Jump to content

భారత పాక్ యుద్ధం 1965

వికీపీడియా నుండి
(భారత్ పాక్ యుద్ధం 1965 నుండి దారిమార్పు చెందింది)
భారత్ పాక్ యుద్ధం 1965
తేదీఆగస్టు – సెప్టెంబరు 23, 1965
ప్రదేశంభారత ఉపఖండము
ఫలితంఐక్యరాజ్య సమితి ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం[1]. శాశ్వతమైన సరిహద్దు మార్పులు జరగలేదు. (Tashkent Declaration చూడండి).
ప్రత్యర్థులు

భారత్

పాకిస్తాన్
సేనాపతులు, నాయకులు
India జొయన్తో నాత్ చౌదరి
India హర్ బక్ష్ సింగ్
India గుర్ బక్ష్ సింగ్
పాకిస్తాన్ ఆయుబ్ ఖాన్
పాకిస్తాన్ మూసా ఖాన్
పాకిస్తాన్ టిక్కా ఖాన్
పాకిస్తాన్ నాసిర్ అహ్మద్ ఖాన్
బలం
~150 యుద్దవిమానాలు
ప్రాణ నష్టం, నష్టాలు
తటస్థ వ్యక్తుల లెక్కలు [2][3]
  • 3,000 సైనికులు[2]
  • కనీసం 175 యుద్దట్యాంకులు [2]
  • 60–75 యుద్దవిమానాలు[2]
  • 777 km2 (300 mi2) భూభాగం కోల్పోయింది

భారతదేశ లెక్కలు

  • 59 యుద్దవిమానాలు కోల్పోయింది [4]

పాకిస్తాన్ లెక్కలు

  • 110 యుద్దవిమానాలు కోల్పోయింది [5]
తటస్థ వ్యక్తుల లెక్కలు [2]
  • 3,800 సైనికులు [2]
  • 200 యుద్దట్యాంకులు [2]
  • 20 యుద్దవిమానాలు[2]
  • 1,813 km2 (700 mi2) పైచిలుకు భూభాగం కోల్పోయింది
  • పాకిస్తాన్ లెక్కలు

    • 19 యుద్దవిమానాలు కోల్పోయింది

    భారతదేశ లెక్కలు

    • 73 యుద్దవిమానాలు కోల్పోయింది
    • 280 యుద్దట్యాంకులు కోల్పోయింది

    భారత్ పాకిస్తాన్‌ల సరిహద్దుల వద్ద జరిగిన చిన్న తగాదాలు తారస్థాయికి చేరుకోవడంతో భారత్ పాక్ యుద్ధం ప్రారంభమైంది. 1965లో భారత్ పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్దాన్ని రెండవ కాశ్మీర్ యుద్దం అని కూడా అంటారు. మొదటి కాశ్మీర్ యుద్ధం 1947లో జరిగింది. పాకిస్తాన్ తలపెట్టిన ఆపరేషన్ జిబ్రాల్టర్ యుద్దానికి మూల కారణంగా పేర్కొనవచ్చు. ఈ చర్య ముఖ్య ఉద్దేశం భారత్ కు వ్యతిరేకంగా కాశ్మీరులోకి తీవ్రవాదులను చొప్పించడం. ఐదు వారాల పాటు జరిగిన యుద్దంలో ఇరు వైపుల వేలాది మంది సైనికులు చనిపోయారు. చివరికి ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్దం ముగిసింది. ఈ యుద్దం చాలా వరకు నేల మీదే జరిగింది. కాశ్మీరులో భారీ యెత్తున బలగాలను మొహరించారు. వాయు, నావికా దళాల నుంచీ కూడా అవసరమైన సహకారం అందింది. అన్ని భారత్ పాక్ యుద్దాల లాగే ఈ యుద్ధానికి సంబంధించి కూడా చాలా విషయాలు వెలుగు లోకి రాలేదు.

    యుద్ధానికి పూర్వపు ఘర్షణలు

    [మార్చు]
    భారత రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్‌లో వందలాది మంది "చొరబాటుదారుల" ఉనికిని నిర్ధారించే డిక్లాసిఫైడ్ యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ లేఖ. 1965 యుద్ధం వరకు జరిగిన సంఘటనల నాటిది.

