివతి విభాగాలుగా విభజించారు.

జిల్లాలో ఆరు విధానసభ (శాసనసభ) నియోజకవర్గాలు ఉన్నాయి: రాజురా, చంద్రపూరు, బల్లార్పూర్, వరోరా, బ్రహ్మపురి, చిమూరు. రాజురా, చంద్రపూరు, బల్లార్పూరు, వరోరా చంద్రపూరు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. బ్రహ్మపురి, చిమూరు గడ్చిరోలి-చిమూరు లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[2]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,194,262,[3]
ఇది దాదాపు. లతివా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 207 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 192 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 5.95%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే. 959:1000 [3]
అక్షరాస్యత శాతం. 81.35%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

భౌగోళికం[మార్చు]

చంద్రపూరు జిల్లా నాగపూర్ విభాగంలో మహారాష్ట్ర తూర్పు అంచున ఉంది. ఇది 'విదర్భ' ప్రాంతం తూర్పు భూభాగంలో ఉంది. ఇది 19.30 ’ - 20.45’ ఉత్తర అక్షాంశం, 78.46’ తూర్పు రేఖాంశం మధ్య ఉంది. ఇది మహారాష్ట్ర రాష్ట్రానికి తూర్పున ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన నాగ్పూరు, భండారా, వార్ధా, పశ్చిమాన యవత్మలు, తూర్పు సరిహద్దున గాడ్చిరోలి, దక్షిణ భాగంలో ఆంధ్రప్రదేశులోని ఆదిలిబాదు జిల్లా ఉన్నాయి. భౌగోళికంగా జిల్లా వైంగంగ, వార్ధా నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది. జిల్లా తూర్పు, పశ్చిమ సరిహద్దులలో గోదావరి ఉపనదులైన వైంగంగా, వార్ధా నదులు ప్రవహిస్తున్నాయి. చంద్రపూరు జిల్లా వైశాల్యం 11,443. రాష్ట్ర మొత్తం వైశాల్యంలో జిల్లావైశాల్యం 3.72% ఉంది. భౌగోళికంగా మహారాష్ట్ర 16.40 - 22.10 ఉత్తర అక్షాంశం, 72.60 - 80.9 తూర్పు రేఖాంశంలో ఉంది.

భౌగోళిక స్థానం, భౌతిక విధానాల కారణంగా జిల్లాలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. జిల్లాలో ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రధానంగా జిల్లాలో రెండు ప్రముఖ సీజన్లు ఉన్నాయి. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన వేసవి, మితమైన చలితో కూడిన శీతాకాలం ఉంటుంది. సుదీర్ఘంగా చాలా వేడిగా ఉండే వేసవి ఉంటుంది. శీతాకాలం తక్కువగా తేలికపాటిగా ఉంటుంది. శీతాకాలం వర్షాకాలం వేసవి తరువాత ప్రారంభమమై సెప్టెంబరు చివరి వరకు ఉంటుంది. వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు చాలా వర్షపాతం తెస్తాయి. చంద్రపూరు జిల్లాలో కరువు పీడిత ప్రాంతం లేదు.

వాతావరణం[మార్చు]

అక్టోబరు నెల నుండి ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభమవుతూ డిసెంబరు మాసంలో తీవ్రమైన చలి నెలకొంటుంది. డిసెంబరులో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 28.2 ° సెంటీగ్రేడు ఉంటుంది. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 11.6. సెంటీగ్రేడు. ఉత్తరభూభాగం దక్షిణభూభాగం కంటే వెచ్చగా ఉంటుంది. ఇది 29.6 సెంటీగ్రేడు 14.6 సెంటీగ్రేడు మధ్య ఉంటుంది. ఉత్తరభూభాగంలో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత 3 ° సెంటీగ్రేడు, దక్షిణాన 8 ° సెంటీగ్రేడు ఉంటుంది. ఫిబ్రవరి నెల నుండి రోజువారీ సగటు ఉష్ణోగ్రత పెరగడం మొదలై సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 48 ° సెంటీగ్రేడు, కనీస ఉష్ణోగ్రత 28 ° సెంటీగ్రేడు - 29. సెంటీగ్రేడు ఉంటుంది. 2009 మే నెలలో చంద్రపూరులో అత్యధిక ఉష్ణోగ్రతగా 51 ° సెంటీగ్రేడు నమోదైంది. తీవ్రమైన వేడి పరిస్థితులలో నమోదౌతున్న ఉష్ణోగ్రత దక్షిణ ఆసియాలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో ఒకటిగా భావించబడుతుంది. రుతుపవనాల ప్రారంభం కారణంగా మే తరువాత ఉష్ణోగ్రత తగ్గుతుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు వేడి, తేమగా కలిగిన మిశ్రితవాతావరణం ఉంటుంది.

