పాల్ఘర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాల్ఘర్ జిల్లా
पालघर जिल्हा
—  జిల్లా  —
మహారాష్ట్ర పటంలో జిల్లా స్థానం
దేశం  India
రాష్ట్రం మహారాష్ట్ర
డివిజను కొంకణ్ డివిజను
ముఖ్యపట్టణం పాల్ఘర్
జనాభా (2011 జనగణన)[ఆధారం చూపాలి]
 - జిల్లా 29,90,116
 Urban 14,35,210
భాషలు
 - అధికారిక మరాఠీ
Time zone IST (UTC+5:30)
ISO 3166 code IN-MH
Vehicle registration MH-04 (Thane RTO), MH-48 (Palghar District RTO)
వెబ్‌సైటు palghar.gov.in

పాల్ఘర్ జిల్లా మహారాష్ట్ర కొంకణ్ డివిజన్‌లోని ఒక జిల్లా .[1]

పాల్ఘర్ జిల్లా
View from Kosbad Hill, Dahanu, Thane - panoramio.jpgChimaji Appa Memorial 01.jpg
Jaivilas Palace, Jawhar.jpgSunset,Dahanu Beach - panoramio.jpg
JivDani,Virar - panoramio (31).jpg
ఎగువ-ఎడమ నుండి సవ్యదిశలో: కోస్బాద్ కొండ నుండి వీక్షణ, వసాయి కోట వద్ద చిమాజీ అప్ప స్మారక చిహ్నం, దహనులోని బీచ్ వద్ద సూర్యాస్తమయం, జీవదానీ కొండ నుండి విరార్ వీక్షణ, జవహర్‌లోని జై విలాస్ ప్యాలెస్

2014 ఆగస్టు 1 న మహారాష్ట్ర ప్రభుత్వం, పాల్ఘర్‌ను 36వ జిల్లా ఏర్పాటును ప్రకటించింది, ఇది థానే జిల్లా నుండి విభజించబడింది. పాల్ఘర్ జిల్లా ఉత్తరాన దహను నుండి మొదలై నైగావ్ వద్ద ముగుస్తుంది. జిల్లాలో పాల్ఘర్, వడ, విక్రమ్‌గడ్, జవహర్, మొఖదా, దహను, తలసరి, వసై-విరార్ తాలూకాలు ఉన్నాయి.2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభా 29,90,116.[2]

భౌగోళికం[మార్చు]

ఈ జిల్లా మహారాష్ట్రలోని కొంకణ్ లోతట్టు ప్రాంతాలకు ఉత్తరాన ఉంది. తూర్పున ఉన్న సహ్యాద్రి వాలుల నుండి భూమి, జిల్లా మధ్యలో ఉన్న పీఠభూముల ద్వారా దక్షిణాన ఉల్హాస్ లోయ వరకు వస్తుంది. వివిధ ప్రదేశాల నుండి పాల్ఘర్ పట్టణానికి రోడ్డు మార్గంలో దూరం క్రింది విధంగా ఉంది: ఖోడాలా 138 కిమీ, మొఖాడా 112 కిమీ, జవహర్ 75 కిమీ, విక్రమ్‌గడ్ 60 కి.మీ.

జిల్లా గుండా ప్రవహించే ప్రధాన నది వైతరణ. ఈ నదికి అనేక ఉపనదులు ఉన్నాయి; వాటిలో ముఖ్యమైనవి బార్వి, భట్సా, పింజల్, సూర్య, దహెర్జా, తాన్సా. కొంకణ్ ప్రాంతం లోని నదులలో అతి పెద్దది అయిన వైతర్ణ, నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ కొండలలో వద్ద ఉద్భవించింది. ఈ నది షాహాపూర్, వాడా, పాల్ఘర్ తాలూకాల గుండా ప్రవహించి, అరేబియా సముద్రంలో కలుస్తుంది. వైతర్ణ నది పొడవు 154 కి.మీ. జిల్లా ఉత్తర భాగం దీని పరెఈవహక ప్రాంతంలో ఉంది.

