జలగావ్ జిల్లా
Jalgaon జిల్లా जळगाव जिल्हा | |
---|---|
![]() Maharashtra పటంలో Jalgaon జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Maharashtra |
డివిజను | Nashik Division |
ముఖ్య పట్టణం | Jalgaon |
మండలాలు | 1. Jalgaon, 2. Jamner, 3. Erandol, 4. Dharangaon, 5. Bhusawal, 6. Bodwad, 7. Yawal, 8. Raver, 9. Muktainagar, 10. Amalner, 11. Chopda, 12. Parola, 13. Pachora, 14. Chalisgaon, 15. Bhadgaon |
ప్రభుత్వం | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. Jalgaon, 2. Raver (shared with Buldhana District) (Based on Election Commission website) |
• శాసనసభ నియోజకవర్గాలు | 12 |
విస్తీర్ణం | |
• మొత్తం | 11,765 కి.మీ2 (4,542 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 42,24,442 |
• సాంద్రత | 360/కి.మీ2 (930/చ. మై.) |
• పట్టణ | 70% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 85 |
• లింగ నిష్పత్తి | 933 |
ప్రధాన రహదార్లు | NH-6 National Highway 211 (India) NH-211 |
సగటు వార్షిక వర్షపాతం | 690 మి.మీ. |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో జలగావ్ జిల్లా (హిందీ:जळगाव जिल्हा) ఒకటి. జలగావ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 11,765 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 3,682,690. గ్రామీణ ప్రాంత నివాసితులు 71.4%. .[1]
సరిహద్దులు[మార్చు]
జిల్లా సరిహద్దులో మద్యప్రదేశ్ రాష్ట్రం, తూర్పు సరిహద్దులో బుల్ఢానా జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో జల్నా జిల్లా, దక్షిణ సరిహద్దులో ఔరంగాబాద్ (మహారాష్ట్ర) జిల్లా, వాయవ్య సరిహద్దులో నాసిక్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ధూలే జిల్లా ఉన్నాయి. .
ఆర్ధికం[మార్చు]
వ్యవసాయం[మార్చు]

జిల్లాలో ప్రధానంగా అరటి, పత్తి, సజ్జలు, గోధుమలు, మిల్లెట్, నిమ్మ, వేరుచనగ, చెరకు పండించబడుతున్నాయి. నాణ్యమైన బంగారానికి జలగావ్ ప్రత్యేకత కలిగి ఉంది. [2].
వర్షపాతం[మార్చు]
జల్గావ్ జిల్లాలో వర్షపాతం 77-80 సె.మీ.జిల్లా తూర్పు ప్రాంతంలోని యవాల్ తాలూకాలో 77 సె.మీ.జిల్లాలోని భుసవాల్, పచోరా ప్రాంతాలలో 79సె.మి.జమ్నర్ ప్రాంతంలో 80 సె.మీ. [2]
చరిత్ర[మార్చు]
ప్రస్తుత జలగావ్ జిల్లా ప్రాంతం ఫరూఖ్ రాజవంశానికి చెందిన స్వతంత్ర ఖందేష్ సుల్తానేట్‌లో (1382 - 1601) భాగంగా ఉండేది. జలగావ్ జిల్లా 1960 అక్టోబరు 21న ఖండేష్ జిల్లాగా ఉండి తరువాత గతంలో తూర్పు ఖండేష్‌గా జిల్లాగా ఉండేది. అబ్దుల్ ఫాజల్ (గ్లాడ్విన్ అయినే అక్బరి 1157) వ్రాతలను అనుసరించి మాలిక్ నాజర్‌కు (ఫాజిల్ రెండవ రాజు ) అహమద్ - 1 (గుజరాత్) (1411-1443) ఖాన్ అనే బిరుదు ఇచ్చిన తరువాత ఈ ప్రదేశానికి ఖండేష్ అనే పేరు వచ్చిందని భావిస్తున్నారు.
పేరు వెనుక చరిత్ర[మార్చు]
మరొక కథనం అనుసరించి మహాభారతంలో వర్ణించబడిన ఖాండవప్రస్థం ఇదే అని అందువలన ఇది ఖండేష్ అయిందని భావిస్తున్నారు. తోరణ్మల్ పాలకుడు యువంషవ పాండవులతో యుద్ధంచేసాడని సూచించబడింది.
