Jump to content

2016 యూరీ ఉగ్రవాద దాడులు

వికీపీడియా నుండి
2016 యూరీ ఉగ్రవాద దాడులు
Part of the జమ్మూ కాశ్మీర్‌లో తిరుగుబాటు
2016 యూరీ ఉగ్రవాద దాడులు is located in Jammu and Kashmir
2016 యూరీ ఉగ్రవాద దాడులు
2016 యూరీ ఉగ్రవాద దాడులు (Jammu and Kashmir)
2016 యూరీ ఉగ్రవాద దాడులు is located in India
2016 యూరీ ఉగ్రవాద దాడులు
2016 యూరీ ఉగ్రవాద దాడులు (India)
Location in Jammu and Kashmir, India
ప్రదేశంజమ్మూ కాశ్మీరు లోని బారాముల్లా జిల్లా, యూరి వద్ద
తేదీ2016 సెప్టెంబరు 18
ఉదయం 5.30 (భారత కాలమానం)
దాడి రకం
ఉగ్రవాదం, మూకుమ్మడి కాల్పులు
మరణాలు23 (19 సైనికులు, 4 ఉగ్రవాదులు)[1][2]
ప్రాణాపాయ గాయాలు
19–30[3][4][5]
Suspected perpetrators
జైషె మొహమ్మద్ (అనుమానితులు) [6]
లష్కరె తాయిబా (ప్రకటించుకుంది). దాడి జరిగినపుడు కాశ్మీర్ లోయ ప్రాంతం అలజడులప్రాంతంగా వుంది. [7][8]

2016 యూరీ ఉగ్రవాద దాడులు అన్నది 2016 సెప్టెంబరు 18 న భారీగా సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని యూరీ పట్టణంపై చేసిన దాడి. కాశ్మీర్ లో భద్రతా దళాలపై 2 దశాబ్దాల కాలంలో జరిగిన అత్యంత దారుణమైన దాడిగా దీన్ని పేర్కొన్నారు.[9] ఏ ఉగ్రవాద సమూహమూ ఈ దాడికి బాధ్యత స్వీకరిస్తూ ప్రకటించలేదు,[10] కానీ ఈ దాడిని ప్రణాళిక వేసి, నిర్వహించింది తీవ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ అని అనుమానిస్తున్నారు.[6] ఈ దాడి జరిగే నాటికి కాశ్మీరులో అలజడి, అశాంతి చోటుచేసుకుంది.[11][12]

నేపథ్యం

[మార్చు]

2015 నుంచీ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు (ఫిదాయీన్ గా ప్రసిద్ధి) భారతీయ రక్షణ దళాలకు వ్యతిరేకంగా సాగించడం పెరుగుతోంది. జూలై 2015లో ముగ్గురు సాయుధులు గురుదాస్ పూర్ లో ఒక బస్సుపై, పోలీస్ ఠాణాపై దాడి చేశారు. 

2016లో 4-6 మంది సాయుధులు పఠాన్ కోట్ వైమానిక దళ స్థావరంపై దాడిచేశారు, ఈ దాడి జైష్-ఎ-మొహమ్మద్ చేసిందని భారతీయ అధికార వర్గాలు అంచనా వేశాయి.[13]

2016 జూలై 8 న ఉగ్రవాద నాయకుడు బుర్హాన్ వాణి పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించడంతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఆందోళనలు, అశాంతి ఎడతెగకుండా సాగాయి.[14][15][16][17] ఈ మరణంతో లోయలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ఆందోళనలు చేసాయి.[10][18][16][19][20]

దాడి

[మార్చు]
డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డిజిఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్, 2016 సెప్టెంబరు 19 న యూరి, జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్మీ క్యాంప్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిపై మీడియాకు వివరిస్తున్న దృశ్యచిత్రం.

