పీర్ పంజాల్ శ్రేణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పీర్ పంజాల్ రేంజ్
ఉపగ్రహం నుండి కాశ్మీర్ లోయ దృశ్యం. చిత్రంలో ఎడమ, దిగువ భాగంలో మంచు కప్పేసిన పీర్ పంజాల్ శ్రేణి ఉంటుంది.

పీర్ పంజాల్ శ్రేణి అంతర హిమాలయాల్లోని పర్వత సమూహం. హిమాచల్ ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీరు, పాక్ ఆక్రమిత కాశ్మీరుల్లో తూర్పు-ఆగ్నేయం నుండి పశ్చిమ-వాయవ్యంగా ఇది విస్తరించి ఉంది. దీన్ని హిందూ మత గ్రంథాల్లో పాంచాలదేవ అని పేర్కొన్నారు. ఇక్కడ సగటు ఎత్తు 1400 మీ. - 4,100 మీ. మధ్య ఉంటుంది. ధౌలాధార్, పీర్ పంజాల్ శ్రేణుల వైపు పోతూ ఉంటే హిమాలాయల ఎత్తు పెరుగుతూ పోతుంది. మధ్య హిమాలయాల్లో పీర్ పంజాల్ అత్యంత పెద్ద శ్రేణి. సట్లెజ్ నది ఒడ్డున, ఇది హిమాలయాల నుండి విడిపోయి, బియాస్, రావి నదులను వేరు చేస్తూ పోతుంది.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

పీర్ పంజాల్ కనుమ పేరిట పీర్ పంజాల్ శ్రేణికి ఈ పేరు వచ్చింది. దీని అసలు పేరు పాంచాలదేవ. పాంచాల అనేది మహాభారతంలో పేర్కొన్న దేశం. ప్రస్తుత వాయవ్య ఉత్తర ప్రదేశ్ లోని ప్రాంతం. అయితే, మహాభారత ప్రాంతాలను పశ్చిమ పంజాబ్, దక్షిణ కాశ్మీర్లకు చెందినవిగా చూపించే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. పండిత దినేశ్‌చంద్ర సిర్కార్ శక్తి -సంగమ తంత్రంలో వివరించిన భౌగోళిక విశ్లేషణ ప్రకారం కూడా ఇలాగే ఉంది. ఈ ప్రాంతం ఇస్లామీకరించబడిన తరువాత దేవత అనే భావన పీర్‌గా మారిందని ఎం ఏ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.

శిఖరాలు, పర్వత శ్రేణి

[మార్చు]

దేవ్ టిబ్బా (6,001 మీ.), ఇంద్రాసన్ (6,221 మీ.) ఈ పర్వత శ్రేణిలో తూర్పు కొన్న ఉన్న రెండు ముఖ్యమైన శిఖరాలు. పార్వతి- బియాస్ లోయ (కులు జిల్లా) నుండి, హిమాచల్ ప్రదేశ్ లోని చంబా ఎగువ బెల్ట్, చంద్ర (ఎగువ చెనాబ్) లోయ ( లాహౌల్, స్పితి జిల్లా) లు రెండింటి నుండి ఈ శీఖరాలను ఎక్కవచ్చు. కాశ్మీర్‌లోని గుల్మార్గ్ హిల్ స్టేషన్ ఈ శ్రేణి లోనే ఉంది.[1]

కనుమలు

[మార్చు]
పటం
About OpenStreetMaps
Maps: terms of use
75km
50miles
రోతంగ్ లా
రోతంగ్ లా
సింథన్ కనుమ
సింథన్ కనుమ
జమ్ము
జమ్ము
శ్రీనగర్
శ్రీనగర్
బనిహాల్ కనుమ
బనిహాల్ కనుమ
హాజీ పీర్ కనుమ
పీర్ పంజాల్ కనుమ
హీజీ పీర్ కనుమ
హీజీ పీర్ కనుమ
పీర్ ప్రంజాల్ శ్రేణి కనుమలు

హాజీ పీర్ కనుమ (ఎత్తు 2,637 మీ.) పశ్చిమ పీర్ పంజాల్ శ్రేణిలో పూంచ్, యురి రహదారిపై పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉంది.

పీర్ పంజాల్ కనుమ (పీర్ కీ గలీ అని కూడా పిలుస్తారు) కాశ్మీర్ లోయను రాజౌరి, పూంచ్ లతో 'మొఘల్ రోడ్' ద్వారా కలుపుతుంది. మొఘల్ రహదారి మొత్తమ్మీద ఇదే ఎత్తైన ప్రదేశం (3,490 మీ.). ఇది కాశ్మీర్ లోయకు నైరుతి దిశలో ఉంది. కాశ్మీర్ లోయలో యాపిల్ పట్టణంగా పేరొందిన షోపియన్, ఈ కనుమకు సమీపంలో ఉన్న పట్టణం.