    1947లో భారతదేశ విభజన జరిగినప్పటి నుండి భారత్ పాక్‌లు చాలా విషయాల మీద తగువులాడుకునేవి. కాశ్మీరు ప్రధాన సమస్య అయినప్పటికీ, ఇతర సరిహద్దు తగాదాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది గుజరాత్ రాష్ట్రంలోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం. 1965 మార్చి 20 న, 1965 ఏప్రిల్ లో పాకిస్తాన్ కావాలని రెచ్చగొట్టడంతో ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.[6] ప్రారంభంలో ఘర్షణలు ఇరు దేశాల సరిహద్దు పోలీసులు మధ్యే జరిగినప్పటికీ, త్వరలోనే సైనిక దళాలు రంగంలోకి దిగాయి. 1965 జూన్‌లో, బ్రిటిష్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్సన్ ఇరుదేశాల మధ్య శత్రుభావనలను ఆపాల్సిందిగా ఒప్పించి, వివాద పరిష్కారానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. 1968లో వచ్చిన ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్తాన్ కి 900 చ.కి.మీ. దక్కింది. పాకిస్తాన్ మాత్రం 9,100 చ.కి.మీ. తన భాగంగా పేర్కొంది[7].

    రాణ్ ఆఫ్ కచ్ లో పాక్ కు వచ్చిన సత్ఫలితాల తరువాత, 1962లో చైనాతో యుద్ధం వల్ల నష్టపోయిన భారత సైన్యం, కాశ్మీరులో తాము మెరుపుదాడి చేస్తే తనను తాను కాపాడుకోలేదని జనరల్ ఆయుబ్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ భావించింది.[8] కాశ్మీర్ ప్రజలు భారత పాలనతో విసిగిపోయారని పాకిస్తాన్ నమ్మింది. అందువల్ల చొరబాటుదారులతో ఏదైనా తిరుగుబాటు మొదలుపెట్టించి తనకు అనుకూల ఫలితాలు రాబట్టవచ్చనుకుంది. దీనికి ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే గుప్తనామం పెట్టారు.[9] కాని స్థానిక కాశ్మీరీలు పాకిస్తాన్ చొరబాటుదారుల వివరాలను అధికారులకు అందించారు. దీంతో చొరబాటుదారులను త్వరగానే కనిపెట్టడంతో ఆ ఆపరేషన్ పూర్తిగా విఫలమయ్యింది.

    యుద్దం

    [మార్చు]

    1965 ఆగస్టు 5న పాకిస్తానుకు చెందిన 26,000 నుండి 33,000 వేల దళాలు, ఆపరేషన్ జిబ్రాల్టర్‌లో భాగంగా, నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి కాశ్మీరీ ప్రజల లాగా భ్రమింపజేస్తూ దొంగచాటుగా చొరబడ్డారు. దీనికి జవాబుగా 1965 ఆగస్టు 5న భారత దళాలు సరిహద్దు దాటి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీరుపై దండెత్తింది. మొదట్లో భారత దళాలకు మంచి ఫలితాలే వచ్చాయి. మూడు ముఖ్యమైన పర్వత శిఖరాలను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆగస్టు చివరికి ఇరువైపుల వారు సమానమైన ప్రగతి సాధించారు. పాకిస్తాన్ దళాలు తిత్వాల్, ఉరి, పూంచ్ లలో ప్రగతి కనబర్చగా, భారత దళాలు పి.ఒ.కె లోని హాజి పిర్ పాస్ వరకు స్వాధీనపరుచుకున్నాయి.

