ఆపరేషన్ టుపాక్
జమ్మూకాశ్మీరులో 1980 నుండి పాకిస్తాన్ చేస్తున్న సైనిక ఇంటెలిజెన్స్ కార్యక్రమానికి ఆపరేషన్ టుపాక్ అని పేరు. దీన్ని పాకిస్తానుకు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సంస్థ నిర్వహిస్తోంది. కాశ్మీరులో అల్లర్లను రెచ్చగొట్టే లక్ష్యంతో పనిచేసే ఈ కార్యక్రమంలో మూడు భాగాలున్నాయి. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి, అధికార ముద్ర వేసినది జియా ఉల్ హక్. ఆపరేషన్ జిబ్రాల్టర్ విఫలమయ్యాక, కాశ్మీరుపై నియంత్రణ సాధించేందుకు 1988 లో ఆయన ఈ ఆపరేషన్ను చేపట్టాడు.[1][2][3] పెరూలో స్పానిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన టుపాక్ అమారు 2 పేరు మీదుగా ఈ ఆపరేషన్‌కు పేరు పెట్టారు.[4] ఈ కార్యక్రమం ఇంకా అమలవుతూనే ఉందని, అందులో భాగంగానే పాక్ కాశ్మీరీ ఉగ్రవాదులకు సాయం అందిస్తోందనీ భావిస్తున్నారు.
ఆపరేషన్ టుపాక్ ధ్యేయాలు ఇవి: 1) భారత్‌ను విచ్ఛిన్నం చెయ్యడం 2) గూఢచారి వ్యవస్థను వినియోగించి విద్రోహ చర్యలు చేపట్టడం 3) భారత్‌కు నేపాల్, బాంగ్లాదేశ్ ల సరిహద్దుల్లో ఉన్న లొసుగులను వినియోగించుకుని ఆయా దేశాల్లో స్థావరాలను నెలకొల్పి ఆపరేషన్లను నిర్వహించడం.[5][6]
కాశ్మీరులో తన కార్యకాలాపాల కోసం ఐఎస్‌ఐ నెలకు రూ. 2.4 కోట్లు ఖర్చు చేస్తోందని ఒక అంచనా. అక్కడి అన్ని పక్షాలకూ నిధులు అందజేసినప్పటికీ, పాకిస్తాన్ అనుకూల వర్గాల పట్ల పక్షపాతం చూపుతారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం కింద ఐఎస్‌ఐ 6 ఉగ్రవాద సంస్థల ఏర్పాటుకు సహకరించింది. లష్కర్-ఎ-తోయిబా వాటిలో ఒకటి.[7] ఐఎస్‌ఐ ఇప్పటికీ ఈ సంస్థకు రక్షణ కల్పిస్తూ, వారికి ఇంటెలిజెన్స్ సమాచారం అందిస్తోందని అమెరికా గూఢచార వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Directorate for Inter-Services Intelligence (ISI) Archived 2018-12-25 at the Wayback Machine, Federation of American Scientists
- ↑ Does Obama understand his biggest foreign-policy challenge? Archived 2009-02-15 at the Wayback Machine, Salon.com, 2008-12-12
- ↑ Khan, Mukhtar (9 January 2009). "India's Sikh Militants Forming Ties with Lashkar-e-Taiba and Pakistani Intelligence" (PDF). The Jamestown Foundation. Retrieved 24 July 2010.
- ↑ Directorate for Inter-Services Intelligence, GlobalSecurity.org
- ↑ Daily Describes Activities of ISI in India, Federation of American Scientists, 1999-06-30
- ↑ Pakistan's ISI: The Invisible Government, Sean P. Winchell .
- ↑ Pakistani Militants Admit Role in Siege, Official Says, The New York Times, 2009-01-01