అజంతా గుహలు[మార్చు]
క్రీ.పూ 3 వ శతాబ్దం నాటి నాసిక్ సమీపంలో ఉన్న అజంతా గుహాలయాలు ఉన్నాయి. ఖండేష్‌ను బుద్ధమతావలంబీకులు అధికంగా పాలించారు. తరువాత ఇది సప్తవననాస్, ఆంధ్రభ్రిత్యాలు, విర్సెన్ (అహిర్ రాజు), యువన్ సామ్రాజ్యం, చాళుక్యులు, యాదవులు, అలావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ తుగ్లక్, మాలిక్ రాజ మాలిక్ నాజర్, ది నాజిర్, ది నిజాం ఆఫ్ హైదరాబాదు, మరాఠీలు పాలించారు.
బ్రిటిష్ ఆక్రమణ[మార్చు]
18వ శతాబ్దంలో ఖండేష్‌ను బ్రిటిష్ సైన్యాలు ఈ ప్రాంతాన్ని (హోల్కర్ - ధూలే) ఆక్రమించుకున్నారు. తరువాత ఖండేష్ పాలనకు మొదటి అధికారిగా రాబర్ట్ గిల్ల్ నియమించబడ్డాడు. 1906లో జలగావ్ జిల్లాగా రూపొందించబడింది.
ప్రత్యేకతలు[మార్చు]
జిల్లాలోని పరోలా తాలూకాలో ఉన్న కోట ఝాంసీ రాణి నిర్మించిందని భావిస్తున్నారు. 1936లో యవాల్ తాలూకాలోని ఫాజిల్ వద్ద ఆల్ ఇండియ కాంగ్రెస్ సభ నిర్వహించబడింది. ప్రఖ్యాత కవి బహినబాయి చౌదరి స్వస్థలం జలగావ్. ఆయన అహిరిని మాండలికానికి గుర్తింపు తీసుకు వచ్చాడు. సానే గురూజి బాల్కవి తొమెరే కవిత్వంతో ప్రజలను మేలుకొలిపేవాడు. జలగావ్ ^కు చెందిన ఎన్.డి మహానూర్ కవిగా తనకుతాను నిరూపించుకున్నాడు.
ముగల్ పాలన[మార్చు]
1601లో అక్బర్ ఈ ప్రాంతాన్ని ముగల్ సామ్రాజ్యంతో విలీనం చేసుకున్నాడు. తరువాత ఈ ప్రాంతం నిజాం తరువా మరాఠీల ఆధీనంలోకి వచ్చింది. 18 వ శతాబ్దం ఆరంభంలో ఈ ప్రాంతం హోల్కర్ పాలన నుండి బ్రిటిష్ పాలనలోకి మారింది. తరువాత ధులియా కేంద్రంగా ఖండేష్ జిల్లా రూపొందించబడింది. 1906లో ఖండేష్ జిల్లా రెండు జిల్లాలుగా విభజించబడ్డాయి. ప్రస్తుత జలగావ్ రాజధానిగా ఉన్న జలగావ్ జిల్లాను తూర్పు ఖండేష్ అనేవారు. 1956లో రాష్ట్రాల పునర్విభజన తరువాత తూర్పు ఖండేష్ జిల్లా బొంబాయి రాష్ట్రంలో భాగం అయింది. తరువాత 1960 మే 1 న మహారాష్ట్రా జిల్లా రూపొందించిన తరువాత ఈ జిల్లా మహారాష్ట్రా జిల్లాలో భాగం అయింది. 1960 అక్టోబరు 21 తూర్పు ఖండేష్ జిల్లా జలగావ్ జిల్లాగా మార్చబడింది.