    1965 సెప్టెంబరు 1న ఆపరేషన్ గ్రాండ్‌స్లామ్ పేరుతో పాకిస్తాన్ ప్రతిదాడి చేసింది. దీని ముఖ్యోద్దేశం జమ్మూ లోని అఖ్నూర్‌ను స్వాధీనపరుచుకోవడం. దీని వల్ల భారత దళాలకు అన్ని రకాల సరఫరా ఆగిపోతుంది. అధిక సంఖ్యలో సైన్యం, సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధ ట్యాంకులతో పాకిస్తాన్ దాడి చేసేసరికి ఇది ఊహించని భారత దళాలు బాగా నష్టపోయాయి. దీంతో భారత వాయుసేన రంగంలోకి దిగి పాకిస్తాన్ సైన్యాన్ని చెల్లాచెదురు చేసింది. మరుసటి రోజు పాకిస్తాన్ వాయుసేన కూడా భారత్ లోని కాశ్మీరు, పంజాబ్ రాష్ట్రాల్లో దాడులు చేసింది. అప్పుడు భారత సైన్యం పాకిస్తానీ పంజాబ్ వద్ద మరో యుద్దవేదిక తెరచింది. దీంతో పాకిస్తానీ పంజాబ్ ను కాపాడుకోవడం కోసం పాకిస్తాన్ కొంత సైన్యాన్ని కాశ్మీరు నుండి ఉపసంహరించుకోవలసి వచ్చింది. దీంతో ఆపరేషన్ గ్రాండ్‌స్లామ్ విఫలమైంది. జమ్మూ లోని అఖ్నూర్ ని స్వాధీనపరుచుకోలేక పోయారు. ఇది యుద్దంలో ఒక కీలకమైన మలుపు, కాశ్మీరులోని భారత దళాలకు మరికొంత లాభం చేకూర్చేందుకు కొన్ని భారత దళాలు దక్షిణ పాకిస్తాన్ లోకి దూసుకుపోయాయి.

    సెప్టెంబరు 6 న భారత దళాలు పడమర సరిహద్దును దాటడంతో అధికారికంగా యుద్ధం మొదలైంది. భారత 15 వ ఇన్‌ఫాన్‌ట్రీ దళానికి రెండవ ప్రపంచ యుద్దంలో పాల్గొన్న మేజర్ జనరల్ నిరంజన్ ప్రసాద్ నేతృత్వం వహించాడు. సెప్టెంబరు 6న భారత 15వ ఇన్‌ఫాన్‌ట్రీ దళానికి, పాక్ పడమర భాగం లోని లిచొగిల్ కాలువ (బి.అర్.బి కాలువ) దగ్గర పాక్ నుండి తీవ్రమైన దాడి ఎదురైంది. జనరల్ ప్రసాద్ తన వాహనాన్ని విడిచి వెనక్కి మళ్ళాల్సి వచ్చింది. రెండవ ప్రయత్నంలో భారత దళాలు బర్కి అనే గ్రామం వద్ద కాలువ దాటాయి. ఈ గ్రామం లాహోర్‌కు చాలా దగ్గరలో, తూర్పున ఉంది. కాని పాక్ దళాలు భారత భూభాగం లోని ఖేమ్ కరన్‌ను దాని చుట్టుప్రక్కల గ్రామాలనూ ఆక్రమించుకున్నాయి. పాక దళాల దృష్టిని ఖేమ్ కరణ్ నుండి మళ్ళించేందుకు భారత్ పాక్ లోని బేడియాన్ గ్రామం పైన, దాని చుట్టుపక్కల గ్రామాలపైనా దాడి చేసింది.

    2వ ఇండిపెన్డెంట్ ఆర్మర్డ్ బ్రిగేడ్ యుక్క 3 ట్యాంకు డివిజన్ సహకారం తోటి 1వ ఇన్ ఫేంటరి డివిజన్ చల త్వరగా సరిహద్దును దాటి లిఛొగిల్ (బి.అర్.బి) ను సెప్టెంబరు 6న చేరుకున్నాయి. భారత దళాలు మరింత ముందుకు, లాహోర్ వరకూ సాగకుండా ఉండేందుకు పాకిస్తాన్ సైన్యం ఆ కాలువపై ఉండే వంతెనలు కొన్నింటిని పేల్చేసింది. భారత జాట్ రెంజిమెంట్ యొక్క ఒక యూనిట్, 3 జాట్, ఇచ్చోగిల్ కాలువను దాటి దానికి పడమరన ఉన్నబాటాపోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. అదే రోజు పాకిస్తాన్ వాయుసేన సేబర్ జెట్ల సహకారంతో తన ఆర్మర్డ్ డివిజన్, ఇన్ ఫేంట్రీ డివిజన్ భారత 15వ డివిజన్ దళాలపై ప్రతిదాడి చేసి అవి బయల్దేరిన చోటికే వెళ్ళేలా చేసాయి. 3వ జాట్ దళం లోని కొద్దిమంది సైనికులు గాయపడడమో లేక చనిపొవడమొ జరిగింది, అధిక సంఖ్యలో సరుకు రవాణా వాహనాలను, ఆయుధాలను కొల్పొయాయి, బాటాపోర్ ను 3 జాట్ స్వాధీనం చేసుకున్న సమాచారం పై అధికారులకు అందలేదు. పైగా వారికి అందిన తప్పుడు సమాచారం వలన తమ దళాలను బాటాపోర్, డొగ్రైయ్ నుండి వెనక్కి ఘొషాల్ దైల్ కు పిలిపించారు. ఈ పరిణామం 3 జాట్ కమాండింగ్ ఆఫీసర్ అయిన లెఫ్టినెంట్ కలనల్ డెస్మండ్ హేడ్ ను తీవ్రంగా కలచివేసింది. పాకిస్తాన్ దళాలతో మరొక తీవ్రమైన యుద్దం తరువాత 3 జాట్ సైనికులు సెప్టెంబరు 21 న బాటాపోర్‌ను తిరిగి తమ ఆధినం లోకి తెచ్చుకున్నారు.

