రూపాయి

వికీపీడియా నుండి
(Indian rupee నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రూపాయి
रुपया (Hindi)
1000 రూపాయల నోటు వివిధ విలువల నాణేలు
1000 రూపాయల నోటు వివిధ విలువల నాణేలు
ISO 4217 కోడ్ INR
వినియోగదారులు భారతదేశం, భూటాన్
ద్రవ్యోల్బణం 5.3%
మూలం The World Factbook, 2006 est.
Pegged by INR = భూటానీ న్గుల్ట్రమ్

INR = 1.6 నేపాలీ రూపాయి

విభాగాలు
1/100 పైసా
గుర్తు Indian Rupee ₹
నాణేలు
తరచు వాడేవి 25 పైసలు, 50 పైసలు, ₹. 1, ₹. 2, ₹. 5, ₹.10
అరుదుగా వాడేవి 5, 10 పైసలు
బ్యాంకు నోటులు
తరచు వాడేవి 5, 10, 20, 50, 100, 500, 1000 రూపాయలు 2000 NOTE Started 09-11-2016 (csrr)
అరుదుగా వాడేవి 1, 2 రూపాయలు
విడుదల చేసే అధికారం భారతీయ రిజర్వ్ బ్యాంకు
వెబ్ సైటు www.rbi.org.in
మింట్ భారత ప్రభుత్వ మింట్

రూపాయి (Indian Rupee) భారత అధికారిక మారక ద్రవ్యం. రూపాయి చెలామణీని భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది. , Rs, రూ లను రూపాయికి గుర్తుగా వాడుతారు. ISO 4217 పద్ధతి ప్రకారం రూపాయి గుర్తు INR. సంస్కృత పదమైన రూప్యకం (అనగా "వెండి నాణెం") నుండి రూపాయి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపాయిని రూపాయి, రూపీ, రుపయ్యా అని పలుకుతారు. అస్సామీ, బెంగాలీ భాషల్లో మాత్రం రూపాయిని టాకా అని పిలుస్తారు. రూపాయికి వంద పైసలు.

రెండు రూపాయల నోటు

చరిత్ర

[మార్చు]
బ్రిటిషు ఇండియా నాటి 1 రూపాయి నోటు, 1917
బ్రిటిషు ఇండియా నాటి 1 రూపాయి నోటు, వెనుక ప్రక్క
ఫ్రెంచి ఇండియా నాటి 1 రూపాయి, 1938

నాణేలు చెలామణీ చెయ్యడంలో భారత్ కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. (క్రీ.పూ. 16 వ శతాబ్దం). రూపాయిని మొదటి సారిగా షేర్‌షా సూరి ప్రవేశపెట్టాడని భావిస్తున్నారు. ఆ రూపాయికి 40 రాగి నాణేల విలువ ఉండేది. ఇక రూపాయి కాగితాలను మొదటగా ముద్రించినవారు "బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్" (1770-1832), "జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్" (1773-75), (వారన్ హేస్టింగ్స్ స్థాపించాడు), బెంగాల్ బ్యాంక్ (1784-91).

ఆధునిక కాలంలో, మొదట్లో రూపాయి అంటే ఓ వెండి నాణెం. 19 వ శతాబ్దంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలు బంగారంపై ఆధారపడి ఉండేవి. ఆ సమయంలో అమెరికా లోను, ఇతర ఐరోపా ఆక్రమిత దేశాల్లోను అపారమైన వెండి నిల్వలను కనుక్కున్నారు. దాంతో, బంగారంతో పోలిస్తే వెండి విలువ పడిపోయింది. హఠాత్తుగా రూపాయి కొనుగోలుశక్తిని కోల్పోయింది. ఈ ఘటనను "రూపాయి పతనం"గా పిలుస్తారు.

బ్రిటిషు వారి కాలంలో రూపాయికి 16 అణాలు. ఒక్కో అణాకు 6 పైసలు లేదా 12 పై లు. 1815 వరకు, మద్రాసు ప్రెసిడెన్సీ ఫానం అనే ద్రవ్యాన్ని చెలామణీ చేసేది. 12 ఫానాలు ఒక రూపాయికి సమానం.

స్వాతంత్ర్యానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాదు రూపాయి, కచ్ కోరీ.. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ ద్రవ్యం ఉండేది. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక, వీటన్నిటినీ తీసివేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు.

1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించి, ఈ పైసలను నయా (హిందీలో "కొత్త") పైసలుగా పిలిచారు. తరువాతి కాలంలో నయా అనేది మరుగున పడిపోయింది. "డేనిష్ ఇండియన్ రూపాయి"ని 1845 లోను, 1954 లో "ఫ్రెంచి ఇండియన్ రూపాయి"ని, 1961లో "పోర్చుగీసు ఇండియన్ ఎస్కుడో"ను తొలగించి ఆ స్థానంలో భారత రూపాయిని ప్రవేశపెట్టారు.

