ఆపరేషన్ బైసన్
1947 భారత పాకిస్తాన్ యుద్ధంలో జోజి లా, ద్రాస్, కార్గిల్ జిల్లాలను భారత సైన్యం ఆక్రమించుకున్న ఘటనను ఆపరేషన్ బైసన్ అంటారు.[1]
1948 లో పాకిస్తాన్ సైన్యం ముసుగులో ఆక్రమణ దారులు లడఖ్‌పై దాడి చేసినపుడు జోజి లా కనుమను ఆక్రమించుకుంది. నవంబరు 1 న భారతీయ బలగాలు ఓ సాహసోపేతమైన దాడిలో ఈ కనుమను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. సముద్రమట్టం నుండి అంత ఎత్తులో ట్యాంకులను వాడడాన్ని పాకిస్తాన్ ఊహించలేదు.
తొలుత, జోజి లాను ఆక్రమించేందుకు 77 పారాచూట్ బ్రిగేడ్ (బ్రిగేడియర్ అటల్) విఫల యత్నం చేసింది. ఆ దాడికి ఆపరేషన్ డక్ అనే పేరు ఉండగా, ఆ తరువాత లెఫ్టెనంట్ జనరల్ కరియప్ప నేతృత్వంలో ఆపరేషన్ బైసన్‌గా పేరు మార్చారు. 7 క్యావల్రీ కి చెందిన M5 స్టూవర్టు లైట్ ట్యాంకులను విప్పదీసి ఆ విడిభాగాలను శ్రీనగర్ గుండా తరలించారు. జోజి లా కు ఉన్న గాడిదల నడకదారిని జీప్ దారిగా మార్చారు. నవంబరు 1 న బ్రిగేడ్ మెరుపుదాడి మొదలు పెట్టింది. ఆర్మరుతో పాటు రెండు రెజిమెంట్ల 25 పౌండర్లు, ఒక రెజిమెంటు 3.7 ఇంచి గన్నులను ఈ దాడిలో నియోగించింది. ఈ దాడితో పాకిస్తాన్ విస్తుపోయింది.
బ్రిగేడ్ కనుమను హస్తగతం చేసుకుని, పాకిస్తాన్ సైనికులను వెనక్కు మటయాన్ వరకు, ఆ తరువాత ద్రాస్ వరకూ తరిమింది. ఈ బ్రిగేడ్ నవంబరు 24 న కార్గిల్ వద్ద మిగిలిన భారత సైన్యంతో కలిసింది. పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడి నుండి కూడా తరిమారు. చివరికి పాకిస్తాన్ సైన్యం స్కర్దూ వరకు పారిపోయింది.
మూలాలు
[మార్చు]- ↑ Sinha, Lt. Gen. S.K. (1977). Operation Rescue:Military Operations in Jammu & Kashmir 1947-49. New Delhi: Vision Books. pp. 103–127. ISBN 81-7094-012-5. Retrieved 4 August 2010.