    1965 సెప్టెంబరు 8 న రాజస్థాన్ అర్మ్‌డ్ కాన్‌స్టాబ్యులరీ (అర్.ఎ.సి) కు సహాయంగా 5వ మరాఠా లైట్ ఇన్‌ఫెన్‌ట్రీ దళాన్ని జోధ్‌పూర్‌కు 250 కి.మీ. దూరంలో ఉన్న మునాబాకు పంపారు. వారి పని స్పష్టం -మునాబా పోస్టును చేజారిపోకుండా చూసుకోవడం, పాకిస్తాన్ ఇన్ ఫెన్ట్రి దళాలు ఈ పోస్ట్ దరిదాపులకు కూడా రాకుండా ఆపడం. మునాబాలో ఉన్న మరాఠా కొండ వద్ద, పాక్ దాడిని తిప్పికొట్టేందుకు భారత దళాలు 24గంటల పాటు చాల తీవ్రంగా పోరాడవలసి వఛింది. ముగ్గురు సైనికులు 954 భారీ మొటార్ బేటరీ ఆయుధాలతొ కూడిన ఒక పాకిస్తాన్ దళం మునబఓ దగ్గర ఉన్న అర్.ఎ.సి పొస్టును చేరుకోలేకపోయింది. పాకిస్తాన్ వాయుసేన మొత్తం ఆ ప్రదేశం పై బాంబులతో దాడి చేసింది. ఆంతేకాకుండా బర్మేర్ నుండి అదనపు దళాలతో వస్తున్న రైలుపై కూడా గాద్రా రోడ్ రైల్వే స్టేషను దగ్గర దాడి చేసింది. చివరకు, భారత్ ఎంత ప్రయతించినా 1965 సెప్టెంబరు 10న మునాబాను పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది.

    సెప్టెంబరు 9 తరువాతి రోజుల్లో ఇరుదేశాలకు చెందిన ప్రధానమైన దళాలు ఎదురుదెబ్బలు తిన్నాయి. భారత్‌కు గర్వకారణమైనదని పేరున్న 1వ అర్మర్డ్ డివిజన్ సియాల్‌కోట్ పైకి దాడి చేసేందుకు ముందుకు వెళ్ళింది. కానీ పాక్ ఎదురుదాడి వలన ఇది వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దాదాపు 100 ట్యాంకులను కోల్పోయింది.

