Jump to content

బీడ్ జిల్లా

వికీపీడియా నుండి
బీడ్ జిల్లా
बीड जिल्हा
మహారాష్ట్ర పటంలో బీడ్ జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో బీడ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనుఔరంగాబాద్
ముఖ్య పట్టణంBeed
మండలాలు1. Beed, 2. Ashti, 3. Patoda, 4. Shirur Kasar, 5. Georai, 6. Ambajogai, 7. Wadwani, 8. Kaij, 9. Dharur, 10. Parali, 11. Majalgaon
Government
 • లోకసభ నియోజకవర్గాలుBeed (Based on Election Commission website)
 • శాసనసభ నియోజకవర్గాలు6
విస్తీర్ణం
 • మొత్తం10,693 కి.మీ2 (4,129 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం21,61,250
 • జనసాంద్రత200/కి.మీ2 (520/చ. మై.)
 • Urban
17.91%
Websiteఅధికారిక జాలస్థలి
అంబజోగైలోని బరాఖంబి ఆలయం

మహారాష్ట్ర లోని జిల్లాలలోబీడ్ జిల్లా (భిర్ జిల్లా) ఒకటి. బీడ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 10,693 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,161,250. జిల్లాలోని 17.9% నగరప్రాంతంలో నివసిస్తున్నారు.[1]

చరిత్ర

[మార్చు]

బీడ్ జిల్లా దీర్ఘకాల చరిత్ర కలిగి ఉంది. జిల్లా పలు పాలకులు పాలనకు సాక్ష్యంగా ఉంది. పురాతన కాలంలో ఈ ప్రాంతం " చంపావతి నగరి " అని పిలువబడింది. గతకాల వైభవానికి చిహ్నంగా సాక్ష్యంగా జిల్లాలో పలు స్మారక నిర్మాణాలు ఉన్నాయి. నగరంలో ప్రవేశించడానికి పల ద్వారాలు, కోట గోడలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో మరద్వాడాగా పిలువబడిన ఈ ప్రాంతం నిజాము పాలనలో ఉండేది. భరతస్వాతంత్ర్య సమరయోధులకు, నిజాము సైనికుల మధ్య జరిగిన భీకర పోరాటం తరువాత ఈ ప్రాంతం సమైక్య భారతంలో విలీనం చేయబడింది. ఈ ప్రాంతానికి బీర్ అని మహమ్మద్ తుగ్లక్ నామకరణం చేసాడు.

ఆర్ధికం

[మార్చు]

జిల్లా ఆర్థికరంగానికి వ్యవసాయం వెన్నెముకలా సహకరిస్తుంది. వ్యవసాయం వర్ధారంగా ఉంది. దేశానికి అత్యధికంగా శ్రామికులను అందిస్తున్న జిల్లాలలో బీడ్ ఒకటి.

విభాగాలు

[మార్చు]

నాసిక్ జిల్లాలో 11 తాలూకాలు ఉన్నాయి.

  1. బీడ్
  2. అస్థి
  3. పటోడా
  4. షిరూర్ (కెసార్)
  5. జెవ్రై
  6. అబాజోగై
  7. వద్వాని
  8. కైజి
  9. ధౌర్
  10. పర్లి (వైజినాథ్)
  11. మజల్గావ్

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,585,962,[2]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నెవాడా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 106వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 242 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.65%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 912:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.53%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-27.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Kuwait 2,595,62
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nevada 2,700,551

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]