అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన
Indo-Pakistani wars and conflictsలో భాగము
Pakistan Navy Breguet 1150 Atlantic Asuspine-1.jpg
పాకిస్తాన్ నేవీ యొక్క అట్లాంటిక్
తేదీ1999 ఆగస్టు 10
ప్రదేశంరాన్ ఆఫ్ కచ్ వద్ద ఉన్న భారత పాక్
అంతర్జాతీయ సరిహద్దు
ఫలితంభారతీయ వాయుసేన పాకిస్తాన్ నిఘా 
విమానాన్ని అడ్డుకుని కూల్చివేసింది.
భారత పాక్ సంబంధాల క్షీణత
ప్రత్యర్థులు
 భారతదేశం పాకిస్తాన్
సేనాపతులు, నాయకులు
అటల్ బిహారీ వాజపేయీ
భారత ప్రధానమంత్రి
ఎయిర్ ఛీఫ్ మార్షల్ అనిల్ టిప్నిస్
వాయుసేన ప్రధానాధికారి
నవాజ్ షరీఫ్
పాకిస్తాన్ ప్రధానమంత్రి
అడ్మిరల్ ఫసీ బొఖారి
నౌకాదళ ప్రధానాధికారి
బలం
2 మిగ్-21 విమానాలు1 అట్లాంటిక్-91 విమానం
ప్రాణ నష్టం, నష్టాలు
లేరు5 గురు అధికారులు, 11 మంది నావికులు మరణించారు

పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన అట్లాంటిక్ విమానాన్ని భారత వాయుసేన విమానాలు కూల్చివేసిన ఘటనే అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన. 1999 ఆగస్టు 10 న 16 మంది ప్రయాణీకులతో కూడిన పాకిస్తాన్ వాయుసేనకు చెందిన బ్రెగెట్ అట్లాంటిక్ గస్తీ విమానం భారత గగనతలాన్ని అతిక్రమించగా, భారత వాయుసేనకు చెందిన మిగ్ 21 విమానాలు దాన్ని కూల్చివేసాయి. కార్గిల్ యుద్ధం ముగిసిన నెలలోపే జరిగిన ఈ సంఘటన అప్పటికే ఉద్రిక్తంగా ఉన్న రెండు దేశాల సంబంధాలను మరింత తీవ్రతరం చేసాయి.

పాకిస్తాన్ సైన్యం, తమ దేశంలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలను సంఘటన స్థలానికి తీసుకువెళ్ళి చూపించింది. ఆ విమానం సరిహద్దును అతిక్రమించి ఉండొచ్చని దౌత్యవేత్తలు భావించారు. భారత ప్రతిచర్య సమర్థనీయం కాదని కూడా వాళ్ళు భావించారు.[1]

తరువాత పాకిస్తాన్ ఈ సంఘటనను అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకువెళ్ళి, భారత్‌ నుండి నష్ట పరిహారం ఇప్పించాలని కోరింది. ఈ కేసును విచారించే అధికార పరిధి తమకు లేదని చెబుతూ కోర్టు ఆ కేసును కొట్టివేసింది.[2][3][4]

ఘటన[మార్చు]

