కాశ్మీరు సమస్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాశ్మీరు పటం.
ఐక్యరాజ్యసమితి వారి కాశ్మీరు పటం.

కాశ్మీరు వివాదం లేదా కాశ్మీరు సమస్య అన్నది భారత దేశం, పాకిస్తాన్, మరియు కొంతమేరకు చైనాల మధ్యనున్న ప్రాదేశిక వివాదం.[1] కాశ్మీరు ప్రధాన అంశంగా భారతదేశం, పాకిస్తాన్ల నడుమ 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధం, 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం, కార్గిల్ యుద్ధము జరిగాయి. అంతేగాక భారతదేశం, పాకిస్తాన్ లు సియాచిన్ గ్లేసియర్ పై పట్టుకోసం పలు ఘర్షణలు చేశాయి. భారతదేశం జమ్ము కాశ్మీర్ మొత్తంపై తన హక్కును ప్రకటిస్తూండగా, దాదాపు 43శాతం భూభాగాన్ని నియంత్రిస్తోంది. భారతదేశం జమ్ము, కాశ్మీర్ లోయ, లడాఖ్, సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాలను పరిపాలిస్తోంది. భారతదేశపు హక్కును పాకిస్తాన్ వివాదపరుస్తోంది, పాకిస్తాన్ దాదాపుగా 37శాతం కాశ్మీర్ ను, ఆజాద్ కాశ్మీర్, గిల్గిత్ బాలిస్తాన్ ల పేరుతో నియంత్రిస్తోంది.[2][3] చైనా ప్రస్తుతం డెమ్చోక్ జిల్లా, షాక్స్ గమ్ లోయ, అక్సాయ్ చిన్ ప్రాంతాలను ఆక్రమించుకుంది. 1962 నాటి భారత్ చైనా యుద్ధం నాడు చైనా ఆక్రమించిననాటి నుంచీ భారతదేశం ఈ ప్రాంతంపై చైనా అధికారాన్ని వ్యతిరేకిస్తోంది.[4]

కాశ్మీరీ చొరబాటుదారులు, భారత ప్రభుత్వం మధ్య ఏర్పడ్డ వివాదానికి మూలకారణం స్థానిక స్వయంప్రతిపత్తి అని ఒక వాదన.[5] 1970 దశకం చివరి నుంచి 1988 వరకూ తప్ప ప్రజాస్వామ్య స్థితిగతులు నెలకోలేదు. 1988 నాటికి పలు ప్రజాస్వామ్య సంస్కరణలు మళ్ళీ స్థానిక పరిస్థితుల కారణంగా వెనక్కిపోయాయి. మళ్ళీ తిరిగి కాశ్మీరులో అల్లకల్లోలం ప్రారంభమైంది.[5] 1987లో జరిగిన వివాదాస్పద రాష్ట్ర ఎన్నికల[6] అనంతరం వేర్పాటువాదం పుంజుకుని, కొందరు రాష్ట్ర శాసన సభ్యులు తిరుగుబాటు దళాలను కూడా ఏర్పరుచుకున్నారు.[7][8][9] జూలై 1988లో వరుసగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు, ప్రదర్శనలు, దాడులతో కాశ్మీరు కల్లోలం ప్రాంభమైంది.

జమ్ము, కాశ్మీర్లో నెలకొన్న సంక్షోభం కారణంగా వేలాదిమంది మరణించినా, [10] క్రమంగా ఇటీవలి సంవత్సరాల్లో వివాదంలో ప్రాణనష్టం తగ్గుతోంది.[11][12]

మూలాలు[మార్చు]

  1. "Q&A: Kashmir dispute". బిబిసి న్యూస్. Retrieved 10 April 2015.
  2. Choudhury, Salah Uddin Shoaib (8 October 2010). "Pakistani rogue policy on Kashmir". Sri Lanka Guardian. Retrieved 29 May 2013.
  3. Durrani, Atiq (4 February 2013). "PAK-INDIA Dialogue: Single-Point-Agenda: KASHMIR". PKKH. Retrieved 18 August 2013.
  4. "Controversies surrounding Republic Day celebrations in South Tibet solved". Retrieved 27 January 2016.
  5. 5.0 5.1 Conflict Summary, India: Kashmir, "Roots of Conflict and the emergence of Kashmir Insurgents" Uppsala Conflict Data Program Conflict Encyclopedia, Retrieved 2016-04-15
  6. "Elections in Kashmir". Kashmirlibrary.org. Retrieved 6 January 2013.
  7. "India Pakistan | Timeline". BBC News. Retrieved 2 February 2010.
  8. "Kashmir: A History Littered With Rigged Elections (by Mushtaq A. Jeelani) – Media Monitors Network". Mediamonitors.net. Retrieved 2 February 2010.
  9. Hussain, Altaf (14 September 2002). "South Asia | Kashmir's flawed elections". BBC News. Retrieved 2 February 2010.
  10. Constable, Pamela (9 June 2002). "A Good Voice Silenced: Kashmir's Loss Is Also Mine". The Washington Post. Retrieved 14 September 2015.
  11. Emily Wax (28 August 2008). "Peaceful Protests in Kashmir Alter Equation for India". The Washington Post. Retrieved 23 November 2010.
  12. Trofimov, Yaroslav (15 December 2008). "A New Tack in Kashmir". The Wall Street Journal. Retrieved 2 February 2010.

ఇతర లింకులు[మార్చు]