Coordinates: 26°55′34″N 75°49′25″E / 26.9260°N 75.8235°E / 26.9260; 75.8235

జైపూర్ (రాజస్థాన్)

వికీపీడియా నుండి
(Jaipur నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని జైపూర్ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

జైపూర్ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం జైపూర్ (అయోమయ నివృత్తి) చూడండి.

  ?జైపూర్
రాజస్థాన్ • భారతదేశం
Jal Mahal
Jal Mahal
Jal Mahal
అక్షాంశరేఖాంశాలు: 26°55′34″N 75°49′25″E / 26.9260°N 75.8235°E / 26.9260; 75.8235
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
200.4 కి.మీ² (77 sq mi)
• 431 మీ (1,414 అడుగులు)
జిల్లా (లు) జైపూర్ జిల్లా
జనాభా
జనసాంద్రత
33,24,319 (2005 నాటికి)
• 16,588/కి.మీ² (42,963/చ.మై)
Mayor Ashok Parnami
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
UN/LOCODE
వాహనం

• 3020 xx
• +0141
• INJAI
• RJ-14

జైపూర్, ఈ నగరం "గులాబీ నగరం"గా ప్రసిద్ధి. రాజస్థాన్ రాజధాని. 1727లో మహారాజా సవాయి జైసింగ్ నిర్మించాడు. ఈ నగర జనాభా దాదాపు 30 లక్షలు.

జైపూర్ భారతదేశంలో చక్కని ప్రళాళికతో రూపొందించిన నగరాలలో ఒకటి. రాజస్థాన్ లోని అర్ధఎడారి భూమిలో ప్రాంతంలో ఉపస్థితమైన నగరం. ఒకప్పుడు రాజరిక పాలనలోని రాజ్యాలకు రాజధానిగా ఉన్న ఈ నగరం ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర రాజధానిగా ఉంది. రాజస్థాన్ నగర నిర్మాణ శైలి రాజపుత్రుల రాజరిక అభిరుచికి తగిన విధంగా ఉంటుంది. ప్రస్తుత జైపూరు నగరం మహానగరానికి ఉన్న సకల వసతులను కలిగి వాణిజ్యానికి అనుకూలంగా ఉండి ప్రఖ్యాత వ్యాపార కూడలిగా ఉంది. అధునిక నగరాల నిర్మాణానికి ముందే అభివృద్ధి చెంది ఉన్న భారతీయ నగరాలలో జైపూర్ ప్రత్యేకత కలిగి ఉంది. రాజస్థాన్ నగరం 111 అడుగుల (34 మీటర్ల) రహదార్లతో ఆరు విభాగాలుగా విభజింపబడి రాజగంభీరంగా ఉంటుంది. నగరశివారు ప్రాంతాలు చక్కని రహదార్లతో నగరంతో అనుసంధానించబడి ఉంటుంది. మధ్యలో ఆరవ భాగంలో రాజమహల్ నాలుగు వైపులా నానుగు భాగాలు. ఆరవభాగం తూర్పు దిశగా విస్తరించి ఉంటుంది. పేలస్ విభాగం రాజసౌధాలను (హవా మహల్) అనుకుని ఉంటుంది. సాధారణ పూల తోటలు, చిన్న సరస్సు నహర్ ఘడ్ దుర్గ్ ఇది సవాయి జై సింఘ్ II వివాస స్థలంగా ఉంటూ వచ్చింది. జైపూర్ లోని జంతర్ మంతర్ ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి. భారతదేశంలో జైపూర్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.

చరిత్ర[మార్చు]

సాశ.పూ. 1875లో ప్రిస్నిపల్ వీధి

ఇతిహాసకాలంలో జైపూరు ప్రదేశం అప్పటి మత్స్యదేశంలో ఒక భాగం. అధునాతన జైపూరు నగరాన్ని 1699-1727లో మహారాజా సావై జై సింఘ్ II చేత స్థాపించబడింది. ఆ మహారాజు రాజధని అయిన అంబర్ జైపూర్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారజు పెరిగుతున్న జనసంఖ్య తరుగుతున్న నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని తన రాజధనిని తరలించాలని అనుకున్నాడు. మహారాజు జైపూర్ నగర రూపురేఖల ప్రణాళికను వ్యూహరచన చేసే ముందు అనేక నిర్మాణకౌశలానికి సంబంధించిన పుస్తకాలను పరిశీలించాడు. చివరకు విద్యాదర భట్టాఆచార్య (ఆయన ముందు ఖజానా గణికుడుగా ఉండే వాడు. తరువాత ప్రధాన నిర్మాణ అధికారిగా మహారాజు చేత నియమించబడ్డాడు) పర్యవేక్షణలో జైపూర్ నగరం ప్రాచీన సంస్కృతులను వాస్తుశాస్త్ర రీతిగా అనుసరిస్తూ రూపుదిద్దుకుంది. మరాఠీలతో అనేక యుద్ధాలను ఎదుర్కొన్న తరువాత మహారాజా సావై జై సింఘ్ II నగరరక్షణ మీద దృష్టిసారించాడు. ఆయనకు జ్యోతిషం, గణితం, జ్యోతిష గణనల మీద ఉన్న ప్రేమ కారణంగా జై సింఘ్ మహారాజు రాజపురోహితుడైన విద్యాధర భట్టాచార్య సలహా కొరకు ప్రార్థించాడు. ఆయన నగర మధ్యమంలో ఉన్న రాజసౌధంతో సహా అనేక భవనముల నిర్మాణంలో మహారాజుకు ప్రధాన సలహాదారుడుగా ఉన్నాడు.

