భైరాన్‌సింగ్ షెకావత్

వికీపీడియా నుండి
(భైరన్ సింగ్ షెఖావత్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భైరాన్‌సింగ్ షెకావత్

భైరాన్‌సింగ్ షెకావత్ ,1923, అక్టోబర్ 23 న జన్మించాడు. షెకావత్ భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. కృష్ణకాంత్ మరణానంతరం 2002 ఆగస్టులో నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎన్నికలలో గెల్చి 2007 జూలై 21 వరకు రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో ప్రతిభా పాటిల్ చేతిలో ఓడి రాజీనామా సమర్పించే వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 1977 నుంచి 1980, 1990 నుంచి 1992, 1993 నుంచి 1998 వరకు 3 పర్యాయాలు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించాడు. తన హయంలో ప్రారంభించిన పేదరిక నిర్మూలన కార్యక్రమమైన అంతోద్యయ పథకం ఆయనకు ఎంతో కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది.87 సంవత్సరాల వయస్సులో శ్వాససంబంధ సమస్యలతో 2010, మే 15జైపూర్లో మరణించాడు.

నిర్వహించిన అధికార పదవులు[మార్చు]

  • 1952 నుంచి 1972 : రాజస్థాన్ శాసనసభ సభ్యుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నాడు.
  • 1974 నుంచి 1977 : మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
  • 1977 నుంచి 2002 : రాజస్థాన్ శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు.
  • 1977 నుంచి 1980 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు.
  • 1980 నుంచి 1990 : రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
  • 1990 నుంచి 1992 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం అధికారంలో ఉన్నాడు.
  • 1993 నుంచి 1998 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మూడవ పర్యాయం అధికారం నిర్వహించాడు.
  • 1998 నుంచి 2002 : రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.
  • 2002 నుంచి 2007 : భారత ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించారు

బయటి లింకులు[మార్చు]