సహకార షుగర్ ఫ్యాక్టరీ (శంహకరి శేఖర్ ఖార్ఖానా)[మార్చు]
ఫ్యాక్టరీ పేరు | ప్లేస్ | తాలూకాను | |
---|---|---|---|
మధుకర్ | జీవ్రామ్నగర్, ఫాఇజ్పుర్ | యావల్ | |
బెల్గంగ | భొరస్ | చలిస్గఒన్ | |
వసంత్ | కసొద | ఎరందొల్ | |
సంత్ ముక్తబై | ఘొదస్గఒన్ | ముక్తైనగర్ | |
చొపద శేత్కారి | చొపద | చొపద | |
జమ్నెర్ తాఉక | గొంద్ఖెల్ | జమ్నెర్ | |
వివేక్ పాటిల్ | ఎం.ఐ.డీ.సి | జాల్గాఓన్ |
పరిశ్రమలు[మార్చు]
ఈ జిల్లాలోని ప్రధాన పరిశ్రమలు ఉన్నాయి:
- జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఒక బహుళజాతి సంస్థ, ఇరిగేషన్, పైప్, ప్లాస్టిక్ షీట్, సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ తయారీదారు.
- సుప్రీం పైప్స్ లిమిటెడ్
- రేమండ్
- ఏంచొ ట్రాన్స్ఫార్మర్స్
- దళ్ మిల్లులు
- పాటిల్ పైప్స్
- గోల్డ్ ఆర్నమెంట్స్- బంగారం స్వచ్ఛతకు ప్రసిద్ధి.
విభాగాలు[మార్చు]
- జిల్లాలో 15 తాలూకాలు ఉన్నాయి :- జల్గావ్,జమ్నెర్,ఎరందొల్, ఢరంగఒన్, భుసవల్,బొద్వద్,యవల్, రవెర్ (మహారాష్ట్ర ),ముక్తైనగర్,అమల్నెర్,చొప్ద,పరొల (మహారాష్ట్ర), పచొర, చలిస్గవన్, భద్గ్వన్.
- జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :- చొప్ద, రవెర్, భుసవల్, జలగావ్ సిటీ, జలగావ్ రూరల్, అమల్నెర్, ఎరందొల్, విస్సన్నపెత, పచొర, జమ్నెర్, ముక్తైనగర్.
- జిల్లాలో పార్లమెంటు 2 నియోజకవర్గాలు ఉన్నాయి :-[3] జిల్లాలో 13 నగరపంచాయితీలు ఉన్నాయి..[2]
జిల్లాలో నదులు[మార్చు]
జిల్లా ఈశాన్య సరిహద్దులో తపి నది ప్రవహిస్తుంది. తపి నది మొత్తం 724 కి.మీ. మహారాష్ట్రలో 208 కి.మీ ప్రవహిస్తుంది. గిరానా నది జిల్లాలో ప్రవహిస్తుంది. గిరానా నది నాసిక్‌లోని కల్వన్ ఉపవిభాగంలో సప్తశృంగి పర్వతాలలో జన్మిస్తుంది. తరువాత ఉత్తర భూభాగంలో ప్రవహిస్తున్న సెలఏర్లు ఈ నదిలో సంగమిస్తున్నాయి. గిరినా నది 150 కి.మీ ప్రవహించిన తరువాత నందర్ తపినదిలో సంగమిస్తుంది. తపి నది నాసిక్‌లో తూర్పు వైపుగా నేరుగా ప్రవహిస్తుంది. జలగావ్ నుండి కొంచెం ఉత్తరదిశగా తపినదికి సమాంతరంగా సాగుతుంది.
తపినది ఉపనదులు[మార్చు]
- కుడి తీరంలో సంగమిస్తున్న నదులు :- చంద్రభాగా, భులేశ్వరి, నంద్, వాన్, అనర్.