1727న నిర్మాణపు పనులు ఆరంభించబడిన ఈ నగరం నాలుగు సంవత్సరాల సమయంలో ప్రధాన కట్టడాలు, రహదార్లు, విశాలమైన ఆవరణల నిర్మాణం పూర్తి అయింది. భారతీయ నిర్మాణశాస్త్రం అయిన శిల్పశాస్త్రం ఆధారంగా నగరం నిర్మించబడింది. ఈ నగరం 9 ఉప విభాగాలుగా విభజింపబడ్డాయి. వీటిలో రెండు విభాగాలలో ప్రభుత్వ భవనాలు, రాజసౌధాలున్నాయి. మిగిలిన ఏడుభాగాలు ప్రజోపయోగానికి కేటాయించబడింది. ఏడు దృఢమైన ద్వారాలు కలిగిన గోడలతో కోట నిర్మితమైంది. భారతభూభాగంలో ఆసమయంలో ఈ నగర నిర్మాణం విశిష్టమైనదిగా గుర్తించబడింది. మహారాజు సవాయ్ రామ్ సింఘ్ II కాలంలో 1876లో ఈ నగరాన్ని సందర్శించిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కు స్వాగతం చెప్తూ ఈ నగర రాజసుధాలకు గులాబీవర్ణం పూయబడింది. ఈ రోజు కూడా రాజసౌధం గులబీవర్ణంలో దూరం నుండే ఆకర్షిస్తుంది. 19వ శతాబ్దంలో ఈ నగర జనాభా 1900 నుండి 1,60,000 వరకు విపరీతంగా వృద్ధిచెందింది. నగరంలో ఇరువైపులా కాలిబాటలతో నిర్మించబడి విశాలమైనదార్లు ఉన్నాయి. నగరంలో అనేక ఆసుపత్రులు ఉన్నాయి. నగర ప్రధాన పరిశ్రమలు లోహములు, పాలరాళ్ళు. మదరసా హన్‌‌రీ పేరుతో ఒక కళాశాల 1868లో స్థాపించబడింది. నగరంలో ఇంకా మూడు కళాశాలలు ఉన్నాయి వాటిలో సంస్కృత కళాశాల (1865) ఉంది. 1867లో సవాయ్ రామ్ సింఘ్ IIచేత బాలికల పాఠశాల స్థాపించబడింది. నగరంలో పురాతన మదుపుదార్లైన జైన్లు, మర్వాడీలు అయిన ధనికులు, రావణా రాజపుత్ నిర్వాహకులు అధికంగా ఉన్నారు.

భౌగోళికము , వాతావరణం[మార్చు]

జాల్ మహల్
జాల్ మహల్

జంతుజీవనం[మార్చు]

జైపూర్‌లో నివసించే లంగర్ అనబడే కోతులు

భౌగోళికం[మార్చు]

రాజస్థాన్ రాష్ట్రానికి రాజధాజి జైపూరు. జైపూర్ రాజస్థాన్‌కు తూర్పుదిశగా ఉంది. జైపూరు సముద్రమట్టానికి 1417 అడుగుల (431 మీటర్ల) ఎత్తులో ఉంది. జైపూర్ నగరం నుండి బనాస్, బన్గంగానదులు ప్రవహిస్తుంటాయి. భూగర్భజలాలల నుండి జైపూర్‌ జిల్లాకు 28.65 మిలియన్ల క్యూబిక్ మీటర్ల జలం లభ్యమౌతుంది. అయినప్పటైకీ తీవ్రమైన కరువు మాత్రం అద్రుదుగానే సంభవిస్తుంది. జలనిర్వహణ బలహీనత, ట్యూబ్ బావులను అతిగా ఉపయోగించడం వలన కొన్ని ప్రాతాలలో వ్యవసాయ ఉపయోగాలకు జలం లభ్యంకావడం కొంత భయపెడుతుంది.

వాతావరణం[మార్చు]

జైపూర్ వేడి అయిన శోతోష్ణస్థి కలిగిన నగరం. జైపూర్ నగరం 26 అంగుళాల (650 మిల్లీ మీటర్లు) వర్షపాతం అందుకుంటుంది. వర్షాకాలంలోనే అధికమైన వర్షాలు కురుస్తాయి. జూన్ మాసం నుండి సెప్టంబర్ మాసం వరకు వర్షాకాలం ఉంటుంది. సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటుంది. ఏప్రిల్ మాసం నుండి జూలై మాసం వరకు 30 సెంటీగ్రేడ్ (80 ఫారెన్‌హీట్ ) డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రత ఉంటుంది. వర్షాకాలమంతా అధికంగాురుములతో కూడిన వర్షాలు పడుతుంటాయి. వరదలు మాత్రం అసాధారణం. నవంబరు నుండి ఫిబ్రవరి వరకు సాగే శీతాకాలం స్వల్పమైన చలితో ఆహ్లాదం కలిగిస్తుంది. శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత 15–18 ° సెంటీగ్రేడ్ (59-64° ఫారెన్‌హీట్). గాలిలో తేమ కొంచగా లేక అసలు లేకుండా ఉంటుంది. ఒక్కోసారి వీచే చలిగాలులకు ఉష్ణోగ్రతలు గడ్డకట్టించేత వరకు పడిపోతాయి.

నిర్మాణకౌశలం[మార్చు]