సగటు వార్షిక వర్షపాతం 1420 మి.మీ.ఉంటుంది. తూర్పు భాగంలో పడమర కన్నా వర్షపాతం అధికంగా ఉంటుంది. జిల్లాలో సగటున 60 - 65 రోజుల వర్షం ఉంటుంది. రుతుపవనాల కాలంలో ఆర్ద్రత చాలా ఎక్కువగా ఉంటూ 70% దాటుతుంది. కానీ వర్షాకాలం తరువాత ఇది వేగంగా తగ్గుతూ వేసవిలో ఇది 20%కి చేరుకుంటుంది.

ప్రధానంగా వాయువు దిశ దక్షిణ నుండి ఉత్తరం వైపు వీస్తూ ఉంటుంది. వేసవిలో వాయువు తూర్పు నుండి దక్షిణం వైపు వీస్తుంది. వర్షాకాలంలో వాయువు దక్షిణ నుండి తూర్పు వైపు వీస్తూ ఉంటుంది. శీతాకాలంలో వాయువు ఉత్తరం నుండి తూర్పు వైపుకు మారుతుంది. ఈదురు గాలుల జూన్ మధ్యకాలం వరకు ఉంటుంది.

నీటిపారుదల[మార్చు]

జిల్లా మొత్తం ప్రాంతం గోదావరి ముఖద్వారంలో ఉంది. ఈ ప్రాంతంలోని వ్యవసాయక్షేత్రాలకు గోదావరి నది ప్రధాన ఉపనదులైన వార్ధ, వైంగంగా, పెంగంగా నదులు నీటిని సరఫరా చేస్తున్నాయి. పశ్చిమ సరిహద్దులో కొంత భాగం ప్రవహించే పెంగాంగా ఘుగసు సమీపంలోని వాధ వద్ద వార్ధ నదితో సంగమిస్తుంది. తరువాత ఇది వాయవ్య దిశ నుండి ఆగ్నేయదిశగా ప్రవహిస్తుంది. చివరికి జిల్లా ఆగ్నేయ మూలలో ఉన్న వైంగాంగా నదిలో విలీనం అవుతుంది. ఈ సంగమం తరువాత జిల్లాలోని ఎగువభాగాల నుండి ప్రవహిస్తున్న ఉపనదులతో పాటు జిల్లా మొత్తం ప్రాంతానికి నీటి సరఫరా చేస్తుంది.

చంద్రపూరు గాడ్చిరోలి జిల్లా సరిహద్దులో ప్రవహించే వైంగంగా నది జిల్లాలో ప్రధాననదీ ప్రవాహంగా ఉంది. మిగతా రెండు ప్రధాన నదులతో పోల్చితే జిల్లాలో అతి పొడవైన నది మార్గం ఉన్న ఏకైక శాశ్వత నది వార్ధా. వార్ధా నది, ప్రధాన ఉపనదులు ఎరాయి వరోరా తహ్సిలు ఉత్తర భాగంలో ఉద్భవించి దక్షిణదిశగా 80 కిలోమీటర్ల పొడవున ప్రవహించి చంద్రపూరుకు దక్షిణంగా ఉన్న వార్ధలో సంగమిస్తుంది. పశ్చిమ సరిహద్దు వెంట ప్రవహించే పెంగాంగా తూర్పు పడమరగా ప్రవహించి తరువాత ఘుగసు సమీపంలోని వాధ వద్ద వార్ధానదిలో సంగమిస్తుంది. గడ్చిరోలి తహ్సిలు, రాజురా తహసిలు కొంత ప్రాంతంలో పెంగంగా దాని ఉపనదులు నీటిపారుదల సౌకర్యం కలిగిస్తుంది.

ఆర్ధికం[మార్చు]

దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాలలో చంద్రపూరుజిల్లా ఒకటి (మొత్తం 640 లో).[6] ప్రస్తుతం వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం (బి.ఆర్.జి.ఎఫ్) నుండి నిధులు పొందుతున్న మహారాష్ట్రలోని 12 జిల్లాలలో చంద్రపూరు ఒకటి. [6]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-27.
  2. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 మార్చి 2010. Retrieved 5 September 2010.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est.
  5. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico – 2,059,179
  6. 6.0 6.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]