ఫ్రాన్సు తయారుచేసిన బ్రెగెట్ అట్లాంటిక్ విమానం - 29 స్క్వాడ్రనుకు చెందిన అట్లాంటిక్-91 [5] పాకిస్తానుకు చెందిన ముఖ్యమైన విమానాల్లో ఒకటి. దీన్ని ప్రధానంగా గస్తీకి, నిఘాకూ వాడుతారు. సింద్‌లోని మెహ్రాన్ నౌకా స్థావరం నుండి ఉ 9:45 (భారత కాలమానం) కు బయలుదేరిన అట్లాంటిక్-91, భారత సరిహద్దును సమీపిస్తూండగా భారత భూస్థిత రాడార్లు దాన్ని పసిగట్టాయి.[6] దానిని అడ్డగించేందుకు, భారత వాయుసేన యొక్క 45 వ స్క్వాడ్రనుకు చెందిన రెండు మిగ్-21 విమానాలు కచ్ లోని నలియా వైమానిక స్థావరం నుండి బయలుదేరాయి.[7] అనేక ప్రయత్నాల తరువాత, పాకిస్తాన్ విమానాన్ని కూల్చివేయమని ఆ రెండు విమానాలకు ఆదేశాలందాయి. భారత కాలమానం ప్రకారం ఉ 11:17 గంటలకు, అంటే అట్లాంటిక్-91 విమానం గాల్లోకి ఎగిరిన రెండు గంటలకు, మిగ్ విమాన పైలట్ పి.కె. బుందేలా దానిపై ఇన్‌ఫ్రారెడ్ హోమింగ్ R-60 (గాల్లోంచి-గాల్లోకి ప్రయోగించే) క్షిపణిని పేల్చాడు. అది అట్లాంటిక్-91 యొక్క ఎడమ ఇంజన్ను ఛేదించింది.[8] దీంతో విమానం నియంత్రణ కోల్పోయి, గింగిరాలు తిరుగుతూ సుమారు 11:30 గంటల సమయంలో 23°54′N 68°16′E / 23.900°N 68.267°E / 23.900; 68.267 ప్రదేశంలో కూలిపోయింది. విమానంలో ఉన్న 16 మందీ (పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన ఐదుగురు ఆఫీసర్లతో సహా) మరణించారు.

1971 నాటి భారత పాక్ యుద్ధం తరువాత పాకిస్తాన్ నౌకాదళం ఒక విమానాన్ని కోల్పోవడంగానీ, ఇంతమంది ప్రాణాలను కోల్పోవడం గానీ ఇదే ప్రథమం.

వాద ప్రతివాదాలు[మార్చు]

సంఘటన జరిగిన కచ్ ప్రాంతం (ఎరుపు రంగులో)

ఈ ఘటన రెండు దేశాల మధ్యా వాద ప్రతివాదాలకు దారితీసింది. విమానం నిరాయుధంగా ఉందని, విమాన శకలాలు పాకిస్తాన్ భూభాగంలోనే పడ్డాయని, అది భారత గగన తలాన్ని అతిక్రమించలేదనీ పాకిస్తాన్ వాదించింది.[9] పాకిస్తాన్ వాదనల ప్రకారం, ఆ విమానం శిక్షణ కార్యకలాపాల నిమిత్తమై పాకిస్తాన్ గగనతలంలోనే ఎగురుతోంది.[10] మరణించిన సైనికుల సంస్మరణలో పాల్గొన్న పాకిస్తాన్ ప్రధాని, ఈ కూల్చివేతను ఆటవిక చర్యగా వర్ణించాడు.[11]

Enlarged map of the region showing Kori Creek and Sir Creek area, where the plane was shot down and wreckage was found respectively.

భారత వైమానిక దళం, "ఈ విమానం అంతర్జాతీయ ప్రోటోకోల్‌కు అనుగుణంగా స్పందించలేదు. పైగా సంఘర్షణాత్మకంగా వ్యవహరించింది", అని చెప్పింది.[12][13] విమాన శకలాలు విస్తారమైన ప్రదేశంలో పడే అవకాశముందని కూడా వాయుసేన తెలిపింది. భారత వర్గాలు, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఆ విమానం నిఘా పనులలో ఉందని ప్రకటించాడని తెలిపింది. 1991 లో భారత పాకిస్తాన్‌లు కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఈ విమానం ఉల్లంఘించిందని కూడా భారత్ ఆరోపించింది. ఈ ఒప్పందం ప్రకారం, సైనిక విమానం ఏదీ కూడా సరిహద్దుకు 10 కి.మీ. దూరం లోపు రాకూడదు.[14] (అట్లాంటిక్ దాడిచేసే విమానం కాదని పాకిస్తాన్ వాదించింది). అసలు ఇతర వాయుసేనలకు చెందిన శిక్షణ విమానాలన్నీ సరిహద్దుకు చాలా దూరంగా, స్పష్టంగా గుర్తించిన శిక్షణ స్థలాల్లో ఎగురుతూండగా ఈ శిక్షణ విమానం సరిహద్దుకు అంత దగ్గరగా ఎందుకు ఎగురుతోందని భారత్ ప్రశ్నించింది.[15] భారత్ వాదన ఇంకా ఇలా ఉంది: "అట్లాంటిక్-91 విమానం నౌకాదళానికి చెందినది. సముద్రంపై ఎగరాల్సిన ఈ విమానం భూతలంపై, విదేశీ గడ్డపై ఇంత లోపలికి రావాల్సి వచ్చిందంటే అది నిఘా పనిలో ఉందని తెల్లమౌతోంది". సంఘటన జరిగిన తరువాతి రోజున భారత్, విమాన శకలాలను దిల్లీ విమానాశ్రయంలో ప్రదర్శించింది. ఈ శకలాలను భారత హెలికాప్టర్లు పాకిస్తాన్ భూభాగం నుండి సేకరించాయని పాకిస్తాన్ వాదించింది.

