నాగపూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగపూర్ జిల్లా
—  జిల్లా  —
నాగపూర్ జిల్లా లోని అంభోరా. ఇది ఐదు నదుల సంగమ స్థానం
నాగపూర్ జిల్లా లోని అంభోరా. ఇది ఐదు నదుల సంగమ స్థానం
[[File:
పటం
Nagpur district
|250px|none|alt=|మహారాష్ట్ర పటంలో జిల్లా స్థానం]]మహారాష్ట్ర పటంలో జిల్లా స్థానం
దేశం  India
రాష్ట్రం మహారాష్ట్ర
డివిజను నాగపూర్ డివిజను
స్థాపన
ముఖ్యపట్టణం నాగపూర్
జనాభా (2011)
 - Total 46,53,570
 Urban 64.26%
జనాభా
 - అక్షరాస్యత 89.5%
 - లింగనిష్పత్తి 948
Time zone IST (UTC+05:30)
రహదారులు NH44, NH47, NH53, NH353I, NH361, NH547, MSH9, SH3.
సగటు వార్షిక అవపాతం 1205 mm
జిల్లా స్థూల దేశీయోత్పత్తి INR 2,53,66 కోట్లు (2019-20) [1]
తలసరి ఆదాయం INR 1,74,442 (2019-20) [2]
వెబ్‌సైటు http://nagpur.nic.in/

నాగ్‌పూర్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం, విదర్భ ప్రాంతంలో ఉన్న జిల్లా. నాగ్‌పూర్ నగరం ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఈ జిల్లా నాగ్‌పూర్ డివిజన్‌లో భాగం. నాగ్‌పూర్ జిల్లాకు తూర్పున భండారా జిల్లా, ఆగ్నేయంలో చంద్రపూర్, నైరుతి సరిహద్దులో వార్ధా, వాయవ్య సరిహద్దులో అమరావతి, ఉత్తరాన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా, సియోని జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

గోండు రాజు భక్త్ బులంద్ షా ఉయికే ఈ నగరాన్ని స్థాపించాడు. తర్వాత కాలంలో దీనిని మరాఠ వాళ్లు ఆక్రమించారు . 1853లో, రఘోజీ III మరణానంతరం, నాగ్‌పూర్ సంస్థానాన్ని బ్రిటిష్ వారు విలీనం చేసుకున్నారు. ప్రస్తుత జిల్లా భూభాగం అప్పటి నాగ్‌పూర్ ప్రావిన్స్‌లో భాగమైంది. 1861లో, ఇది సెంట్రల్ ప్రావిన్స్‌లో విలీనమైంది. 1903లో ఇది సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బెరార్‌లో భాగమైంది. 1950లో కొత్తగా ఏర్పడిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా నాగ్‌పూర్ జిల్లా ఏర్పడింది. నాగ్‌పూర్ దాని రాజధానిగా మారింది. 1956లో, భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత, నాగ్‌పూర్ జిల్లాను బొంబాయి రాష్ట్రంలోకి చేర్చారు. 1960 మే 1 న, ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో భాగమైంది.

భౌగోళిక శాస్త్రం[మార్చు]

ప్రధాన పట్టణాలు, నదులతో నాగ్‌పూర్ జిల్లా మ్యాప్.

శీతోష్ణస్థితి[మార్చు]

Nagpur
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
10
 
29
12
 
 
12
 
32
15
 
 
18
 
36
19
 
 
13
 
40
24
 
 
16
 
43
28
 
 
172
 
38
26
 
 
304
 
32
24
 
 
292
 
30
24
 
 
194
 
32
23
 
 
51
 
33
20
 
 
12
 
30
15
 
 
17
 
28
12
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: World Weather Information Service
శీతోష్ణస్థితి డేటా - Nagpur
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 33
(91)
37
(99)
41
(106)
47
(117)
49
(120)
45
(113)
38
(100)
40
(104)
39
(102)
37
(99)
35
(95)
32
(90)
49
(120)
సగటు అధిక °C (°F) 28.6
(83.5)
32.1
(89.8)
36.3
(97.3)
40.2
(104.4)
42.6
(108.7)
37.8
(100.0)
31.5
(88.7)
30.4
(86.7)
31.8
(89.2)
32.6
(90.7)
30.4
(86.7)
28.2
(82.8)
33.5
(92.3)
సగటు అల్ప °C (°F) 12.4
(54.3)
15.0
(59.0)
19.0
(66.2)
23.9
(75.0)
27.9
(82.2)
26.3
(79.3)
24.1
(75.4)
23.6
(74.5)
22.9
(73.2)
19.8
(67.6)
14.9
(58.8)
12.1
(53.8)
20.2
(68.4)
అత్యల్ప రికార్డు °C (°F) 7
(45)
8
(46)
12
(54)
17
(63)
18
(64)
20
(68)
20
(68)
20
(68)
19
(66)
11
(52)
5
(41)
3.5
(38.3)
3.5
(38.3)
సగటు అవపాతం mm (inches) 10.2
(0.40)
12.3
(0.48)
17.8
(0.70)
13.2
(0.52)
16.3
(0.64)
172.2
(6.78)
304.3
(11.98)
291.6
(11.48)
194.4
(7.65)
51.4
(2.02)
11.8
(0.46)
17.2
(0.68)
1,112.7
(43.81)
Source: [3]

తాలూకాలు[మార్చు]

నాగ్‌పూర్ జిల్లాలో 14 తాలూకాలున్నాయి. అవి: రామ్‌టెక్, ఉమ్రేడ్, కలమేశ్వర్, కటోల్, కమ్తి, కుహి, నార్ఖేడ్, నాగ్‌పూర్, నాగ్‌పూర్ రూరల్, పర్సోని, భివాపూర్, మౌదా, సావ్నేర్, హింగ్నా .