సెప్టెంబరు 18 తెల్లవారుజామున 5.30 గంటలకు నలుగురు సాయుధులైన ఉగ్రవాదులు నియంత్రణ రేఖకు సమీపంలోని యూరీ పట్టణంలోని భారత సైనిక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ పై మెరుపుదాడి చేశారు. మూడు నిమిషాల్లో 17 గ్రెనేడ్లు విసిరారు. అడ్మినిస్ట్రేటివ్ బేస్ కాంపులో మంటలు వ్యాపించడంతో అప్పటికప్పుడు 17 మంది సైనికులు, సైనికాధికారులు మరణించారు, ఆపైన మరో 19-30 మంది సైనికులు ఈ దాడిలో గాయపడ్డారు.[3][5][21][22][23] బతికి ఉన్నారని భావించిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్లు ప్రారంభించారు.[9] చనిపోయిన సైనికుల్లో అత్యధికులు 10 డోగ్రా, 6 బీహార్ రెజిమెంట్లకు చెందినవారు.[23] గాయపడిన సైనికుల్లో ఒకరు ఆర్&ఆర్ ఆసుపత్రిలో 19 సెప్టెంబరున మరణించగా, మరొకరు 24 సెప్టెంబరులో చనిపోయారు, దాంతో మృతుల సంఖ్య 19కి చేరింది.[1][2][24][25]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Uri attack: BSF jawan succumbs to injuries, death toll rises to 19". The Indian Express. 25 September 2016. Retrieved 25 September 2016.
  2. 2.0 2.1 "One more soldier succumbs to injuries, death toll rises to 18 in Uri attack". Hindustan Times. 19 September 2016. Retrieved 19 September 2016.
  3. 3.0 3.1 Uri terror attack: 17 soldiers killed, 19 injured in strike on Army camp, Times of India, 18 September 2016.
  4. Uri terror attack: List of jawans who died fighting terrorists, The Indian Express, 18 September 2016.
  5. 5.0 5.1 "Tents set on fire, troops shot while coming out".
  6. 6.0 6.1 "Uri attack: Jaish-e-Muhammad suspects in hand, evidence shown to envoy". indianexpress.com. 28 September 2016.
  7. "Soldiers killed in army base attack in Indian territory of Kashmir". CNN. 19 September 2016. Retrieved 21 September 2016. After a few years of relative calm in Indian-administered Kashmir -- largely considered one of the world's most tumultuous geopolitical flashpoints since the India-Pakistan partition -- the region has been gripped by unrest for more than two months.
  8. "India blames Pakistan militants for Kashmir attack which killed 17". Yahoo. 19 సెప్టెంబరు 2016. Archived from the original on 19 సెప్టెంబరు 2016. Retrieved 21 సెప్టెంబరు 2016.
  9. 9.0 9.1 "Militants attack Indian army base in Kashmir 'killing 17'".
  10. 10.0 10.1 "A Terrorist Attack in Kashmir Sparks Fears of a Military Conflict Between India and Pakistan". 
  11. "Soldiers killed in army base attack in Indian-administered Kashmir".
  12. "India blames Pakistan militants for Kashmir attack which killed 17" Archived 2016-09-19 at the Wayback Machine.
  13. Ankit Panda, Gurdaspur, Pathankot, and Now Uri: What Are India's Options?, The Diplomat, 19 September 2016.
  14. "Indian troops suffer deadly Kashmir ambush". 
  15. "17 Indian Soldiers Killed by Militants in Kashmir".
  16. 16.0 16.1 "17 Indian soldiers, 4 militants killed in Kashmir attack". 
  17. "Militants sneak into Indian army base and mow down sleeping soldiers in Kashmir, killing 17". 
  18. "17 Indian soldiers killed in attack on Kashmir base". 
  19. "17 soldiers killed in attack at Indian army base in Kashmir" Archived 2018-12-01 at the Wayback Machine.
  20. "More than a dozen Indian soldiers killed in Kashmir attack". 
  21. Uri attack: An inside story of how it happened, India Today, 18 September 2016.
  22. Sequence of the Uri attack & the plan of the terrorists, The Economic Times, 19 September 2016.
  23. 23.0 23.1 Uri Attack: Most of the 17 Soldiers Died in a Tent Fire Archived 2016-09-28 at the Wayback Machine, The Quint, 19 September 2016.
  24. "One more soldier succumbs to injuries, death toll rises to 18 in Uri attack".
  25. "Uri attack: Death toll touches 18, India decides to isolate Pakistan on the global stage – Firstpost". 2016-09-19.