అంతర్జాతీయంగా రూపాయి

[మార్చు]

దేశవిభజన తరువాత మొదట్లో పాకిస్తాను భారత రూపాయినే వాడేది; దానిపై పాకిస్తాను ముద్ర వేసుకునేవారు. గతంలో కువైట్, బహ్రెయిన్, కతర్, యు.ఎ.ఇ, మలేసియా లలో కూడా భారత రూపాయినే అధికారిక ద్రవ్యంగా వాడేవారు. దేశం బయట చెలామణీ కోసమై, ప్రత్యేకంగా గల్ఫ్ రూపీని 1959 మే 1 నాటి చట్టసవరణ ద్వారా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బంగారం దొంగరవాణా ద్వారా దేశ విదేశీ మారక ద్రవ్యంపై వస్తున్న వత్తిడిని తగ్గించందుకు గాను ఈ చర్య తీసుకున్నారు. 1966 జూన్ 6 న భారత్ తన ద్రవ్య విలువను తగ్గించినపుడు అప్పుడు గల్ఫ్ రూపీని వాడుతున్న ఒమన్, కతర్, ఇప్పటి యు.ఎ.ఇ లోని దేశాలు గల్ఫ్ రూపీ స్థానంలో తమ తమ ద్రవ్యాలను ప్రవేశపెట్టాయి. కువైట్ 1961 లోను, బహ్రెయిన్ 1965 లోను ఆ పని చేసేసాయి.

నేపాల్ లో భారత్ సరిహద్దుకు దగ్గరి పట్టణాల్లో భారత రూపాయిని తీసుకుంటారు. ఇంగ్లండు లోని కొన్ని భారతీయ దుకాణాల్లో కూడా రూపాయిని తీసుకుంటారు.

నాణేలు, నోట్లు

[మార్చు]
ద్రవ్యమానం చిహ్నం
చెలామణీలో ఉన్న నాణేలు [1]
Value సాంకేతిక అంశం వివరం తేదీ
వ్యాసం బరువు తయారీ ఆకారం బొమ్మ బొరుసు మొదటి ముద్రణ చివరి ముద్రణ
5 పైసలు 22 మి.మీ. (diagonal) 1.5 గ్రా అల్యూమినియం చతురస్రం భారత ఎంబ్లెమ్ విలువ 1957 1994
10 పైసలు 16 మి.మీ. 2 గ్రా ఇనుపధాతువుతో కూడినది స్టెయిన్ లెస్ స్టీల్ గుండ్రం 1961 1998
20 పైసలు 27 మి.మీ. (longest) 2.2 గ్రా అల్యూమినియం షడ్భుజి 1982 1994
25 పైసలు 19 మి.మీ. 2.83 గ్రా ఇనుపధాతువుతో కూడినది స్టెయిన్ లెస్ స్టీల్ గుండ్రం భారత ఎంబ్లెమ్, విలువ ఖడ్గమృగం 1973
50 పైసలు 22 మి.మీ. 3.79 గ్రా భారత పార్లమెంటు, భారత మ్యాపు
₹. 1 25 మి.మీ. 4.85 గ్రా భారత ఎంబ్లెమ్ విలువ, గోధుమ 1976
₹. 2 26 మి.మీ. 6 గ్రా క్యుప్రోనికెల్ ఏకాదశభుజి భారత ఎంబ్లెమ్, విలువ భారత జండా, భారత మ్యాపు 1990
₹. 5 23 మి.మీ. 9 గ్రా గుండ్రం భారత ఎంబ్లెమ్ విలువ, పువ్వు 1992

చెలామణీలో ఉన్న నాణేలు 25 పైసలు (పావలా), 50 పైసలు (అర్థ రూపాయి), ₹. 1, ₹. 2 and ₹. 5.

  • 5, 10, 20 పైసల నాణేలు చెలామణీలో ఉన్నప్పటికీ, వాటి వాడకం తగ్గి, క్రమేణా కనుమరుగవుతున్నాయి.
మహాత్మా గాంధీ శ్రేణి [2]
బొమ్మ వైపు Value కొలతలు ముఖ్యమైన రంగు వివరణ జారీ తేదీ
బొమ్మ అచ్చు
₹. 5 117 × 63 మి.మీ. ఆకుపచ్చ మహాత్మా గాంధీ ట్రాక్టరు 2002
₹. 10 137 × 63 మి.మీ. కాషాయం - వంగ ఖడ్గమృగం, ఏనుగు, పులి 1996
₹. 20 147 × 63 మి.మీ. ఎరుపు - కాషాయం తాటిచెట్లు 2002
₹. 50 147 × 73 మి.మీ. వంగ పార్లమెంటు 1997
దస్త్రం:100Rupees.png ₹. 100 157 × 73 మి.మీ. మధ్యలో నీలం - ఆకుపచ్చ, రెండువైపుల బ్రౌను - ఊదా హిమాలయాలు 1996
N/A ₹. 500 167 × 73 మి.మీ. ఆలివ్, పసుపు ఉప్పు సత్యాగ్రహం 1997
పసుపు 2000
₹. 1000 177 × 73 మి.మీ. గులాబీ భారత ఆర్థిక వ్యవస్థ 2000

ప్రస్తుతం చెలామణీలో ఉన్న నోట్లు ₹. 5, ₹. 10, ₹. 20, ₹. 50, ₹. 100, ₹. 500, ₹. 1000. 1996 లో ప్రవేశపెట్టిన ప్రస్తుత నోట్ల శ్రేణిని మహాత్మా గాంధీ శ్రేణి అంటారు.