నాగ్‌పూర్ జిల్లాలో 12 విధానసభ నియోజకవర్గాలు ఉన్నాయి: నాగ్‌పూర్ సౌత్ వెస్ట్, నాగ్‌పూర్ సౌత్, నాగ్‌పూర్ ఈస్ట్, నాగ్‌పూర్ సెంట్రల్, నాగ్‌పూర్ వెస్ట్, నాగ్‌పూర్ నార్త్, కటోల్, సావ్నర్, హింగ్నా, ఉమ్రేడ్, కమ్తీ, రామ్‌టెక్ . మొదటి ఆరు నియోజకవర్గాలు నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. మిగిలినవి రామ్‌టెక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.[4]

జనాభా వివరాలు[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19017,48,489—    
19118,06,287+7.7%
19217,89,940−2.0%
19319,36,987+18.6%
194110,56,537+12.8%
195112,30,535+16.5%
196115,08,455+22.6%
197119,42,688+28.8%
198125,88,811+33.3%
199132,87,139+27.0%
200140,67,637+23.7%
201146,53,570+14.4%

2011 జనాభా లెక్కల ప్రకారం నాగ్‌పూర్ జిల్లా జనాభా 46,53,570,[5] జనాభా పరంగా ఇది భారతదేశంలో 29వ స్థానం [5] జిల్లాలో జనసాంద్రత 470 [5] 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 14.39%.[5] నాగ్‌పూర్‌లో ప్రతి 1000 మంది పురుషులకు 948 స్త్రీలున్నారు.[5] అక్షరాస్యత రేటు 89.52%. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 18.65%, షెడ్యూల్డ్ తెగలు 9.40%.[5]

రవాణా[మార్చు]

నాగ్‌పూర్‌లో ప్రజా రవాణా బస్సు
నాగ్‌పూర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఉంది.

భారతదేశంలో దాని కేంద్ర స్థానం కారణంగా, నాగపూర్ రైల్వే స్టేషను ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్ . దేశంలో తూర్పు పడమరల్లోను, ఉత్తర దక్షిణాల్లోనూ నడిచే రైళ్లకు ఇది కూడలి. ముఖ్యంగా భారతదేశంలోని ప్రధాన మహానగరాలు, ముంబై నుండి హౌరా - కోల్‌కతా, ఢిల్లీ, జమ్మూ నుండి చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కన్యాకుమారి వెళ్ళే రైళ్ళు, పూణే, అహ్మదాబాద్ వంటి పశ్చిమ నగరాలకు వెళ్ళే రైళ్ళు చాలావరకూ నగరం గుండానే వెళ్తాయి.[6]

నాగ్‌పూర్ జంక్షన్

భారతదేశంలోని రెండు ప్రధాన జాతీయ రహదారులు, కన్యాకుమారి - వారణాసి (NH 7), హజీరా -కోల్‌కతా (NH6), నాగ్‌పూర్ నగరం గుండా వెళ్తున్నాయి.[6] హైవే నంబర్ 69 నాగ్‌పూర్ నుండి భోపాల్ సమీపంలోని ఒబైదుల్లాగంజ్‌ను కలుపుతుంది. ఖరగ్‌పూర్ నుండి ధూలే వెళ్ళే ఏషియన్ హిగ్‌లంక, AH46 లో నాగ్‌పూర్ ఒక కూడలి.

MSRTC బస్సులు జిల్లాలోను, చుట్టుపక్కలా చౌకైన రవాణా సేవను నడుపుతున్నాయి. జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా అవి చేరుకుంటాయి.

నాగ్‌పూర్‌లోని సోనేగావ్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది నాగ్‌పూర్‌ను ముంబై, ఢిల్లీ, షార్జా, దుబాయ్, మస్కట్‌లకు దోహా మీదుగా కలుపుతుంది.

మూలాలు[మార్చు]

  1. Records, Official. "nominal gross district Domestic Product of Maharashtra 2019-20". economy Department, Government of Maharashtra, India. Maharashtra Vidhanmanda. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-09.
  2. Records, Official. "Per capita income Districts of Maharashtra 2019-20". economy Department, Government of Maharashtra, India. Maharashtra Vidhanmanda. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-09.
  3. "Nagpur, India". Whetherbase. Retrieved 2010-07-01.
  4. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 March 2010. Retrieved 1 November 2010.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011 - Nagpur" (PDF). Office of the Registrar General, India. 2011.
  6. 6.0 6.1 Deshpande, Vivek (4 May 2006). "Nagpur stakes claim to lead boomtown pack". The Indian Express. India. Archived from the original on 29 September 2007. Retrieved 22 June 2006.

వెలుపలి లంకెలు[మార్చు]