అంబర్ కోట వద్ద ఉన్న గణేశ్ పోల్
నాహర్ ఘర్ కోట నుండి రాత్రివేళలలో జైపూర్

ముందుగా ప్రణాళిక వేసిన నగరమైన జైపూర్ నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఒకప్పుడు రాజపుత్రులు ఒకరితో ఒకరు నిరంతరం కలహించికుంటూ యుద్ధాలలో మునిగితేలుతుండే వారు. జైపూర్ రాజులు మొగలులతో సత్సంబంధాలను కలిగి ఉన్న కారణంగా వారి అధికార ప్రాంతాన్ని విస్తరించుకున్నారు. నగరం వస్తుశాస్త్ర ఆధారంగా నిర్మితమైన నగరం. వాస్తుశాస్త్రం వేదసమ్మతమైనది సంపదలు సౌభాగ్యం కలుగజేసేది. ఒక్కొక్క వీధి తూర్పు పడమరలుగా ఉత్తరదక్షిణాలుగా చక్కగా నిర్మించబడ్డాయి. తూర్పు ద్వారం పేరు 'సూర్యస్తూపం అంటారు. పడమటి ద్వారాన్ని చంద్రస్తూపం అంటారు. ఉత్తర ద్వారం జొరావర్ సింగ్ ద్వారం అంటారు. ఉత్తరద్వారం వైపు పురాతన రాజధాని అయిన అంబర్ ఉంది. అయినా ప్రస్తుత జైపూర్ నగరం నగరం చుట్టూ నిర్మితమైన గోడలను దాటి విస్తరించింది. ప్రణాళిక వేసిన నగరం గోడల లోపల ఉంటుంది. ద్వారాలు సూర్యోదయానికి తెరచి సూర్యాస్థమయానికి మూసివేస్తుంటారు. అప్పటి ఉత్తరభారతదేశ నగరాలన్నీ ఇరుకైన సందులు వీధులుతో ఉన్నాయి. వీధులన్నీ కలగా పులగమై దారి కన్నుకోవడం వీలుకాని అయోమయంగా ఉంటాయి. అక్కడక్కడా ఆలయలు, ప్రదేశాలు, తాత్కాలిక నివాస ప్రదేశాలు ఉంటాయి. వస్తుశాస్త్రానికి ఈ నగరాలు అనుగుణణ్గా ఉండవు. అయినా సవాయ్ జైసింగ్ II, బెంగాలి సలహారాదుడు అయిన విద్యాధర్‌ల ఆలోచనలు రూపుదిద్దుకుని వాస్తుశాస్త్ర అనుగుణ్యమైన చక్కటి నిరంఆణు శైలితో జైపూర్ నగరం నిర్మించబడింది. జైపూర్ నగరం ఎనిమిది మండలాలుగా విభజింపబడింది. పితాపద అనే తొమ్మిదవ విభాగంలో వాణిజ్యాఅ అవసరాల కొరకు నిర్మించబడింది. పితాపద కూడా తొమ్మిది విభాగాలుగా విభజింపబడింది. ఈ నగర నిర్మాణం సవాయ్ జైసింగ్ II జ్యోతిషశాస్త్ర జ్ఞానం వాస్తుశాస్త్ర జ్ఞానం తెలియజేస్తుంది.

నిర్వహణ[మార్చు]

నగర నిర్మాణం[మార్చు]

ప్రబల పర్యాటక పత్రిక కోన్డ్ నాస్ట్ ట్రావెలర్ పాఠకులకు జరిపిన సర్వేలో పాఠకులు ఆసియాలోని పర్యాటక ఆకర్షణ కలిగిన నగరాలలో ఏడవస్థానాన్ని సంపాదించుకుంది. ఈ సర్వేలో జైపూర్ 76.5% శాతం ఓట్లు మరొక సంపాదించడం విశేషం. మొదటి పది స్థానాలు సంపాదించుకున్న ఇతర నగరాలు వరుసగా బేంకాక్, హంగ్‌కాంగ్, చియాంగ్‌మై, సింగపూరు, క్యోటో, సంగై, జైపూర్, హనోయ్, బీజింగ్. ఆధునిక నగరనిర్మాణ సదుపాయాలు అభివృద్ధి చెందిన కారణంగా జైపూరు పోడవైన నగరాలైన ఢిల్లీ, కొలకత్తాను సమీపిస్తుంది. నగరం శరవేగంతో అభివృద్ధిచెందుతుంది. రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ అభివృద్ధికి ప్రధానకేంద్రం అయింది. సాంగ్‌నర్లో జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్కడి నుండి ఢిల్లీ, ముంబాయి, అహ్మదాబాద్, బెంగుళూరు, కొలకత్తా, గౌహతి నగరాలకు విమానసర్వీసుల సదుపాయం కలిగిస్తుంది. అలాగే అంతర్జాతీయంగా దుబాయ్కు ప్రయాణ వసతి కలిగి ఉంది. జైపూర్ చక్కగా నిర్వహింపబడుతున్న పలు అంతస్తులు కలిగిన రహదార్లను కలిగి ఉంది. ఈ రహదార్లు క్లోజ్డ్ సర్క్యూట్ కెమారాలు, ట్రాఫిక్ లైట్స్ వంటి సదుపాయాలతో ట్రాఫిక్ కంట్రోల్ సంస్థ పర్యవేక్షణలో చక్కగా నిర్వహించబడుతున్నాయి. పోలీస్ కంట్రోల్ రూమ్ (పి సి ఆర్)వ్యాన్లు గి పి ఎస్ సదుపాయలు కలిగి నగర పర్యవేక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. జైపూర్ ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన జీవనపరిస్తుతులు కల్పిస్తామని సగర్వంగా చెప్పుకుంటుంది. ప్రణాళికా బద్ధమైన సెక్టర్లు, బ్లాకులుగా విభజించి చక్కని జే డి ఎ (జైపూర్ డెవలప్‌మెట్ అధారిటీ) సాయంతో నిర్వహించబడుతున్న ఉద్యానవనాల సదుపాయాలను కల్పిస్తామని చెప్తున్నారు. అనేక విధమైన దుకాణసమాహారాలు, మల్టీప్లెక్ష్ వంటి నగరజీవిత సౌకర్యాలను జైపూర్ పౌరులకు అందిస్తుంది. అంతర్జాతీయ క్రికెట మ్యాచ్‌లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు జైపూర్ సవాయి మాన్‌సింగ్ క్రికెట్ స్టేడియప్రసిద్ధి చెందింది. జైపూర్ జ్య్వెలరీ షో, జైపూర్ అంతర్జాతీయ సాహిత్య సదస్సు వంటి ప్రత్యేక కార్యక్రమ వేదికలు భారతీయులనే కాక విదేశీయులను ఆకర్షిస్తూ జైపూర్6కు కాస్మోపాలిటన్ వగర (విలాసవంతమైన నగరం) అంతస్తు ఇస్తున్నాయి. సవాయ్ మాన్6సింగ్ ఆసుపత్రి, ఎస్ డి ఎమ్ హెచ్ (డర్లబ్‌జీ ఆసుపత్రి), ఫోర్టిస్ ఆసుపత్రులు జైపూర్‌లో ఉన్న ప్రసిద్ధ ఆసుపత్రులలో కొన్ని. నగరంలో ఇవి కాక 40 చిన్నవి, మధ్యమ రకమైన ఆసుపత్రులు ఉన్నాయి. పాత జైపూర్ జనసమ్మర్ధమైనది. అధునిక జైపూర్ చక్కగా నిర్వహించబడుతున్న రహదార్లతో చక్కని ప్రయాణ వసతులను కలిగి ఉంది. మహేంద్రా గ్రూప్స్ నిర్మించిన టెక్‌పార్క్ ఇప్పుడు నిర్మాణంలో ఉంది. 2011 నాటికి నిర్మాణం పూర్తి చేసుకుని పనిచేయడం మొదలు పెడుతుందని అంచనా వేస్తున్నారు.