శీతోష్ణస్థితి[మార్చు]

Palghar
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
0.6
 
31
12
 
 
1.5
 
31
15
 
 
0.1
 
33
21
 
 
0.6
 
33
24
 
 
13
 
33
26
 
 
574
 
32
26
 
 
868
 
30
25
 
 
553
 
29
25
 
 
306
 
30
24
 
 
63
 
33
23
 
 
15
 
33
19
 
 
5.6
 
32
10
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: Indian Meteorological Department

విభాగాలు[మార్చు]

పాల్ఘర్ జిల్లాలో పట్టణ ప్రాంత జనాభా 14,35,210. మొత్తం జనాభాలో 48% పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు. పాల్ఘర్ జిల్లాలో 8 తాలూకాలున్నాయి. 2001, 2011 జనాభా లెక్కల [3] ప్రకారం జిల్లాలో క్రింది తాలూకాలు ఉన్నాయి:

తాలూకా జనాభా
2001 జనగణన
జనాభా
2011 జనగణన
వసాయ్ విరార్ 795,863 1,343,402
పాల్ఘర్ 454,635 550,166
దహాను 331,829 402,095
తలసారి 121,217 154,818
జవహర్ 111,039 140,187
మొఖాడా 67,319 83,453
వడా 142,753 178,370
విక్రమ్‌గఢ్ 114,254 137,625

పాల్ఘర్ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్లు[మార్చు]

  • వసాయి-విరార్

పాల్ఘర్ జిల్లాలో పట్టణాలు[మార్చు]

పాల్ఘర్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలు

  • మొఖాడా
  • విక్రమ్‌గడ్
  • తలసరి
  • వాడ

జనాభా వివరాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, పాల్ఘర్ జిల్లా జనాభా 29,90,116. జనాభాలో షెడ్యూల్డ్ కులాల జనాభా 2.91%, షెడ్యూల్డ్ తెగల జనాభా 37.39%.[3]

భాషలు[మార్చు]

పాల్ఘర్ జిల్లాలో భాషలు (2011)[4]

  మరాఠీ (61.65%)
  హిందీ (15.33%)
  వర్లీ భాష (6.12%)
  ఉర్దూ (1.76%)
  భోజ్‌పురి (1.75%)
  మార్వాడీ (1.01%)
  ఇతరులు (6.77%)

రవాణా[మార్చు]

పశ్చిమ రైల్వే నెట్‌వర్క్ జిల్లాలోని వసాయి, పాల్ఘర్, దహను తాలూకాల గుండా వెళుతుంది. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే (NH48) పాల్ఘర్ జిల్లాలో మనోర్, చిల్హార్ గుండా వెళ్తుంది.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

భారతదేశపు మొదటి అణు విద్యుత్ ప్లాంట్ పాల్ఘర్ జిల్లా లోని తారాపూర్ వద్ద ఉంది. తారాపూర్ MIDC వద్ద ఉన్న పారిశ్రామిక పట్టణం బోయిసర్, మహారాష్ట్రలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటి. మహారాష్ట్రలో అతిపెద్ద ఫిషింగ్ పోర్ట్ సత్పతి ; దహను, అర్నాలా, వసాయ్, డాటివేర్ కూడా ప్రధాన చేపల రేవులు. దహను భారతదేశం మొత్తంలో సపోటా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. దహనులోని బోర్డి బీచ్‌లో ప్రతి సంవత్సరం ప్రత్యేక సపోటా పండుగను నిర్వహిస్తారు.

మూలాలు[మార్చు]

  1. "Palghar becomes Maharashtra's 36th district". mid-day. 7 August 2014.
  2. "Bangar named as the first collector of Palghar district". Business Standard. 23 July 2014. Retrieved 15 September 2014.
  3. 3.0 3.1 "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". censusindia.gov.in. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. 2011 Census of India, Population By Mother Tongue

వెలుపలి లంకెలు[మార్చు]