బనిహాల్ నుండి చూస్తే పీర్ పంజాల్ శ్రేణి (పిక్చర్: షోయబ్ టాంట్రే )

బనిహాల్ కనుమ (2,832 మీ.) కాశ్మీర్ లోయకు దక్షిణ కొనన జీలం నది ఉద్భవించే స్థానం వద్ద ఉంది. బనిహాల్, ఖాజిగుండ్ పట్టణాలు కనుమకు చెరొక వైపున ఉంటాయి.

సింథన్ కనుమ జమ్మూ కాశ్మీర్‌ను కిష్ట్‌వార్‌తో కలుపుతుంది.

రోహ్తాంగ్ కనుమ (ఎత్తు 3,978 మీ.) తూర్పు పీర్ పంజాల్ శ్రేణిలో కులు లోయ లోని మనాలి, లాహౌల్ లోయ లోని కీలాంగ్‌ల మధ్య ఉంది.

సొరంగాలు

[మార్చు]

జవహర్ సొరంగం

[మార్చు]

బనిహాల్ కనుమ కింద పీర్ పంజాల్ పర్వతం గుండా వెళ్ళే 2.5 కి.మీ. పొడవైన జవహర్ సొరంగం బనిహాల్‌ను, ఖాజిగుండ్‌ను కలుపుతుంది. ఏడాది పొడుగునా నిరంతరాయంగా ప్ర్యాణీంఛేందుకు వీలుగా 1950 ల ప్రారంభంలో మొదలు పెట్టి 1956 అంతానికి పూర్తైన ఈ సొరంగానికి భారత మొదటి ప్రధానమంత్రి పేరిట జవహర్ సొరంగం అని పేరు పెట్టారు. ఇది సుమారు 2,100 మీ. ఎత్తున ఉంది. రోజుకు 150 వాహనాల కోసం ఈ సొరంగాన్ని నిర్మించగా, ఇప్పుడు రోజుకు 7,000 కంటే ఎక్కువ వాహనాలు దీని గుండా ప్రయాణిస్తున్నాయి. అందువల్ల, కొద్దిగా తక్కువ ఎత్తులో ఓ కొత్త, మరింత వెడల్పైన, మరింత పొడవైన సొరంగం నిర్మించేందుకు ప్రణాళిక చేపట్టారు.

బనిహాల్ ఖాజిగుండ్ రోడ్ సొరంగం

[మార్చు]

8.45 కి.మీ. పొడవైన కొత్త బనిహాల్-కాజీగుండ్ సొరంగ నిర్మాణం 2011 లో ప్రారంభమైంది. కొత్త సొరంగం ప్రస్తుతం ఉన్న జవహర్ సొరంగం కంటే తక్కువ ఎత్తులో నిర్మించారు. పూర్తయినప్పుడు, బనిహాల్, ఖాజిగుండ్‌ల మధ్య దూరం 16 కి.మీ. మేరకు తగ్గుతుంది. తక్కువ ఎత్తున ఉండటాన, ఈ సొరంగానికి హిమపాతాల తాకిడి తక్కువగా ఉంటుంది.[2]

అటల్ సొరంగం

[మార్చు]

లేహ్-మనాలి హైవే పైన తూర్పు పీర్ పంజాల్ శ్రేణిలోని రోహ్‌తాంగ్ కనుమ కింద అటల్ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. 8.8 కి.మీ. పొడవుతో ఈ సొరంగం భారతదేశంలోని అత్య్ంత పొడవైన రహదారి సొరంగాల్లో రెండవది. దీని వలన మనాలి, కీలాంగ్‌ల మధ్య దూరం 60 కి.మీ. మేర తగ్గుతుంది. ఈ సొరంగం సముద్ర మట్టం నుండి 3,100 మీ. ఎత్తున ఉంది. రోహ్‌తాంగ్ కనుమ 3,978 మీ. ఎత్తున ఉంది. మనాలి-లేహ్ అక్షం మీద ఉన్న ఈ రహదారి లదాఖ్‌కు ఉన్న రెండు రహదారుల్లో ఒకటి.

బనిహాల్ రైల్వే సొరంగం

[మార్చు]

పీర్ పంజాల్ రైల్వే సొరంగం, 11.215 కి.మీ. పొడవైన రైల్వే సొరంగం. ఇది కాజీగౌండ్, బనిహాల్‌లను కలుపుతుంది. ఇది ఉధంపూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగం. 2013 జూన్ 26 న ఈ సొరంగంలో రాకపోకలు మొదలయ్యాయి. ఇది భారతదేశపు అత్యంత పొడవైన రైల్వే సొరంగం, ఆసియాలో నాల్గవది.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • గంగా చోటి
  • బన్నీ మాతా ఆలయం

మూలాలు

[మార్చు]
  1. Pir Panjal Range (mountain system, Asia) – Britannica Online Encyclopedia
  2. "Passages of employment to Srinagar's denizens".
  3. "India's longest railway tunnel unveiled in Jammu & Kashmir". The Times of India. 14 October 2011. Archived from the original on 2013-06-29. Retrieved 2020-02-24.