ఆర్ధిక రంగం[మార్చు]

జైపూరు నగరం సంప్రదాయక, అధునాతన పరిశ్రమలకు కేంద్రం. ఆసియాలో అత్యధికంగా స్వర్ణ ఆభరణాలు, వజ్రాలు, రత్నాభరణాలను చేసే నగరాలలో జైపూర్ ప్రధానమైనది. నీలి వజ్రాల (తాంజానైట్)ను జైపూర్ నగరంలో మాత్రమే పదును పెట్టబడతాయి. ఏసిటిలేన్ గ్యాస్, ఎ సి ఎస్ ఆర్ (అల్యూమినియమ్ కండక్టర్ స్టీల్ రీఇన్‌ఫోర్స్డ్) కేబుల్, మైదా (ఆల్ పర్పస్ ఫ్లోర్), బాల్ బియరింగ్స్, ఎల్ పి జి బాట్లింగ్, సెరామిక్స్, పాటరీ, కోల్డ్ రోల్ స్ట్రిప్స్, కొర్రుగేటెడ్ బాక్సెస్, డీఆయిల్డ్ కేక్స్, డర్రీస్, డైయింగ్, ప్రింటింగ్, ఎడిబుల్ ఆయిల్, ఎలెక్ట్రానిక్ ఐటెమ్స్, ఎన్‌గ్రేవింగ్ & బ్రాస్ ఐటెమ్స్, ఫెర్రస్ ‍ & నాన్‌ఫెర్రస్ కాస్టింగ్స్, జెమ్స్, జువెలరీ, జనరల్ ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, గ్రానైట్ స్లాబ్స్, టైల్స్, చేతితో తయారు చేయబడే పేపర్లు, చేతి అలంకరణ సామాగ్రి, హాలోజెన్, ఆటోమొబైల్ హెడ్‌లాంప్స్, హవాయ్ చెప్పల్స్ (శాండల్స్), గృహ విద్యుత్తు పరికరాలు, ఎహ్ టి స్టీల్ స్ట్రిప్స్, ఐయోడైజ్డ్ సాల్ట్, లాంప్స్, రైల్వే కొరకు లామినేటెడ్ స్ప్రింగ్స్, మార్బుల్ శిల్పాలు, మార్బుల్ టైల్స్& స్లాబ్స్, విద్యుత్త్ పరికరాల కొరకు మౌల్డెడ్ ఫ్లాస్టిక్ కాంపొనెన్ట్స్, నైట్రో క్లోరోబెంజిన్, ఆక్సిజెన్ గ్యాస్, సెంట్లు, వర్ణాలు (పిగ్‌మెంట్స్), ఫ్లాస్టిక్ కంటెయినర్లు, పి.పి మల్టీఫిలమెంట్ దారం, పి వి సి కేబుల్స్, పి వి సి తలుపులు, పి వి సి చెప్పులు, కేన్‌వాస్ షూస్, పోర్ట్‌లాండ్ సిమెంట్, రెడీ మేడ్ గార్మెంట్స్ (తయారీ దుస్తులు), రి-రోలర్ ప్రొడక్ట్స్, సెమోలినా (రవ్వ), స్టీల్ ఫర్నీచర్, స్టీల్ ఇంగాట్స్, స్టోన్ గ్రిట్స్, సింతటిక్ తోలు, సింథెటిక్ వస్త్రంతో తయారు చేసిన సూట్లు & షర్ట్స్, ఔషధాల తయారీ, టూ వే రేడియో & లైన్, ఉతికే సబ్బులు, గోధుమ, వులెన్ కార్పెట్స్, రిఫైడ్ నూనెలు, వనస్పతి నెయ్యి, హెవీ స్టీల్ ఫ్యాబ్రికేషన్, బ్రాస్, లాక్వర్ వర్క్, ఎనామిల్ వర్క్, రజ్ఞాలు, ఆభరణాలు, గ్రానైట్ టైల్స్, చేనేత, అద్దకపు వస్త్రాలు, తయారీ దుస్తులు, వులెన్, సిల్క్ కార్పెట్లు. జైపూర్ ఔట్‌సౌర్సింగ్ నగరాలలో అంతర్జాతీయంగా 31వ శ్రేణిలో ఉంది. జెన్‌ప్యాక్ట్, ఇన్ఫోసిస్ వారి బి పి ఒ లను స్థాపించి విజయవంతంగా నడుపుతున్నారు. జెన్‌ప్యాక్ట్ త్వరితిగతిన అభివృద్ధిచెందుతూ ఉంది. 2-3 సంవత్సరాలుగా రియల్ ఎటేట్ వ్యాపారం లాభసాటిగా మారింది. జైపూర్ నగరంలో ఇప్పటికే స్థాపించి పనిచేస్తున్న పరిశ్రమలు ఎమ్ ఐ సి ఒ, కోకోకోలా, ఐ బి ఎమ్, ఎరిక్షన్, ఎన్ ఇ ఐ పరిశ్రమలు ప్రబలమైన ఎన్ బి సి బియరింగ్స్ మొదలైనవి. ఎమ్ ఐ రహదారిలో జ్యుబేరి పరిశ్రమ ఇంజనియరింగ్ ఉంది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా అనేక అంతర్జాతీయ బ్యాంకులు ఆర్థిక సేవలు అందిస్తున్నాయి. జయపూర్ నగరంలో భారతదేశపు అంతర్జాతీయ ఐటి ఎస్ ఇ జే మహీంద్రా వరల్డ్ సిటీ ఉంది. సింగపూరుకు చెందిన జ్యురాంఘ్ కన్‌స్ట్రక్షన్స్ ఈ ప్రళాళిక 3,000 ఎకరాల ప్రదేశంలో అజ్మీర్ రహదారిలో నిర్మించబడి ఉంది. ఇక్కడ ఇన్ఫోసిస్, టి సి ఎస్, విప్రో, టెక్6మహీంద్రా, ఐ ఎస్ యై ఎస్, బి పి ఒ సర్వీసెస్, ట్రూవర్త్, డ్యూట్‌స్చే బ్యాంక్ వంటి సంస్థలు తమ కార్యాలయాలు నడుపుతున్నాయి. వరల్డ్ ట్రేడ్ పార్క్ మళవీయ నగర్ నిర్మాణంలో ఉంది. దానిలో విలాసవంతమైన హోటళ్ళు, వ్యాపారకూడలి, అంతర్జాతీయ తయారీల షోరూమ్స్ ఉంటాయి. జైపూర్ నగరంలో రాబోయే సంవత్సరాలలో ఇది అత్యాధునిక వ్యాపారాభివృద్ధి కేంద్రం ఔతుంది. చిన్నతరహా, బృహత్తర పరిశ్రమల కూడళ్ళు 48, చిన్నతరహా పరిశ్రమలు 19,544, పారిశ్రామిక ప్రదేశాలు 19. అవి వరుసగా బగ్రు, బైస్ గోడమ్, బిన్ద్యక, డుబు, హిరావాల, జెట్‌పురా, ఝోత్వారా, కాదేరా, కనక్పురా, కార్తపురా, మాళవీయ నగర్, ఫులేరా, రెన్‌వాల్, సంగనర్, షహ్పురా, సితపురా, సుదర్శన్‌పురా, విశ్వకర్మ. జైపూర్ త్వరలో అంతర్జాతీయ సమావేశ కేంద్రం, గోల్ఫ్ మైదానం ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తుంది. ఆగ్రా రహదారిలో ఫిల్మ్ సిటీ ఉంది.

