నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(నాగపూర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నాగ్పూర్ లోకసభ నియోజకవర్గం (Nagpur Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 12 సార్లు విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ సభ్యుడు ఒక్కోసారి విజయం సాధించారు.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు[మార్చు]

 1. నాగపూర్ సౌత్ వెస్ట్
 2. నాగపూర్ దక్షిణ
 3. నాగ్పూర్ తూర్పు
 4. నాగ్పూర్ మధ్య
 5. నాగ్పూర్ పశ్చిమ
 6. నాగ్పూర్ ఉత్తర

విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

 • 1951: అనుసూయాభాయ్ పురుషోత్తం కాలె (కాంగ్రెస్ పార్టీ)
 • 1957: అనుసూయాభాయ్ పురుషోత్తం కాలె (కాంగ్రెస్ పార్టీ)
 • 1962: మాధవ్ శ్రీహరి అనే (ఇండిపెండెంట్)
 • 1967: నరేంద్ర-ఎస్-దియోఘరె (కాంగ్రెస్ పార్టీ)
 • 1971: జంబువంత్‌రావ్ ధోటె (ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్)
 • 1977: గేవ్ మాంచెర్సా అవారి (కాంగ్రెస్ పార్టీ)
 • 1980: జంబువంత్‌రావ్ ధోటె (కాంగ్రెస్ పార్టీ)
 • 1984: బన్వారిలాల్ పురోహిత్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1989: బన్వారిలాల్ పురోహిత్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1991: దత్తా మేఘే (కాంగ్రెస్ పార్టీ)
 • 1996: బన్వారిలాల్ పురోహిత్ (భారతీయ జనతా పార్టీ)
 • 1998: విలాస్ ముత్తెమ్వార్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1999: విలాస్ ముత్తెమ్వార్ (కాంగ్రెస్ పార్టీ)
 • 2004: విలాస్ ముత్తెమ్వార్ (కాంగ్రెస్ పార్టీ)
 • 2009: విలాస్ ముత్తెమ్వార్ (కాంగ్రెస్ పార్టీ)

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విలాస్ ముత్తెమ్వార్ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన బన్వారిలాల్ పురోహిత్‌పై 24,399 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. విలాస్‌కు 3,15,148 ఓట్లు రాగా, బన్వారీలాల్‌కు 2,90,749 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థి మాణిక్‌రావ్ వైద్యకు 1,18,741 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]