    భారతీయులను వెనుకడుగు వేసేలా చేసిన పాకిస్తానీయులు ఆపరేషన్ వైండప్ ను ప్రారంభించింది. అదే సమయంలో పాకిస్తాన్కు గర్వకారణమైన 1వ ఆర్మర్డ్ డివిజన్ అమృత్‌సర్‌ను ఆక్రమించుకునే ఉద్దేశంతో ఖేమ్‌కరణ్ వైపునకు వెళ్ళాయి. కానీ భారత ఎదురుదాడి కారణంగా ఖేంకరన్ నుండి ముందుకు కదలలేకపోయాయి. సెప్టెంబరు 10 న భారత్ 4వ మౌంటెన్ డివిజన్ అస్సల్ ఉత్తర్ (సరిఆయిన సమాధానం) యుద్దంలో పాక్ సైన్యాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఆ ప్రదేశానికి పాకిస్తాన్ ట్యాంకుల పేరిట 'పాటన్ నగర్' గా మారిపోయింది. పాకిస్తాన్ దాదాపు 97 ట్యంకులను కోల్పోయింది. భారత్ కేవలం 32ట్యాంకులు కోల్పోయింది. అటు తరువాత పాకిస్తాన్ 1వ ఆర్మర్డ్ డివిజన్ కొద్దీగ 5వ ఆర్మర్డ్ బ్రిగేడ్ సియాల్కోట్ వైపునకు పంపించబడ్డాయి, ఇవి పాకిస్తాన్ 6వ ఆర్మర్డ్ డివిజన్ వెనుకన ఉన్నాయి. ఇక్కడ పాకిస్తాన్ 6వ ఆర్మర్డ్ డివిజన్ అంతవరకూ పోరాడలేదు. అయితే అప్పటికే 6వ అర్మర్డ్ డివిజన్ అత్యంత శక్తి వంతమైన భారత 1వ ఆర్మర్డ్ డివిజన్ వైపునకు కదులుతూంది.

    యుద్దం సంధి వైపుకు మరలింది. రెండు దళాలు కూడా ఇంకొకరి భూభాగాలను తమతమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ఈ యుద్ధంలో భారత్ 3,000 మంది సైనికులను కోల్పోగా, పాకిస్తాన్ 3,800 మందిని కోల్పోయింది. భారత్ 1,800 చ.కి.మీ. పాకిస్తాన్ భూబాగాన్ని ఆదినంలోకీ తెచ్చుకోగా, పాకిస్తాన్ 550 చ.కి.మీ. భారత్ భూభాగాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. భారత్ ముఖ్యంగా సియాల్‌కోట్ పరిసర ప్రాంతాలను, లాహోర్, కశ్మీర్ సెక్టార్ ప్రాంతాలను తన ఆధీనంలో ఉంచుకోగా, పాకిస్తాన్ ఆక్రమించుకున్నది దక్షిణాన ఉన్న ఎడారి ప్రాంతం సింద్‌కు ఎదురుగా, ఉత్తర కాశ్మీర్ దగ్గర్లోని చుంబ్ సెక్టార్.

    గగనతలంలో యుద్ధం

    [మార్చు]

    భారత వాయు సేన, పాకిస్తాన్ వాయు సేనలు స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా ఈ యుద్ధంలోనే పాల్గొన్నాయి. మొదటి కాశ్మీర్ యుద్ధంలో ఇరువురూ తలపడినప్పటికీ, ఈ యుద్ధంతో పోలిస్తే అప్పట్లో వీటి వినియోగ విస్తృతి పరిమితమైనదిగా చెప్పచ్చు.

    భారత వాయు సేన ఉపయోగించిన వాటిలో ఇవి ఉన్నాయి : అధిక సంఖ్యలో హాకర్ హన్టర్‌లు, స్వదేశంలో తయారుచేసిన ఫోలాండ్ గ్నాట్స్, డి హావిల్లాన్డ్ వాంపైర్స్, ఇఇ కాన్‌బెర్రా బాంబర్స్, మిగ్-21లతో కూడిన ఒక దళం.

    పాకిస్తాన్ వాయుసేన ఉపయోగించిన వాటిలో ఇవి ఉన్నాయి: 102 F-86 సేబర్‌లు, 12 F-104 స్టార్ ఫైటర్లతో కూడిన 24 B-57 కాన్‌బెర్రా బాంబర్లు. వివాద సమయంలో భారత్ వాయుసేన పాక్ వాయుసేన కంటే 5:1 నిష్పత్తితో సంఖ్యాపరమైన ఆధిక్యత కలిగి ఉంది.[10]