పర్యాటకం[మార్చు]

భారతదేశ పర్యాటక అకర్షణ నగరాలలో జైపూర్ ప్రధానమైనది. అంతర్జాతీయ పర్యాటకుల లక్ష్యనగరాలలో జైపూర్ ఒకటి. అనేమ మంది ప్రజలు ఇక్కడి కోటలు, జ్ఞాపక చిహ్నాలను సందర్శించి భారతీయ పురాతన శిలకళా నిర్మాణకళా వైభవం చూసి ముగ్ధులు ఔతారు. జైపూర్ నగర ఆర్థిక వనరులలో పర్యాటరంగం ప్రధానమైనది. పర్యాటకుల సంఖ్యను పెంచడానికి అదనపు సౌకర్యాలు, అదనపు ఆకర్షణలు అధికం చేయాలని నగర నిర్వాహం ఎదురుచూస్తుంది. నగరం అందిస్తున్న డెంటల్ పర్యాటకం పర్యాటకులకు ఒక ఉపయోగకరమైన ఆకర్షణగా మారింది.

కోటలు జ్ఞాపకచిహ్నాలు[మార్చు]

అంబర్ కోట
అంబర్ కోట
ది ఆల్బర్ట్ హాల్ల్ మ్యూజియమ్
ది ఆల్బర్ట్ హాల్ల్ మ్యూజియమ్

జైపూర్ అనేక కోటలు, రాజభవనాలు, జ్ఞాపక చిహ్నాలకు ప్రసిద్ధి చెందినది. హవా మహల్, అంబర్ ఫోర్ట్, జైఘర్ ఫోర్ట్, నహర్గర్ ఫోర్ట్, చిటీ ప్యాలెస్, జల్ మహల్, రామ్బర్ఘ్ ప్యాలెస్, సెంట్రల్ మ్యూజియమ్ వంటివి పర్యాటకులను విపరీతంగా అకర్షించే ప్రదేశాలలో కొన్ని.

ఆలయాలు , ఆరాధక ప్రదేశాలు[మార్చు]

స్వామినారాయణ ఆలయం
స్వామినారాయణ ఆలయం

జైపూర్ నగరం అంతా అసంఖ్యాకంగా అలయాలు ఆరాధక ప్రదేశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వీధిలో చక్కని ఆలయాన్ని దర్శించవచ్చు. మతపరంగా ప్రజలు ఈ నగరాన్ని చిన్న కాశి నగరంగా భావిస్తారు. జైపూరు నగరంలోని ప్రధాన ఆలయాలు వరుసగా గోవింద్ దేవ్‌జీ ఆలయం, గల్తాజీ ఆలయం, శ్రీ కాళి ఆలయం, సంగనేరి ద్వారం, జైపూర్, లక్ష్మీ నారాయణ్ మందిరం (బిర్లా మందిరం), ఘర్ గణేశ్ ఆలయం, అంబర్ లోని షీలాదేవి ఆలయం, పంచాయితీ హాల్, రాధా గోవింద్‌జీ ఆలయం, జైపూర్ పాలకుల చేత స్వల్పంగా ఉన్న క్రైస్తవ సమాజము కొరకు 130 సంవత్సరాల ముందు మిర్జా ఇస్మాయిల్ రోడ్డు సమీపంలో ఉన్న ది ఆల్ సెయింట్స్ చర్చి. ఈ నిర్మాణం అప్పటి మిక్కిలి నాణ్యమైన నిర్మాణశైలికి తార్కాణంగా నిలిచింది.