అన్ని నోట్లూ, నాణేలను భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది. ప్రస్తుతం చెలామణీలో లేని ₹. 1 నోట్లను మాత్రం భారత ప్రభుత్వం జారీ చేసేది. ప్రతీ నోటు మీదా దాని విలువ 17 భారతీయ భాషల్లో ముద్రించి ఉంటుంది.

నాణేలన్నిటినీ భారత ప్రభుత్వ మింటు యొక్క నాలుగు మింట్లలో ముద్రిస్తారు. నోట్లను నాసిక్, దేవాస్, సల్బోని, మైసూరు, హోషంగాబాదు లలో ముద్రిస్తారు.

భాషలు

[మార్చు]
రూపాయి నోటు మీద భాషల పలక

రూపాయల నోట్ల మీద ఆ నోటు విలువ అన్ని జాతీయ భాషల లోను ముద్రించి ఉంటుంది.

భద్రత, స్పర్శ అంశాలు [3])

[మార్చు]

స్పర్శాంశాలు

[మార్చు]

నిరక్షరాస్యులు కూడా తేలికగా తెలుసుకునేలా, చూపులకు, స్పర్శకు తెలిసిపోయే కొన్ని అంశాలను వివిధ ద్రవ్య నోట్లలో పొందుపరచారు.

  • పరిమాణం - నోట్లూ, నాణేలు వేరువేరు పరిమాణాల్లో ఉంటాయి.
  • రంగు - వివిధ నోట్లు వేరువేరు రంగుల్లో ఉంటాయి.
  • ఉపరితలం - అధిక విలువ కలిగిన పెద్ద నోట్లపై వాటి విలువ, మరి కొన్ని ఇతర అంశాలు ఉబ్బెత్తుగా (emboss) ముద్రించబడి ఉంటాయి. అలాగే, దృష్టిదోషం కలవారికి వీలుగా వాటరు మార్కుకు స్థలానికి ఎడమ వైపున వివిధ జామెట్రీ బొమ్మలు (త్రికోణం, చతురస్రం వగైరా) ముద్రించబడి ఉంటాయి.

భద్రతాంశాలు

[మార్చు]
  • వాటరుమార్కు - నోట్లపై గల తెల్లటి స్థలంలో మహాత్మా గాంధీ వాటరు మార్కు ఉంటుంది.
  • భద్రతా తీగ - అన్ని నోట్లకు వెండి రంగులో ఒక భద్రతా తీగ, కొన్ని రాతలతో సహా ఉంటుంది. నోటును కాంతికి ఎదురుగా పెట్టుకుని చూస్తే ఈ రాతలు కనిపిస్తాయి.
  • లేటెంటు బొమ్మ - పెద్ద నోట్లను కంటికెదురుగా, భూమికి సమాంతరంగా పెట్టుకుని చూస్తే అంకెల్లో నోట్ల విలువ కనిపిస్తుంది.
  • సూక్ష్మాక్షరాలు - భద్రతా దారానికి, వాటరుమార్కుకు మధ్య నోటు విలువ అంకెల్లో ముద్రించి ఉంటుంది. భూతద్దం పెట్టి చూస్తేనే ఇది కనిపిస్తుంది.
  • ఫ్లోరసెన్సు - అంకెల పలకలు అల్ట్రా వయొలెట్ కాంతి పడినపుడు ప్రతిఫలిస్తూ ఉంటాయి.
  • కాంతికనుగుణంగా రంగు మారే సిరా - ₹. 500, ₹. 1000 నోట్లపై అంకెలు కాంతిని బట్టి రంగు మారే సిరాతో రాయబడి ఉంటాయి. నోటును చదునుగా పెట్టి చూస్తే ఆకుపచ్చగాను, కొంత కోణం నుండి చూస్తే నీలంగాను కనిపిస్తుంది.
  • ముందూ వెనకా కలిసే బొమ్మ - నోటును కాంతి కెదురుగా ఉంచి చూసినపుడు నోటుపై ముందు, వెనుకల ఉండే పూల డిజైన్లు ఒకదానికొకటి కలిసిపోయి కనపడతాయి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-11-19. Retrieved 2007-01-04.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-10-26. Retrieved 2007-01-04.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-12-30. Retrieved 2007-01-04.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  1. "Rupee gets a new symbol". Retrieved 19 November 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=రూపాయి&oldid=4344029" నుండి వెలికితీశారు