    పాక్ వాయుసేన ఎక్కువగా అమెరికా తయారు యుద్ధ విమానాలను కలిగి ఉంది. భారత వాయుసేన సోవియట్, యూరోపియన్ తయారీ విమానాలను కలిగి ఉంది. భారత వాయుసేన కంటే పాక్ వాయుసేన విమానాలు ఎక్కువ సామర్థ్యం కలవని సమాచారం. కాని కొంత మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది నిజం కాదు; ఎందుకంటే భారత మిగ్-21, హాకర్ హన్టర్. ఫొలేంద్ గ్నాట్ యుద్ధవిమానాలు పాకిస్తాన్‌కు చెందిన F-86 Sabre కన్నా ఎక్కువ సామర్ద్యాన్ని ప్రదర్శించాయి. ఈ యుద్దంలో పాక్ వాయుసేన యొక్క 19వ స్క్వాడ్రన్కు నాయకత్వం వహించిన, పదవీవిరమణ పొందిన Air Cdre Sajjad Haider ప్రకారం F-86 Sabre కన్నా భారత్ యొక్క అన్ని డి హావిల్లాన్డ్ వాంపైర్స్ బాంబర్లు కాలం చెల్లినవి. హాకర్ హంటర్ ఫైటర్లు సామర్ద్యం మరియూ వేగం లోనూ ఎంతో గొప్పవి.

    భారతీయుల ప్రకారం సేబర్ స్లేయర్ అనే పేరుగల F-86లు ఫోల్లేంద్ గ్నాట్స్ కన్నా ఎంతో మెరుగైనవి. పాకిస్తాన్ వాయుసేనకు చెందిన F-104 స్టార్ఫైటర్లు ఆసమయంలో ఉపఖండం లోనే అత్యంత వేగవంతమైనవి, అందుకే వీటిని పాక్ వాయుసేనకే గర్వకారణమైనవని పేరొందినవీ. ఏమైనా, పాకిస్తాన్ వాయుసేన యొక్క 19వ స్క్వాడ్రన్ను నడిపిన పదవీవిరమిత Air Cdre Sajjad Haider ప్రకారం, F-104 వాటి సామర్థ్యాన్ని ప్రదర్శించలేక పోయాయి. "సహజంగానే భారీ పరిమాణం గల సోవియట్ బాంబర్ల యొక్క 40,000 అడుగల పైనే ఎగరగలవు" కాని ఇవి తక్కువ ఎత్తులో త్వరగా కదిలే యుద్దవిమానాలతో తలపడలేవు."యుద్దప్రదేశంలో ఇది పనికిరాదు". అందుచేత స్టార్ ఫైటర్స్ కు భారత వాయుసేన భయపడింది, కాని తక్కువ వేగం ఉన్నా వేగంగా కలియతిరగగల ఫోలేండ్ గ్నాట్స్ ఉండడంచేత యుద్దంలో భారత వాయుసేనను ఇది ఏమాత్రం ప్రభావితం చేయలేక పోయింది.

    యుద్దం వల్ల జరిగిన నష్టాలనూ, కోల్పోయిన నహజ వనరులను ఒక నివేదికలో రెండు దేశాలూ పెర్క్కొన్నయి, వీటిని ఆ రెండు దేశాలూ కూడా పరిశీలించుకున్నయి.భారత వాయుసేన తన 35 యుద్దవిమానాలను కోల్పోయి,73 పాక్ యుద్దవిమానాలను కూల్చివేశామని పేర్కొనగా, పాక్ తన 19 యుద్దవిమానాలను కొల్పోగా 104 భారత యుద్దవిమానాలను కూల్చివేసినట్లుగా పేర్కొంది. యుద్దం తరువాత జరిగిన ఒక సైనిక ప్రదర్శనలో పాక్ 86 F-86 సెబ్రెస్, 10 F-104 స్టార్ ఫైటర్స్ మరియూ 20 B-57 కన్బెర్రస్ ను ప్రదర్శించింది. దీంతో భారత్ పెర్కోన్నట్లుగా పాక్ మొదటి వరుస వాయుదళం 73 విమానాలను కుల్చివేయడం నిజంకాదని తెలిసింది.

    భారత దళాలు దానిని గురించి వివరించాయి, పాక్ వాయుసేన కేవలం ఒక స్క్వాడ్రన్ యుద్దవిమానాలను కోల్పోయిందని తెలిపింది. యుద్దం మొదలు కావడానికి 10 రోజుల ముందు పాకిస్తాన్ ఇండోనేషియా, ఇరాక్, ఇరాన్, టర్కీ, చైనాల నుండి అదనంగా విమానాలను కొనుగోలు చేసింది.