పూల తోటలు[మార్చు]

రామ్ నివాస్ గార్డెన్
చాంద్‌బవోరి

జైపూర్ నగరం అందమైన పూలతోటలు, ఉద్యానవనాలతో నిండి ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి రామ్ నివాస్ గెడెన్, సిసోలియా రాణి గార్డెన్, ప్యాలెస్, విద్యాదర్ గార్డెన్, కనక్ వృందావన్, సెంట్రల్ పార్క్, మాన్‌సరోవర్ సమీపంలో ఉన్న టెక్నాలజీ పార్క్, గోనర్ వద్ద ఉన్న విద్యాదర్ కా బాగ్ మొదలైనవి. ఇతర ఆకర్షణలు చాంద్ బయోరి (మెట్ల బావి). ఛోకీదాని (గ్రామీణ విశ్రాతి గృహం), జైపూర్ నగర స్లమ్ అయిన కత్పుత్లి స్లమ్, రాజ్ మందిర్ సినేమా ఒక అందమైన సినిమా దియేటర్.

జనసంఖ్య[మార్చు]

2011 జనాంకగణనను అనుసరించి జైపూర్ నగర జనాభా 6,663,971. ఇది రాజస్థాన్ రాష్ట్ర జనాభాలో 9.71%. 2001 నుండి నగర జనాభా 26.91% అభివృద్ధి చెందింది. అధిఖ సంఖ్యాకుల ప్రధాన మతాలు హిందూ మతం, ముస్లిమ్ మతం, జైన మతం. వీరిలో హిందువులు 78%, ముస్లిములు 17%, జైన్లు 4%, సిక్ఖులు 0.5%, క్రైస్తవులు 0.5%. 47.49% ప్రజలు గ్రామాలలో నివసిస్తుండగా 52.59% ప్రజలు నగరపురాలలో నివసిస్తున్నారు. అక్షరాస్యత 76.44%. పురుషుల అక్షరాస్యత 87.27%, స్త్రీల అక్షరాస్యత 63.64%. 1000 మంది పురుషులకు స్త్రీల నిష్పత్తి 909. సధారణం ప్రజలు హిందీ, రాజస్తానీ భాషను మాట్లాడుతుంటారు. అలాగే ఆంగ్లము, పంజాబీ, సింధీ భాషను కూడా విస్తృతంగా మాట్లాడుతుంటారు. నేషనల్ క్రైమ్ రొపోర్ట్ బ్యూరో (ఎన్ సి ఆర్ బి)భారతీయ 10 లక్షల జనాభాకు మించి ఉన్న 35 నగరాలలో జైపూర్ 3వ స్థానంలో ఉన్నట్లు అంచనా. నగర ప్రధాన జైలు పేరు జైపూర్ సెంట్రల్ జైలు.

సంస్కృతి[మార్చు]

జైపూర్ భారతీయ సంస్కృతికి ప్రధాన కేంద్రం. ముఖ్యంగా జవహర్ కళాకేంద్రా, రవీంద్రమంచ్ ఐక్య రాజస్థన్ సంస్కృతిని ప్రజలకు చేరువ చేస్తున్నాయి. ఆబర్ట్ హాల్ల్ మ్యూజియమ్ (ప్రభుత్వ సెంట్రల్ మ్యూజియమ్)లో అనేక కళలను, పురాతన కళాఖండాలను చూడ వచ్చు. హవా మహల్‌లో రాష్ట్రప్రభుత్వ వస్తుకళా ప్రదర్శనశాలలో విరాటనగర్‌లో కళాప్రదర్శనశాల ఉంది. టౌన్ హాల్ (పాత విధానసభ)ను వస్తుకళా ప్రద్శనశాలగా మార్చబడింది. నగరంలోని వివిధ ప్రదేశాలలో వివిధ రూపాలలో సంస్కృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది. నగరంలోని ఫ్లైఓవర్లు కూడా కుతూహలం కలిగించే వివిధరూపాలతో సంస్కృతిని ప్రతిబింబించేలా అలకంకరించబడి ఉంటాయి.

కళలు , హస్తకళలు[మార్చు]

రాజస్థానీ పాలకులు చక్కని కళాపోషకులు. వారు పలు కళలను కళాకారులను ఆదరించి ప్రోత్సహించారు. వారు దేశం నలుమూలల నుండి, అంతర్జాతీయంగా నైపుణ్యము కలిగిన కళాకారులను, చేతిపని వారిని అహ్వానించారు. వివిధ సమూహాలకు చెందిన ప్రజలు రాజస్థానుకు చేరి అక్కడే స్థిరపడ్డారు. నగరంలోని చేతి పనులు వరుసగా బంధాని, బ్లాక్ ప్రింటింగ్ (అచ్చుల సాయంతో అద్దకము), రాతి చెక్కడము, శిల్పాలు, టార్కషి (లోహపాత్రల అలంకరణ, కొయ్య సామాను అలంకరణ), జరీపని, గోటు పని, కినారి, జర్ధారీ పని, వెండి ఆభరణాలు, రత్నాలు, ఎనామిల్ పని, ఆభరణాలు, సూక్ష్మ వర్ణ చిత్రాలు, బ్లూ పాటరీ (మృత్తిక కళాఖండాలు), దంతపు పని, షెల్లాక్ పని (జిగురుతో చేసే పని), తోలు వస్తువుల తయారీ మొదలైనవి.

కళాప్రదర్శన[మార్చు]

జైపూరు ప్రత్యేకత కథక్ నృత్యం. ఇతర నృత్యరీతులు తమాషా.

ఆహారసంస్కృతి[మార్చు]

పింక్ సిటీకగ ఉన్న పలు ద్వారాలలో ఇది ఒకటి.

జైపూర్ నోరూరించే పలు ఆహారపదార్ధాలకు ప్రసిద్ధి. అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణ కేంద్రం కనుక ఇక్కడ తయారయ్యే ఆహారాలు ప్రపంచప్రసిద్ధం అయ్యాయి. ఇక్కడ లభించే డాల్ భాటీ కూర్మా, మిస్సీ రోటీ, గేవర్, ఫీని, గజక్, చౌగుణికీ లడ్డూ, మూంగ్ తాల్ వంటి తీపి పదార్థాలు పర్యాటకులకు నోరూరిస్తాయి.

