ఆపరేషన్ జిబ్రాల్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆపరేషన్ జిబ్రాల్టర్
1965 భారత పాకిస్తాన్ యుద్ధంలో భాగంలో భాగము
తేదీ1965 ఆగస్టు
ప్రదేశంజమ్మూ కాశ్మీరు
ఫలితంపాకిస్తాన్ ఆపరేషను విఫలమైంది
భారత పాకిస్తాన్ యుద్ధం మొదలైంది.Indo-Pakistani War of 1965
ప్రత్యర్థులు

India

Pakistan
సేనాపతులు, నాయకులు
జనరల్ జె.,ఎన్.చౌధురిJoyanto Nath Chaudhuri
బ్రిగే. జెడ్.సి.బక్షీ[1]
మే.జ. అఖ్తర్ హుసేన్ మాలిక్
బలం
100,000 – 200,0005,000 – 40,000
ప్రాణ నష్టం, నష్టాలు
UnknownUnknown

ఆపరేషన్ జిబ్రాల్టర్ అనేది జమ్మూ కాశ్మీరులో కల్లోలం సృష్టించి, భారత్‌కు వ్యతిరేకంగా విప్లవం లేవదీయాలనే పాకిస్తాన్ వ్యూహానికి ఆ దేశం పెట్టుకున్న పేరు. ఈ ఆపరేషన్ పెద్ద వైఫల్యంగా మిగిలిపోయింది. స్పెయిన్‌ను ఆక్రమించుకోవడం కోసం అరబ్బులు జిబ్రాల్టర్‌ రేవు నుండి మొదలుపెట్టిన దాడిని తలపించేలా పాకిస్తాన్ ఈ ఆపరేషన్‌కు ఆ పేరు పెట్టుకుంది.[2]

1965 ఆగస్టులో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఆజాద్ కాశ్మీరు బలగాలు[3][4] స్థానికుల వేషాల్లో జమ్మూ కాశ్మీరులోకి చొరబడ్డారు. కాశ్మీరు ముస్లిముల్లో వేర్పాటు భావాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో వీరు చొరబడ్డారు. అయితే, సరైన సమన్వయం లేక వీళ్ళ అసలు రూపాలు బయటపడి, పథకం మొదట్లోనే బెడిసికొట్టింది. ఈ ఆపరేషన్ 1965 నాటి భారత పాకిస్తాన్ యుద్ధానికి దారితీసింది.

నేపథ్యం

[మార్చు]

1947 లో దేశ విభజన సమయంలో సరిహద్దులను నిశ్చయించే కమిషను నేత సిరిల్ రాడ్‌క్లిఫ్, ముస్లిములు ఎక్కువగా నివసించే ప్రాంతాలను పాకిస్తాన్‌లో చేరుస్తూ సరిహద్దులను నిశ్చయించాడు. కానీ జమ్మూ కాశ్మీరు, గుర్దాస్‌పూర్, ఫెరోజ్‌పూర్ వంటి ప్రాంతాల్లో ముస్లిములు మెజారిటీగా ఉన్నప్పటికీ, ఆయా సంస్థానాధీశులు కోరుకున్నందువలన వాటిని భారత్‌లో కలిపాడు. ఇది 86% ముస్లిములున్న కాశ్మీరులో తీవ్ర వ్యతిరేకత రేకెత్తించింది. కాశ్మీరుపై భారత పాక్ యుద్ధాలకు ఇది ప్రాతిపదిక. 1962 భారత చైనా యుద్ధం తరువాత భారత సైన్యం పునర్నిర్మాణ దశలో ఉన్నపుడు, దాడికి అది సదవకాశంగా పాకిస్తాన్ భావించింది.

సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ వాయుసేన, ఆర్మరీ రెండూ నాణ్యతాపరంగా భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి.[5] 1965 నాటి రాన్ ఆఫ్ కచ్ ఘటనలో పాకిస్తాన్‌కు కాస్త అనుకూల ఫలితం రావడం కూడా పాకిస్తాన్‌కు ప్రోత్సాహం కలిగించింది. పైగా 1963 డిసెంబరులో శ్రీనగర్ లోని హజరత్‌బల్ మసీదు నుండి పవిత్ర జ్ఞాపిక అదృశ్యమవడంతో కాశ్మీరంతటా[6] ముస్లిముల్లో అశాంతి రేకెత్తింది. తిరుగుబాటు చేసేందుకు ఇది అనుకూల సమయంగా పాకిస్తాను భావించింది.[7] ఈ అంశాలన్నీ, దొంగచాటు దెబ్బతీసేందుకు, పూర్తిస్థాయి యుద్ధం అనే భయాన్ని కలిగించేందుకూ, తద్వారా కాశ్మీరుపై ఒక పరిష్కారం సాధించేందుకూ ఇది మంచి సమయంగా పాకిస్తాన్ నేతలు భావించారు.[8][9][10]