    యుద్ధట్యాంకుల ఉపయోగం

    [మార్చు]

    రెండవ ప్రపంచ యుద్దం తరువాత జరిగిన అతి పెద్ద ట్యాంకులయుద్దం 1965 నాటి ఈ యుద్దమే. యుద్దం మొదట్లో, పాకిస్తాన్ ట్యాంకులు సంఖ్యా పరంగానూ, ఆధునికత లోనూ మెరుగ్గా ఉన్నాయి. పాకిస్తాన్ ఆయుధాలు ఎక్కువగా అమెరికా తయారీ, ఇందులో ముఖ్యంగా పాటన్ M-47 ఉన్నాయి, కాని వీటిలో ఎక్కువగా M4 ట్యాంకులు కొన్ని M24 ఛఫ్ఫీ లైట్ ట్యాంకులు మరియూ M36 జక్సన్ ట్యాంకు విధ్వంసక ట్యాంకులు 90MM తుపాకీలను కలిగి ఉన్నాయి. భారత ట్యాంకు దళాలు పాత M4 షెర్మన్ ట్యాంకులను కలిగి ఉన్నాయి; కొన్ని అత్యధిక సామర్ద్యం కల ఫ్రెంచ్ CN 75 50 తుపాకీ లను, సొంతంగా తయారు చేసుకున్న తుపాకీ లను కలిగి ఉన్నాయి. ఆసమయానికి కొన్ని పాత ట్యాంకులు చిన్నవైన 75 mm M3 L/40 తుపాకీలను బిగిస్తూన్నారు. M4 ట్యాంకులకు ఇరు ప్రక్కలా భారత్ 105MM రాయల్ ఆర్ద్నస్స L7 తుపాకులను కలిగిన బ్రిటీష్ తయారీ సెన్చూరీయన్ Mk 7 ట్యాంకులను, AMX-13, PT-76 మరియూ M3 స్టువర్ట్ లైట్ ట్యాంకులనూ మోహరించింది. పాకిస్తాన్ ఎక్కువ సంఖ్యలోనూ, భారీ ఆయుధాలను మోహరించింది.పాకిస్తాన్ మేజర్ జనరల్ T.H. Malik ప్రకారం పాక్ భారీ ఆయుధాలు భారత్ ఆయుధాలకన్నా మరుగైనవి.

    1965 యుద్దం మధ్యలో పాకిస్తాన్ 15 ఆర్మ్డ్ కవర్లి రెన్జిమెన్ట్ లను కలిగి ఉంది, ప్రతి దనిలోను 45 ట్యాంకుల చప్పున 3 స్కవడ్రన్ లను కలిగి ఉంది. పాట్టాన్ కి ఇరువైపుల 76MM తుపాకులు కలిగిన 200 M4 షర్మన్లు, 150M24 తెలికపాటి ఛఫ్ఫీ ట్యాంకులు, కొన్ని స్వాతంత్ర్య M36B1ట్యాంకు విధ్వంస స్క్వడ్రన్లను మోహరించింది. ఇందులో ఎక్కువ రెంజిమెన్ట్లు పాకిస్తాన్ యొక్క 2వ అర్మ్డ్ డివిజన్ లో పనిచెసాఈ, మొదటి, 6వ అర్మ్డ్ డివిజన్లు తరువాతి మోహరింపునకు వెళ్ళాయి.

    భారత్ సైన్యం తన 17 క్యావల్రీ రెన్జిమెన్ట్ను మొహరించవలసిన సమయం వచింది, 1950లలో వాటిని 164 AMX-13 తేలిక పాటి ట్యాంకులు, 188 సెన్చురియన్ లతొ అభివృద్ధి చేసారు. మిగిలిన కావర్ల్యి యునిట్లు M4 షర్మన్లు, చిన్న సంఖ్యలో తేలికపాటి M3A3 స్టూవర్ట్ ట్యాంకులను కలిగి ఉన్నాయి. భారత్ కేవలం ఒకేఒక్క అర్మ్డ్ డివిజన్ను కలిగి ఉన్నది, 17వ అశ్విక (పూనా అశ్విక) కలిగిన మొదటి 'బ్లాక్ ఏలిఫన్ట్ (నల్ల ఏనుగు) ' అర్మ్డ్ డివిజన్, దీనిని 'ఫఖర్-ఈ-హింద్' (భారత్ యొక్క గర్వకారణం) అని కూడా అంటారు. రెండు మొదటి పేర్లు కలిగిన సెన్చురియన్ లను కలిగి ఉన్న 4వ ఆశ్వీక దశం (హుడ్సన్ అశ్వం), 16 క్యావల్రీ, 7వ లెట్ క్యావల్రీ, 2వ లాన్సర్స్, 18వ క్యావల్రీ, 62వ క్యావల్రీ ఉన్నాయి. అక్కడ 3 రెంజిమెన్ట్లలో ఒకటైన 2వ స్వాతంత్ర్య అర్మ్డ్ బ్రిగెడ్, 3వ క్యావల్రీలు ఉన్నయి, అవి కూడా సెన్చూరియన్ లను కలిగి ఉన్నాయి.