పండుగలు[మార్చు]

సంవత్సరం పొడవినా అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని గాంగ్యూర్ ఫెస్టివల్, జైపూర్ రచయితల ఉత్సవం, కిటే ఉత్సవం, శీతల మతా ఉత్సవం, చాక్సు సంత, గజోత్సవం మొదలైనవి.

క్రీడలు[మార్చు]

పోలో, షూటింగ్, గోల్ఫ్, క్రికెట్, టెన్నిస్, బాడ్మింటన్, కబడ్డి మొదలైన క్రీడలు నగరంలో ప్రజాదరణ పొందిన క్రీడలు. 30,000 మంది కూర్చుని తిలకించగల సామర్థ్యం కలిగిన సవాయి మాన్సింగ్ స్టేడియం జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు వేదికగా ఉంది. క్రికెట్ గ్రౌండుతో చేరి ఇండోర్, ఔట్‌డోర్ క్రీడలు జరగడానికి వీలుగా సకల వసతులు కలిగిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. అనేక అంతర్జాతీయ బ్యాడ్మింటన్, టెన్నిస్ క్రీడలు ఇక్కడ నిర్వహించబడ్డాయి. రాజస్థాన్ రాయల్ పేరుతో జైపూరు నగర ఐ పి ఎల్ క్రికెట్ బృందం కూడా ఉంది. పోలో క్రీడల సమయంలో పోలో క్రీడాకారులకు, ప్రేక్షకులకు పోలో క్లబ్ భోజన వసతి సమకూరుస్తుంది. జగత్పురా వద్ద జే డి ఏ షూటింగ్ రేంజస్ ఎయిర్ గన్, ట్రాప్ షూటింగ్ క్రీడలకు అంతర్జాతీయ ప్రామాణిక వసతులు కల్పిస్తుంది. ఇది ప్రజల సందర్శనానికి అవకాశం కల్పిస్తుంది. రాంబాగ్ ప్యాలెస్ పక్కనే రాంబాగ్ గోల్ఫ్ క్లబ్ తమ కార్య నిర్వహణ చేస్తుంది. పోలో క్లబ్ ప్రజలకు గోల్ఫ్ ఆడే వసతి కల్పిస్తుంది. నగరమంతా ఉన్న జై క్లబ్, ఇతర క్లబ్‌లు ఇతర క్రీడలకు కావలసిన సౌకర్యాలను కలిగిస్తుంది. నగరంలో ఉన్న పాఠశాలలో అనేకం విద్యార్థులకు ఫుట్ బాల్, క్రికెట్, టెన్నిస్, బాస్కెట్ బాల్, హాకీ వంటి బాల్ గేమ్స్ లకు కావలసిన వసతి కలిగిస్తుంది.

విద్య[మార్చు]

సమీపకాలంగా జైపూర్ విద్యాపరంగా అభివృద్ధి చెంది ఉంది. ప్రశాంతమైన జైపూర్ నగరానికి ఉత్తరభారదేశ వాసులు తమ పిల్లలను ఉన్నత చదువులకు, సాంకేతిక విద్యాభ్యాసానికి పంపడానికి ఉత్సుకత చూపుతున్నారు. జైపూరులో 60 కంటే అధికమైన ఇంజనీరింగ్ కశాశాలలు, 40 కంటే అధికమైన బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు (వాణిజ్య విద్యాశిక్షణాలయాలు), 15 కంటే అధికమైన ఫార్మశీ ఇన్‌స్టిట్యూట్‌లు (ఔషధ తయారీ శిక్షణాలయాలు), 4 హోటెల్ మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు (వసతిగృహ నిర్వహణ శిక్షణాలయాలు), 3 మెడికల్ కాలేజులు (వైద్య కళాశాలలు), 6 దంతవిద్యా కళాశాలలు, ఉన్నాయి. జైపూర్ నగరంలో రాజస్థాన్ విశ్వవ్ద్యాలయంతో చేరి 8 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అగికల్చరల్ మార్కెటింగ్: జైపూర్, మాళవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ: జ్సైపూర్, ది ఎల్ ఎన్ ఎమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: జైపూర్ (డీమ్డ్ యూనివర్సిటీ) జైపూర్ యూనివర్శిటీ ఉన్నాయి. నగరంలో 250 సిబిఎస్‌సి, ఐసిఎస్‌ఇ కంటే స్కూల్స్ (పాఠశాలలు)ఉన్నాయి.

మాద్యమం[మార్చు]

జైపూర్ నగర ప్రచురణా మాద్యమం గురించి చెప్పాలంటే రాజస్థాన్ పత్రిక & దైనిక్ భాస్కర్ వంటి దినపత్రికలు ప్రథమ స్థానంలో ఉంటాయి. ఇవి కాక నగరంలో ఉదయపు వార్తా దిన పత్రికలు డైలీ న్యూస్, దైనిక్ నవజ్యోతి, రాష్ట్రదూత్, సమాచార్ జగత్, మేహక భారత్, నఫా నుకమ్, మార్నింగ్ న్యూస్ ఉన్నాయి. ఆంగ్ల పత్రికలలో టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైమ్స్, డి ఎన్ఏ ప్రముఖమైనవి. ఇవి కాక సాయంత్రపు ప్రచురణలలో టుడే, ఈవినింగ్ ప్లస్ ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఆల్ ఇండియా రేడియో జైపూర్ నగరంలో మీడియమ్ వేవ్, ఎఫ్ ఎమ్ ప్రసారాలను అందజేస్తుంది. ఇది ప్రాంతీయ ఎఫ్ ఎమ్ ఆకాశవాణి ప్రసారాలైన రేడియో మిర్చ్, ఋఏడియో సిటీ, మై ఎఫ్ ఎమ్, రేడియో తడ్క, గ్యాన్ వాణి, సౌత్ ఆసియా ఎఫ్ ఎమ్ లతో పోటీపడుతూ పనిచేస్తుంది. నగరంలో ఇండియా స్కూల్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ ఎఫ్ ఎమ్ ఉంది. ది పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ దూర్దర్శన్ (ప్రసార భారతి)ప్రధాన ప్రసారాలతో కలసి ప్రాంతీయ ప్రసారాలను అందజేస్తుంది.దూరదర్శన్ ప్రసారాలలో కేబుల్ ఆపరేటర్ ప్రసారాలలో డిటిహెచ్ ప్రజాదరణ పొంది ఉంది. ఇండియాలైన్ ద్వారా నగరం టెలిఫోన్ (దూరవాణి) సేవలను అందుకుంటున్నది. మొబైల్ (హస్తవాణి) ఆపరేటర్లు రిలయన్స్ సిడిఎమ్‌ఎ& రిలయన్స్ జి ఎస్ ఎమ్, బి ఎస్ ఎన్ ఎల్, ఏర్ టెల్, ఎమ్ టి ఎస్, యూనినార్, టాటా డికొమొ, ఏర్ సెల్, వొడాఫోన్, ఐడియా ద్వారా సేవలందిస్తున్నారు.