- ఎడమ తీరంలో సంగమిస్తున్న నదులు :- కపర, సిపన, గద్గి, డోలర్, పెధి, కత్పుర్న, మొరన, మాన్, నల్గంగ, బిస్వ..[2]
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,224,442,[4] |
ఇది దాదాపు. | కాంగో దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | కెంటకీ నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 46వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 359 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.71%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 922:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 79.73%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు[మార్చు]
జిల్లాలో ఖండేష్ భాషాకుటుంబానికి చెందిన అహిరాని భాష వ్యవహార భాషగా వాడుకలో ఉంది. అహిరానీ భాషకు " 7,80,000 మంది వాడుకరులు ఉన్నారు. అహిరానీ భాష మారాఠీ , భిలీ భాషను పోలి ఉంటుంది.[7] భిల్ భాషాకుటుంబానికి చెందిన బరేలీ భాషకు మద్యప్రదేశ్‌లో 10,000 మది వాడుకరులు ఉన్నారు. [8] , భిల్ భాషాకుటుంబానికి చెందిన బరేలీ రథ్వీ భాషకు 64,000 మంది వాడుకరులు ఉన్నారు. ఈ భాషను వ్రాయడానికి దేవనాగరి లిపిని వాడుతున్నారు.[9]
విద్య[మార్చు]
- " నార్త్ మహారాష్ట్ర యూనివర్శిటీ " జలగావ్‌లో 1989లో ఆగస్ట్ 15 న స్థాపించబడింది.
- ఖండేష్ ఎజ్యుకేషన్ సొసైటీ స్కూల్స్ కాలేజీలు , మరాఠా విద్యా ప్రసారక్ మండల్ విద్యా సంస్థలు ఉన్నాయి.
మాధ్యమం[మార్చు]
జిల్లాలో ప్రధానంగా మరాఠీ భాషా వార్తాపత్రికలు ప్రచురించబడుతున్నాయి : దేష్దూత్, దేశోన్నతి, లోక్మాత, సకల్, దివ్య మరాఠీ, మహారాష్ట్ర.
సుప్రసిద్ధ వ్యక్తులు[మార్చు]
- బహినబాయి చౌదరి
- సేన్ గురూజీ
- ప్రతిభా పాటిల్
- ఏక్నాథ్ ఖద్సె
- భవర్లాల్ జైన్
- ఉజ్వల్ నికమ్
- బల్కవి
- వివేక్ పాటిల్
జల్గావ్ జిల్లా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి స్థలాలు [10][మార్చు]
- 'మహాత్మా గాంధీ తీర్థ్' , మహాత్మా గాంధీ ఫౌండేషన్, జలగావ్
- జైన్ రీసెర్చ్ అండ్ దెమొస్త్రతిఒన్ సెంటర్, జైన్ హిల్స్, జలగావ్ రైతులు & వ్యవసాయం వార్తలు -
- బహిన బాయి ఉద్యాన్, జలగావ్
- వెంకటేష్వర్ ఆలయం, జలగావ్
- ఓంకారేశ్వర్ మందిర్ - జాల్గాఓన్
- ఏచా దేవి ఆలయం, మెహ్రున్, జలగావ్
- మెహ్రున్ లేక్, మెహ్రున్, జలగావ్
- 'జైన్ టెంపుల్' , డదవది, జలగావ్
- తర్సొద్-గణపతి ఆలయం, తర్సొద్, జలగావ్
- 'ఉనప్దెవ్ హాట్ నీటి చెరువులు' , దేవాలయాలు , కొండ స్టేషను
- 'పద్మలయ క్షేత్ర' - లార్డ్ గణపతి దేవాలయాలు , హనుమాన్, ఎరందొ తాలూకాలో ( ఎరందొల్ నుండి 4.8 కి.మీ ) ఇక్కడ ప్రాచీన భారతీయ గణితశాస్త్రవే ఆర్యభట్ట్ గణితశాస్త్రం పుస్తకం రాశాడు "లీలావతి"
- 'భీమ్ కుండ్ , భీమ్ మహాదేవ్ ఆలయం'
- 'ఫర్కందె స్వింగింగ్ టవర్స్' , ఎరందొల్
- 'చంగ్దవొ మహారాజ్ ఆలయం' 'లో చంగ్దెవ్ - హత్నుర్ ఆనకట్ట సంగమం తపతి నది, పూర్ణా నది.