    పాకిస్తాన్కు బలమైన అత్యధునికమైన రక్షణ, ఆయుధ వ్యవస్థ ఉన్నప్పకిటికీ, భారత్ పాకిస్తాన్‌ను ఓడించి పాహోర్-సియాల్కోట్ లోకి చొచ్చుకు పోయింది. అదే సమయంలో పాకిస్తాన్ అమృత్‌సర్ ను ఆక్రమించుకుంది, వారు ఇటువంటి కొన్ని పనులు చేసిన అవి తప్పులతడకగా ఉన్నాయి, ఆసలుత్తర్ వద్ద పాకిస్తాన్ యొక్క 1వ అర్మ్ర్డ్ డివిజన్ ఓటమి సమయంలో తిసుకున్న రక్షణ మరియూ దాడి పద్ధతులవంటివి.

    భారతీయులు మధుపూర్ కాలువను సెప్టెంబరు 11 న ఆక్రమించుకున్న తరువాత, పాకిస్తాన్ తీవ్రమైన ఎదురుదాడి చేసి ఖేమ్‌కరణ్ వద్ద పాగా వేసింది. ఛవిందా యుద్దంలో భారత్ 1వ అర్మర్డ్ డివిజన్ మరియూ కొన్ని సహాయక యూనిట్లు కలిసి దాడి చేసాయి.

    నావికా ఘర్షణలు

    [మార్చు]

    నష్టాల అంచనా

    [మార్చు]

    తటస్థ అంhచనాలు

    [మార్చు]

    కాల్పుల విరమణ

    [మార్చు]

    నిఘా వైఫల్యాలు

    [మార్చు]

    ఇవి కూడా చూడండి

    [మార్చు]

    భారత్ పాక్ యుద్దం 1971
    కార్గిల్ యుద్ధము

    మూలాలు

    [మార్చు]
    1. Indo-Pakistani War of 1965
    2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 Thomas M. Leonard, "Encyclopedia of the developing world, Volume 2", page 806, Google Books URL: http://books.google.co.uk/books?id=pWRjGZ9H7hYC&pg=PA806&lpg=PA806&dq=pakistani+casualties+in+battle+of+lahore+1965&source=bl&ots=C8A8bQcxSk&sig=LDNtNeO2EMkuVzRlF7QQAxvZW2g&hl=en&ei=ldseSs-aHdyZjAeX7JWLDQ&sa=X&oi=book_result&ct=result&resnum=5#v=onepage&q=&f=false
    3. "Indo-Pakistan Wars". Archived from the original on 2009-11-01. Retrieved 2010-03-12.
    4. http://www.tribuneindia.com/2007/20070506/spectrum/main1.htm
    5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-08-27. Retrieved 2010-03-12.
    6. Maj Gen (retd) Mahmud Ali Durrani, Times of India, September 2009
    7. Bhushan, Chodarat. "Tulbul, Sir Creek and Siachen: Competitive Methodologies" Archived 2006-04-21 at the Wayback Machine. South Asian Journal. March 2005, Encyclopedia Britannica and Open Forum – UNIDIR
    8. http://www.globalsecurity.org/military/world/war/indo-pak_1965.htm "Indo-Pakistan War of 1965"].Globalsecurity.com.
    9. Defence Journal. September 2000
    10. John Fricker, "Pakistan's Air Power", Flight International issue published 1969, page 89. URL: http://www.flightglobal.com/pdfarchive/view/1969/1969%20-%200111.html?search=Pakistan%20Mirage%205 Archived 2012-01-14 at the Wayback Machine, retrieved: 03 November 2009