పథకం అమలు

[మార్చు]
బలగం పేరు ఆపరేషన్ ప్రాంతం
సలాహుద్దీన్ శ్రీనగర్ లోయ
ఘజ్నవీ మెహందర్-రాజౌరీ
తారిఖ్ కార్గిల్-ద్రాస్
బాబర్ నౌషేరా-సుందర్‌బానీ
ఖాసిమ్‌ బందీపురా-సోనార్‌వైన్
ఖాలిద్ ఖాజీనాగ్-నౌగావ్
నస్రత్ తిత్వాల్-తంగ్‌ధార్
సికందర్ గురేజ్
ఖిల్జీ కేల్-మినిమార్గ్

పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ మొదట్లో వ్యతిరేకించినప్పటికీ ఆపరేషన్ను మొదలుపెట్టారు. 1965 జూలై, ఆగస్టుల్లో పాకిస్తాన్ బలగాలు పీర్ పంజల్ పర్వతాల వద్ద నియంత్రణ రేఖను దాటి గుల్మార్గ్, యూరి, బారాముల్లా లోకి ప్రవేశించాయి. భారతీయ వర్గాల ప్రకారం 30,000[11] – 40,000 మంది పాకిస్తాన్ సైనికులు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడ్డారు. పాకిస్తానీ వర్గాలు ఈ సంఖ్యను 5,000 -7,000 మాత్రమే అని పేర్కొన్నాయి.[12] "జిబ్రాల్టర్ ఫోర్స్" అని పిలిచే ఈ బలగాలు[1] మేజర్ జనరల్ అఖ్తర్ హుసేన్ మాలిక్ నేతృత్వంలో నడిచాయి. ఈ సేననును 9 బలగాలుగా (ఒక్కొక్క దానిలో 5 కంపెనీలు) విభజించారు. ఒక్కో దానికీ ఒక్కో చారిత్రిక ముస్లిము పాలకుని పేరుతో ఒక్కో సంకేత నామం పెట్టారు.

చొరబాటుదార్లు స్థానికులలో కలిసిపోయి తిరుగుబాటుకై వారిని రెచ్చగొడతారు. ఈలోగా వారు గెరిల్లాయుద్ధ పద్ధతిలో వంతెనలు, సొరంగాలు, రోడ్లు, విమానాశ్రయాల పైనా దాడి చేస్తారు.[13] దీంతో కాశ్మీరులో సాయుధ విప్లవ పరిస్థితులు నెలకొని, దేశవ్యాప్తంగా తిరుగుబాటు జరుగుతుంది - ఇదీ పాకిస్తాన్ పాలకుల ప్రణాళిక. భారత్ దీన్ని ఎదుర్కోలేదని,[14] పూర్తిస్థాయి యుద్ధానికి అసలే సిద్ధపడదనీ, తద్వారా కాశ్మీరు ఆక్రమణ త్వరితంగా నెరవేరుతుందనీ వాళ్ళు భావించారు. మొత్తం 9 దళాల్లోనూ మేజర్ మాలిక్  మునావర్ ఖాన్ అవాన్ నేతృత్వంలోని దళం మాత్రమే మెహందర్-రాజౌరీ ప్రాంతంలో తమ లక్ష్యాన్ని చేరుకోగలిగింది. [15][16][17][18]

వైఫల్యానికి కారణాలు

[మార్చు]
జమ్మూ కాశ్మీరులో వందలాదిగ చొరబాటుదార్లు ఉన్నారని ధ్రువీకరించే అమెరికా విదేశాంగశాఖ టెలిగ్రాము

ఈ ఆపరేషన్ పూర్తి వైఫల్యం చెందినప్పటికీ, అసలీ పథకమే లోపభూయిష్టమనే అబిప్రాయంపై సైనిక విశ్లేషకులు విభేదిస్తారు. పథకం సరైనదే అయినప్పటికీ, అమలు సరిగ్గా జరగలేదని కొందరన్నారు. కానీ, పాకిస్తానీ తటస్థ పరిశీలకులంతా ఇదొక మొరటు ప్రయత్నమని అంగీకరించారు. [19] కాశ్మీరీ ప్రజలు భారత ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, పాకిస్తాన్ సైనికుల మద్దతు లభించగానే భారత్‌పై తిరుగుబాటు చేస్తారనీ భావించడంతోటే పాకిస్తాన్ సైన్యపు వైఫల్యం మొదలైంది. కాశ్మీరీ ప్రజలు తిరుగుబాటు చెయ్యక పోగా, ఈ పాకిస్తాన్ చొరబాటుదార్ల గురించి వాళ్ళు భారత సైన్యానికి తెలియజేసారు. దాంతో తాము ఎదుర్కొంటున్నది పాకిస్తాన్ సైనికులనేనని భారత సైన్యానికి అర్థమైపోయింది.[20]