- గోపాల్ కృష్ణ కణెరె, మహారాష్ట్ర దేవాలయాలు , ముంబై, 2003 (మహారాష్ట్ర ప్రభుత్వం నుండి) మహారాష్ట్ర సమాచార కేంద్రం, పేజీ 31-33
- భుసవల్ సమీపంలో జుగదెవి ఆలయం;
- మంగళ్ గ్రహ్ మందిర్, అమల్నెర్
- గౌరెష్వర్ మహాదేవ్ ఆలయం (गौरेश्वर महादेव मंदिर जागृत देवस्थान) కు పంజరా నది సరిహద్దు వద్ద-షహపుర్ తల్- అమల్నెర్
- పరొల కోట, పరొల
- శ్రీ బాలాజీ - పరొల
* లో పతనదెవి పతనదెవి ఆలయంలో '
- శీతల్నాద్ మహారాజ్ మందిర్, ఖద్గఒన్, గొరగవలె బి.కె తాల్-చొప్ద బ్యాంకు, నది గులి మీద ఉన్న
- 'సంత్ ముక్తబాయి దేవాలయం (మెహున్ ఆలయం)' 60 కి.మీ దూరంలో ఉన్న జల్గావ్ నుండి ముక్తైణగర్ నగరంలో,
- పాల్ - హిల్ స్టేషను
- 'సత్పుద మనుదేవి ఆలయం' - అద్గవన్ తాలూకా యవల్ గ్రామ
- శ్రీ జగత్గురు వేద్ మహర్షి వ్యాస్ ముని మందిర్-యావల్ (వ్యాస్ నగరి)
- ముంజొబ దేవ్స్థన్ - ఆత్రవల్ తాల్ యవల్
- పవిత్ర తాజుద్దీన్ బాబా- కొండ స్టేషను
- ప్రచిన్ నతెష్వర్ మహారాజ్ మందిఎ
- సతి కమలాదేవి మందిర్
- భుసవల్ - థర్మల్ పవర్ ప్లాంట్
- ఔరంగాబాద్ జిల్లా కన్నద్ తాలూకా - పితల్ఖొర గుహ భారతదేశంలో పురాతన గుహ ఇది.
- 'అజంతా గుహలు చాళుక్య రాజ్యం హయాంలో అభివృద్ధి' 'మాత్రమే 50 ; జల్గావ్ నుండి క్మ్.
- ముంజొబ దెవస్థన్ రవెర్ తాలూకాలో వఘొద్ లో ఉన్న. యవల్ తాలూకాలో ఫైజ్పుర్
- మొదటి సెషన్ భారత జాతీయ కాంగ్రెస్్చే 1936 లో (ప్రెసిడేంట్ - పండిట్ జవర్లల్ నెహ్రూ)
- ఉత్రన్ - అధిక నాణ్యత నిమ్మకాయలు ప్రసిద్ధి ఎరందొల్ లో. లసుర్ తల్ - చొపద్
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-27.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 ISBN 938072559-0
- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 2010-03-18. Retrieved 2014-11-27.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Congo, Republic of the 4,243,929
line feed character in|quote=
at position 23 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Kentucky 4,339,367
line feed character in|quote=
at position 9 (help) - ↑ M. Paul Lewis, ed. (2009). "Ahirani: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
|edition=
has extra text (help) - ↑ M. Paul Lewis, ed. (2009). "Bareli, Palya: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
|edition=
has extra text (help) - ↑ M. Paul Lewis, ed. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
|edition=
has extra text (help) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-08. Retrieved 2014-11-27.
బయటి లింకులు[మార్చు]
- Latest Information and News on Jalgaon
- ebrightmedia.com[permanent dead link]
![]() |
Wikimedia Commons has media related to Minerals of Jalgaon District. |
![]() |
బర్వాని జిల్లా, మధ్యప్రదేశ్ | పశ్చిమ నిమర్ జిల్లా, మధ్యప్రదేశ్ | బురుహన్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్ | ![]() |
ధూలే జిల్లా | ![]() |
|||
| ||||
![]() | ||||
నాసిక్ జిల్లా | ఔరంగాబాదు జిల్లా | బుల్ఢానా జిల్లా |
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to జలగావ్ జిల్లా. |
- Pages with non-numeric formatnum arguments
- CS1 errors: invisible characters
- CS1 errors: extra text: edition
- Articles with short description
- Short description is different from Wikidata
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2021
- Articles with permanently dead external links
- మహారాష్ట్ర జిల్లాలు
- జలగావ్ జిల్లా
- నాసిక్ డివిజన్
- 1906 స్థాపితాలు
- భారతదేశం లోని జిల్లాలు