భారత వాదన ప్రకారం, మిగ్ విమానాలు అట్లాంటిక్‌ను దగ్గరలోని భారత స్థావరానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే పాకిస్తాన్ విమానం హఠాత్తుగా సరిహద్దు వైపు దూసుకువెళ్ళేందుకు ప్రయత్నించింది; అప్పుడే భారత విమానాలు దానిపై దాడి చేసాయి. సరిహద్దుకు రెండువైపులా 2 కి.మీ. వరకూ శకలాలు పడ్డాయని భారత్ చెప్పింది. చొరబాటు కోరి క్రీక్‌ వద్ద 10 కి.మీ. వరకూ జరిగిందని భారత్ తెలిపింది. పాకిస్తాన్ ఈ సంఘటనను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పింది. గతంలోను ఈ ప్రాంతంలో గగనతల ఉల్లంఘనలు జరిగాయని, గత సంవత్సరం పాకిస్తాన్‌కు చెందిన మానవరహిత నిఘా విమానం భారత గగన తలంలోకి 150 కి.మీ. దూరం చొరబడి భుజ్ వైమానిక స్థావరం దరిదాపుల్లోకి రాగా, భారత వైమానిక దళం దాన్ని క్షిపణులతో కూల్చివేసిందనీ భారత అధికారులు తెలిపారు.[16]

భారతీయ విశ్లేషకులు, రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఘర్షణలు మామూలేనని, ద్వైపాక్షిక ఒప్పందాలున్నా ఇరుపక్షాలు కూడా గతంలో చొరబాట్లు చేసాయనీ చెప్పారు. అందుచేత, అట్లాంటిక్ విమానం కూల్చివేత ఆశ్చర్యం కలిగించింది. 1999 జనవరి తరువాత పాకిస్తాన్ సైనిక విమానాలు కనీసం 50 సార్లు భారత గగన తలాన్ని అతిక్రమించాయని భారత అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన అట్లాంటిక్ విమానాలు భారత భూభాగంపై ఎగరడం, హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళ నౌకలకు దగ్గరగా రెచ్చగొట్టేలా ఎగురుతూ ఉన్న వీడియో టేపులను కూడా చూపారు.[17] కొందరు భారత విశ్లేషకులు, 1983 లో ఇలాంటి సంఘటనలోనే అట్లాంటిక్‌ను దాదాపుగా కూల్చేసిన విషయాన్ని చెబుతూ, అలాంటివే మరికొన్ని ఘటనల గురించి కూడా చెప్పారు.[18][19][20]

అట్లాంటిక్ భారత గగన తల రక్షణ వ్యవస్థ గురించి కూపీ లాగుతూ ఉండిఉండవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. పాకిస్తాన్ చేపట్టిన సైనిక చర్య లాంటి దానిలో ఇది భాగం కాకపోవచ్చని వాళ్ళు చెప్పారు.[17] కూల్చివేత స్థలాన్ని సందర్శించిన విదేశీ దౌత్యవేత్తలు ఆ విమానం నిషేధిత ప్రాంతంలోకి వెళ్ళి ఉండొచ్చని భావించారు. విమానం సరిహద్దుకు అంత దగ్గరగా ఎందుకు ఎగురుతోందో పాకిస్తాన్ చెప్పలేకపోయిందని కూడా వారు అన్నారు. భారత ప్రతిచర్య సమర్ధనీయం కాదని కూడా అన్నారు.[21] జి8 దేశాలు, భద్రతా సమితిలోని దేశాలతో సహా అనేక దేశాలు, పాశ్చాత్య మీడియా పాకిస్తాన్ విమానం సరిహద్దుకు అంత దగ్గరగా ఎగరడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాయి.[22]