వివిధ సైనిక బలగాల మధ్య సమన్వయం కూడా కొరవడింది.[21] పాకిస్తాన్ రచయిత ఇక్బాల్ చీమా ప్రకారం, సైనిక దళాధిపతి మొహమ్మద్ మూసా, ఈ పథకం కచ్చితంగా విజయవంతమౌతుందని, ఇతర సైనిక బలగాల జోక్యం అవసరం ఉండదనీ భావించి, ఈ ఆపరేషన్ సంగతి వాయుసేనకు అసలు చెప్పనే లేదు. పాకిస్తాన్ సైనికాధికారులకు, రాజకీయ నాయకులకూ కూడా ఈ సంగతి తెలియదు. అంటే, ఈ పథకం భారత్‌ను ఎంత ఆశ్చర్యపరచిందో పాకిస్తాన్‌ను కూడా అంతే ఆశ్చర్యపరచింది.[22] ఈ పథకం విఫలమైతే, భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందనీ, అది వాంఛనీయం కాదనీ భావించిన చాలామంది సీనియర్ అధికారులు, ఈ పథకాన్ని వ్యతిరేకించారు.[23][24][25][26]

ఇవి కూడా చూడండి

[మార్చు]

నోట్స్

[మార్చు]
  1. 1.0 1.1 Rao, K. V. Krishna (1991). Prepare or perish: a study of national security. Lancer Publishers. p. 123. ISBN 978-81-7212-001-6.
  2. Riedel, Bruce O. (29 January 2013), Avoiding Armageddon: America, India, and Pakistan to the Brink and Back, Brookings Institution Press, pp. 67–, ISBN 0-8157-2409-8
  3. Karim, Maj Gen Afsir (4 April 1981). "Azad Kashmir Regular Forces". Kashmir-The Troubled Frontiers.
  4. Snedden, Christopher (2 January 2012). "Azad Kashmir Regular Force". Kashmir-The Untold Story.
  5. "India and the United States estranged democracies", 19411991, ISBN 1-4289-8189-6, DIANE Publishing, pp 235, 238
  6. It is believed to be the hair of Islamic prophet Muhammad, the founder of Islam
  7. Kashmir in Conflict: India, Pakistan and the Unending War By Victoria Schofield Published by I.B.Tauris, pp 108, ISBN 1-86064-898-3, 2003
  8. The Jammu and Kashmir conflict Overview by Meredith Weiss 25 June 2002 – Hosted on Yale University
  9. "The Fate of Kashmir International Law or Lawlessness?". Archived from the original on 2012-01-18. Retrieved 2017-09-10.
  10. Pak Radio's claim of India starting 1965 war falls flat Archived 2012-02-07 at the Wayback Machine Malaysia Sun 21 September 2007
  11. Karim, Major General Afsir (retd) (19 September 2005). "The 1965 War: Lessons yet to be learnt". The Rediff Special. Rediff.com India Ltd. Retrieved 2007-07-08.
  12. Grand Slam — A Battle of Lost Opportunities Archived 2018-12-26 at the Wayback Machine by Major (Retd.
  13. My Frozen Turbulence in Kashmir (7th Edition), pp 409
  14. Faruqui, Ahmad. "Remembering 6th of September 1965". Pakistan Link. Archived from the original on 2007-09-30. Retrieved 2007-07-08.
  15. Almeida, Cyril (30 August 2015). "Gibraltar, Grand Slam and war". Dawn.
  16. Sawant, VSM, Brigadier Chitranjan (20 July 2015). "Operation Gibraltar". Aryasamaj. Archived from the original on 25 డిసెంబరు 2017. Retrieved 10 September 2017.
  17. Bajwa, Farooq (12 March 2010). "OPERATION GIBRALTAR". From Kutch to Tashkent:The Indo-Pakistan War of 1965.
  18. Chadha, Vivek (1 April 2012). "Low Intensity Operations in India". Low Intensity Conflicts in India: An Analysis.
  19. South Asia in World Politics By Devin T. Hagerty, 2005 Rowman & Littlefield, ISBN 0-7425-2587-2, pp 26
  20. Mankekar, D. R. (1967). Twentytwo fateful days: Pakistan cut to size. Manaktalas. pp. 62–63, 67. Retrieved 8 November 2011.
  21. "Nur Khan reminisces '65 war". Pakistan's Dawn (newspaper). 6 September 2005. Retrieved 2006-07-08.
  22. Kashmir in the Shadow of War: regional rivalries in a nuclear age By Robert G. Wirsing Pg 158
  23. "Opinion: The Way it was 4: extracts from Brig (retd) ZA Khan's book". Defence Journal. Dynavis (Pvt) Ltd. May 1998. Archived from the original on 2010-11-13. Retrieved 2007-07-08.
  24. "Is a Kashmir solution in the offing?". Centre for Aerospace Power Studies. Archived from the original on 2007-10-12. Retrieved 2007-07-08.
  25. "Brig (Retd) Saeed Ismat, SJ in a Q&A session ("What do you have to say about 1965 war?")". Defence Journal. November 2001. Archived from the original on 2007-09-30. Retrieved 2007-07-08.
  26. Refer to the main article Second Kashmir War for a detailed referenced analysis on the post-war fallout.

మూలాలు

[మార్చు]