ఉప రాష్ట్రపతి
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
భారతదేశం |
![]() ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
ఇతర దేశాలు |
ఉప రాష్ట్రపతి భారత ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానం. భారత రాజ్యాంగంలోని 63 వ అధికరణంలో ఉప రాష్ట్రపతి పదవి గురించిన ప్రస్తావన ఉంది. ఈ పదవికి సంబంధించి భారత్ కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని మరే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోను లేని అంశం ఇది. పెద్ద ప్రజాస్వామ్యాలలో, అమెరికాలో మాత్రమే ఈ పదవి ఉంది. అయితే భారత్, అమెరికాలలో ప్రజాస్వామ్య విధానాలు వేరు (భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యము, అమెరికాలో అధ్యక ప్రజాస్వామ్య పద్ధతి ఉన్నాయి) కనుక, ఉప రాష్ట్రపతి విధులకు, అమెరికా ఉపాధ్యక్షుడి విధులకు చాలా తేడా ఉంది.
విషయ సూచిక
అర్హతలు[మార్చు]
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడానికి కింది అర్హతలు ఉండాలి.
- భారత పౌరుడై ఉండాలి.
- 35 సంవత్సరాలు లేదా ఆ పైబడి వయసు ఉండాలి.
- రాజ్యసభ సభ్యుడయేందుకు అవసరమైన అర్హతలు కలిగి ఉండాలి.
- అభ్యర్థి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో లేదా వటి నియంత్రణ కలిగిన సంస్థలలో ఆదాయం వచ్చే పదవిలో ఉండరాదు.
ఎన్నిక విధానం, కాలపరిమితి[మార్చు]
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఎలెక్టోరల్ కాలేజి ద్వారా జరుగుతుంది. ఈ కాలేజిలో లోక్‌సభ, రాజ్యసభల సభ్యులు సభ్యులుగా ఉంటారు.
ఉప రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. అయితే కింది సందర్భాలలో పదవీకాలం ముందే ముగియవచ్చు.
- ఉప రాష్ట్రప్తి తన రాజీనామాను రాష్ట్రపతికి పంపినపుడు
- రాజ్యసభ తీర్మానం ద్వారా ఉప రాష్ట్రపతిని పదవి నుండి తొలగించినపుడు
అయితే ఉప రాష్ట్రపతి ఐదేళ్ళ కాలం ముగిసినా, తన వారసుడు పదవి చేపట్టే వరకు పదవిలో కొనసాగుతారు.
ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగిసే లోపు తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తి అయిపోవాలి. ఒకవేళ ఉప రాష్ట్రపతి పదవి అర్ధంతరంగా ఖాళీ అయితే (మరణం, రాజీనామా, తొలగింపు మొదలైన వాటి వలన) తదుపరి ఉప రాష్ట్రపతి కొరకు ఎన్నిక వీలయినంత త్వరగా జరగాలి. అప్పుడు ఎన్నికయ్యే వ్యక్తి ఐదేళ్ళ పూర్తి కాలం అధికారంలో ఉంటారు.
విధులు, అధికారాలు[మార్చు]
ఉప రాష్ట్రపతి రెండు ప్రముఖమైన విధులు నిర్వర్తిస్తారు. కార్య నిర్వాహక వ్యవస్థకు సంబంధించి, ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, శాసన వ్యవస్థకు సంబంధించి, రాజ్యసభ ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు.
మరణం, రాజీనామా, అభ్శంసన వంటి కారణాల వలన రాష్ట్రపతి పదవి ఖాళీ అయినపుడు, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి విధులు నిర్వర్తిస్తారు. అనారోగ్య కారణాల వలన రాష్ట్రపతి విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో, ఉప రాష్ట్రపతి ఈ విధులు చేపడతారు. రాష్ట్రపతి విధులు నిర్వర్తించే సమయంలో, ఆ పదవికి లభించే అన్ని అధికారాలు, సౌకర్యాలు, వేతనం మొదలైనవన్నీ ఉప రాష్ట్రపతికి లభిస్తాయి.
రాజ్యసభ అధ్యక్షుడిగా సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీనికి డిప్యూటీ ఛైర్మను సహకరిస్తారు.