ఉద్రిక్తతలు పెరిగాయి [మార్చు]

దాడి జరిగిన మరుసటి రోజున పాత్రికేయులను ఘటనా స్థలానికి తీసికొని వెళ్తున్న భారత వాయుసేన హెలికాప్టరుపై పాకిస్తాన్ నావికాదళం భూమ్మీంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణిని పేల్చింది. పాకిస్తాన్ మాత్రం తమ గగనతలాన్ని అధిగమించిన రెండు భారత వాయుసేన విమానాలపై క్షిపణి కాల్పులు జరిపామని ప్రకటించింది. హెలికాప్టరులో ప్రయాణిస్తున్న అంతర్జాతీయ, భారత పాత్రికేయులు, ఆకాశంలో పెద్ద వెలుగు కనిపించిందని, హెలికాప్టరు అల్లల్లాడిపోయిందనీ చెప్పారు. క్షిపణి కాల్పులను ఇది సూచిస్తోంది.[23] భారత వాయుసేన, భారత గడ్డపై పడ్డ శకలాలను చూపించే ఆ ప్రయాణాన్ని అంతటితో ఆపేసింది.[17]

దీని తరువాత రాన్ ఆఫ్ కచ్‌కు దగ్గర్లోని రెండు దేశాల సైనిక బలగాలను అత్యంత తీవ్ర స్థాయి అప్రమత్తతతో ఉంచారు.[11] పాకిస్తాన్ తమ నావికులను భుజం మీద నుండి ప్రయోగించే ఇన్‌ఫ్రారెడ్ హోమింగ్ లేసర్ గైడెడ్ క్షిపణులతో సహా సంఘటన స్థలానికి పంపించింది.[24] కార్గిల్ యుద్ధం ముగిసిన వెంటనే జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ, ఉపఖండంలో "తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నట్లు"గా ప్రకటించింది.[11]

కోర్టులో దావా[మార్చు]

తమ పరిధిలో లేదంటూ అంతర్జాతీయ న్యాయస్థానం కేసును కొట్టివేసింది

1999 సెప్టెంబరు 21 న పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది. భారత్ నిరాయుధంగా ఉన్న విమానాన్ని కూల్చివేసిందని, అందుకు నష్టపరిహారాన్ని ఇప్పించాల్సిందనీ ఈ దావాలో పాకిస్తాన్ కోర్టును కోరింది. విమానం కోసం 6 కోట్ల డాలర్లతో పాటు, బాధిత కుటుంబాలకు పరిహారమూ ఇప్పించాలని పాకిస్తాన్ కోరింది. ఈ కేసు కోర్టు పరిధిలో లేదంటూ భారత అటార్నీ జనరల్, సోలి సొరాబ్జీ వాదించాడు.[25] భారత్‌కు ఇతర కామన్‌వెల్త్ రాజ్యాలకూ మధ్య వివాదాలకు, బహుళపక్ష ఒప్పందాల విషయంలో తలెత్తే వివాదాలకూ మినహాయింపు ఇవ్వాలని 1974 లో భారత్ వేసిన దావాను ఈ సందర్భంలో ఉదహరించారు.[26] పాకిస్తాన్ 1991 నాటి ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కూడా భారత్ తన వాదనలో ఎత్తి చూపింది. ఆ ద్వైపాక్షిక ఒప్పందం ఇలా అంటోంది: "దాడి విమానాలు (బాంబర్లు, నిఘా విమానాలు, సైనిక శిక్షణ విమానాలు, సాయుధ హెలికాప్టర్లతో సహా) ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌తో సహా పరస్పర గగనతలం నుండి 10 కి.మీ. లోపు ఎగరరాదు."

2000 జూన్ 21 న ఫ్రాన్సుకు చెందిన గిల్బర్ట్ గిల్లామ్‌ నేతృత్వంలోని 16 జడ్జీల బెంచి, భారత్ వాదనకు అనుకూలంగా 14-2 తేడాతో తీర్పు నిచ్చింది.[27][28] పాకిస్తాన్ వా దనను అప్పీలుకు అవకాశం లేకుండా తోసిపుచ్చారు. ఈ తీర్పు భారత్‌కు అత్యంత అనుకూలంగా ఉందని భావించారు.[29][30][31] ఈ కేసుపై పాకిస్తాన్ ప్రభుత్వం దాదాపు 2.5 కోట్ల పాకిస్తాన్ రూపాయలను (దాదాపు 4 లక్షల డాలర్లు) ఖర్చు చేసింది.[32]

పర్యవసానాలు[మార్చు]

ఈ ఘటన తరువాత భారత్‌లో ఆ ఇద్దరు మిగ్-21 పైలట్లు హీరోలై పోయారు.[33] 2000 అక్టోబరు 8 న స్క్వాడ్రన్ లీడర్ పి.కె.బుందేలాకు ప్రతిష్ఠాత్మకమైన వాయుసేనా మెడల్‌ను ప్రదానం చేసారు. అట్లాంటిక్‌ను ట్రాక్ చేసి, పైలట్‌కు దాని గురించి మార్గదర్శనం చేసి, దానిపై దాడి చేయమని ఆదేశించిన ఫ్లైట్ కంట్రోలరు, వింగ్ కమాండర్ వి.ఎస్. శర్మకు, అట్లాంటిక్-91 శకలాలను సరిహద్దు వద్దనున్న చిత్తడి నేలల్లోంచి సేకరించి తెచ్చిన హెలికాప్టరు పైలట్ పంకజ్ విష్ణోయికీ కూడా ఈ మెడల్‌ను ప్రదానం చేసారు.[34]

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ క్లిష్ట పరిస్థితులలోఉన్న సమయంలో అట్లాంటిక్-91 కూల్చివేత జరిగింది. ఇది జరిగిన రెండు నెల్లకే జరిగిన సైనిక కుట్రలో జనరల్ పర్వేజ్ ముషారఫ్ అతణ్ణి పదవి నుండి కూలదోసాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Pakistani plane "may have crossed border" Archived 18 అక్టోబరు 2002 at the Wayback Machine 13 August 1999 BBC Retrieved on 23 July 2007
 2. ICJ's Press Communique on the verdict Archived 15 అక్టోబరు 2016 at the Wayback Machine Retrieved on 23 July 2007.
 3. India wins case against Pakistan Archived 3 మార్చి 2016 at the Wayback Machine 21 June 2000 – The Tribune Retrieved on 23 July 2007
 4. Pakistan dismayed over verdict: ICJ refuses to hear Atlantique case Archived 5 ఫిబ్రవరి 2012 at the Wayback Machine 21 June 2000 – Dawn wire service Retrieved on 23 July 2007
 5. Criminal Occurrence description at the Aviation Safety Network. Retrieved on 23 July 2007.
 6. "The Atlantique Incident". 1999 Kargil Operations. Bharat Rakshak Indian Air Force. Archived from the original on 2 February 2007. Retrieved 9 March 2007.
 7. Air defence operations Archived 19 జూన్ 2010 at the Wayback Machine
 8. "IAF Scores a Kill !". Archived from the original on 2009-07-22. Retrieved 2017-08-21.
 9. A Moiz (1999) Core Negativity Archived 3 మార్చి 2016 at the Wayback Machine
 10. 21 September 1999 Application instituting proceeding Archived 3 మార్చి 2016 at the Wayback Machine
 11. 11.0 11.1 11.2 "Can't Stop the Madness". TIME. 23–30 August 1999 vol 154 NO. 7/8. Archived from the original on 16 సెప్టెంబర్ 2010. Retrieved 21 ఆగస్టు 2017. Check date values in: |date= and |archive-date= (help)
 12. IAF shoots down Pak intruder plane[permanent dead link]; Wednesday, 11 August 1999; EXPRESS NEWS SERVICE; The Indian Express Retrieved on 1 January 2010
 13. "ATLANTIQUE DOWNING: Creek Crisis – The strange encounter in the Rann of Kutch leading to the shooting down of the Pakistani Altantique sets both countries on the path of confrontation again". Archived from the original on 2008-12-22. Retrieved 2017-08-21.
 14. Agreement Between India and Pakistan on the Advance Notice of Military Exercises Archived 22 జూలై 2009 at the Wayback Machine
 15. Atlantic mission had be cleared at the highest levels By Air Commodore Jasjit Singh Archived 19 జూన్ 2010 at the Wayback Machine
 16. Creek Crisis by Vijay Jung Thapa and Aahid Hussain and Uday Mahurkar Archived 22 డిసెంబరు 2008 at the Wayback Machine 23 August 1999 India Today Retrieved on 23 July 2007
 17. 17.0 17.1 17.2 Pakistan Attacks Indian Aircraft in Border Region By Pamela Constable and Kamran Khan Archived 19 మే 2009 at the Wayback Machine 12 August 1999, Washington Post Retrieved on 23 July 2007
 18. Pakistani recce aircraft shot down (Asia-Pacific Report)by S. Mallegol Archived 4 మే 2016 at the Wayback Machine
 19. Cold War in the Arabian Sea Archived 3 మార్చి 2016 at the Wayback Machine
 20. Confidence Building Measures in South Asia – The Maritime Angle Archived 12 అక్టోబరు 2007 at the Wayback Machine
 21. Pakistani plane "may have crossed border" Archived 18 అక్టోబరు 2002 at the Wayback Machine 13 August 1999 BBC Retrieved on 23 July 2007
 22. Zehra, Nasim. "Islamabad's Post-Kargil Challenges". Defence Journal. Archived from the original on 4 March 2014. Retrieved 17 December 2013.
 23. Tensions renew as Pakistan launches missile at Indian military[permanent dead link] by Neelesh Misra Milwaukee Journal Sentinel 12 August 1999 Retrieved on 26 July 2007
 24. Atlantique wreckage image gallery with Archived 27 ఆగస్టు 2016 at the Wayback Machine pictures of Pakistani soldiers Archived 4 మార్చి 2016 at the Wayback Machine using infrared Archived 3 మార్చి 2016 at the Wayback Machine and laser guided Archived 3 నవంబరు 2013 at the Wayback Machine
 25. ICJ begins hearing on Pak complaint Archived 2 మే 2016 at the Wayback Machine 4 April 2000 – The Tribune Retrieved on 10 September 2007
 26. ICJ verdict on jurisdiction in Atlantique case today Archived 23 జూలై 2009 at the Wayback Machine 21 June 2000 – The Hindu Retrieved on 10 September 2007
 27. ICJ's Press Communique on the verdict Archived 15 అక్టోబరు 2016 at the Wayback Machine
 28. Judgment of 21 June 2000 Jurisdiction of the Court Archived 5 ఏప్రిల్ 2016 at the Wayback Machine
 29. India wins case against Pakistan Archived 3 మార్చి 2016 at the Wayback Machine 21 June 2000 – The Tribune Retrieved on 23 July 2007
 30. Pakistan dismayed over verdict: ICJ refuses to hear Atlantique case Archived 5 ఫిబ్రవరి 2012 at the Wayback Machine 21 June 2000 – Dawn wire service Retrieved on 23 July 2007
 31. World court blow for Pakistan Archived 28 మార్చి 2007 at the Wayback Machine
 32. Govt comments sought in Atlantique case Archived 22 జనవరి 2010 at the Wayback Machine 17 July 2002 – Pakistan's Dawn.
 33. Report on Bundela's critical condition who was "a national hero" – 11 June 2002 NDTV Retrieved on 23 July 2007
 34. Vayusena Medal (VM) Archived 6 జూలై 2008 at the Wayback Machine

బయటి లింకులు[మార్చు]