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

రహదారి[మార్చు]

జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం

జైపూరు రాజస్థన్ రాష్ట్రానికి రాజధని అలాగే ఇది రాజస్థాన్ రాష్ట్ర నడి మధ్య ఉపస్థితమై ఉంది. నేషనల్ హైవే (జాతీయరహదారి)8 జైపూరు నగరాన్ని ముంబాయి, ఢిల్లీనగరాలతో అనుసంధానిస్తుంది. నేషనల్ హైవే (జాతీయరహదారి)12 జైపూర్ నగరాన్నికోటతో అనుసంధానిస్తుంది. నేషనల్ హైవే (జాతీయరహదారి) 11 జైపూర్ జిల్లాలో మొత్తంగా 266 కిలోమీటర్ల పొడవున ఉండి ఈ నగరాన్ని బికనర్ నుండి అగ్రాతో అనుసంధానిస్తుంది. 2000 మార్చి నాటికి వివిధ రహదార్ల మొత్తం పొడవు సుమారుగా 4,102 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆర్ ఎస్ ఆర్ టి సి రాజస్థాన్ రాష్ట్రం అంతటి నుండి ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హయానా, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి ప్రదేశాలకు బస్ సర్వీసులను అందిస్తుంది. బస్ సర్వీసులు సింధీ క్యాంప్, జవహర్ నగర్ బస్ స్టాండ్, దుర్గాపురా బస్ స్టాండ్, సొడాలా బస్ స్టాండ్‌ల నుండి బస్సు సర్వీసులను నడుస్తుంటాయి.

సిటీ బస్[మార్చు]

జైపూర్ కృష్ణఘర్ రహదారి

జైపూర్ నగరసర్వీసు బస్సులను జైపూర్ సిటీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ (జే సి టి ఎస్ ఎల్) నిర్వహిస్తుంది. నగరంలో మొత్తం 300 నగర సర్వీసు బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులలో రెగ్యులర్ బస్సులు,లో ఫ్లోర్ బస్సులు ఉన్నాయి. నగరంలో వైశాలి నగర్, విద్యాధర్ నగర్, సంగనర్ డిపోల నుండి శీతలీ కరణ బస్సులను కూడా జే సి టి ఎల్ బస్సులను నడుపుతుంది. ప్రర్యాటకుల కొరకు హాప్ అండ్ హాప్ ఆఫ్ బస్సులను ప్రతిపాదిస్తుంది.

జైపూర్ బి ఆర్ టి ఎస్[మార్చు]

జైపూర్ బి ఆర్ టి ఎస్

జైపూర్ బస్ రాపిడ్ ట్రాన్‌సిస్ట్ సర్వీసులకు 2006లో ప్రభుత్వం నుండి అనుమతి లభించింది. జైపూర్ జే సి ఎస్ టి ఎల్ బస్సులను నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం జే సి టి ఎల్ కు ఇచ్చింది. జైపూర్ డెవలప్‌మెంట్ అధారిటీ, జైపూర్ నగర్ నిగమ్ సమష్టి నిర్వహణలో ఒక ప్రత్యేక వాహనం రూపుదిద్దబడింది.

  • సికార్ రోడ్ నుండి టోంక్ రోడ్ - ఉత్తర - దక్షిణ కారిడార్.
  • అజ్మీర్ రోడ్ నుండి ఢిల్లీ రోడ్. తూర్పు-పడమర కారిడార్.

ఉత్తర - దక్షిణ కారిడార్ ఒక శాఖ బస్సులను సి-జోన్ వద్ద హర్మదా నుండి పానీ పీచ్ 2010 నుండి నడుపబడుతున్నాయి.

ట్రైన్[మార్చు]

బహరతీయ రైల్వే నైరితీ విభాగానికి జైపూర్ ప్రధాన కేంద్రము. జైపూర్ రిల్వే స్టేషను మీటర్‌గేజ్ మార్గాలు యూనిగేజ్ ఆఫ్ ది ఇండియన్ రైల్వేస్ ప్రణాళిక ఆధ్వర్యంలో 1988 నుండి 1995 సంవత్సరాలలో బ్రాడ్‌గేజ్ రైలు మార్గంగా మార్చబడ్డాయి. ఇక్కడి నుండి రాజస్థాన్ లోని అన్ని నగరాలకు అలాగే భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైలు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఇక్కడి నుండి మీటర్‌గేజ్ రైళ్ళు శ్రీ గంగానగర్, చూరు, సికార్ వరకు రైలు సర్వీసులు నడుస్తుంటాయి. భరతీయ రైల్వే శాఖ నడుపుతున్న అత్యధిక విలాసవంతమైన రైలు అయిన ప్యాలెస్ ఆన్ వీల్స్ కూడా తమ పర్యాటకులను జైపూరు నగరంలో ఆపి సందర్శించే వీలు కల్పిస్తుంది.

జైపూర్ మెట్రో[మార్చు]

జైపూర్ మెట్రో పేరుతో ఒక రాపిడ్ ట్రాన్సిస్ట్ ప్రాజెక్ట్ ప్రారంభించి పనులు జరుగుతున్నాయి. ఇది నగర వాసులలకు త్వరిత ప్రయాణ వసతిని కల్పిస్తుంది. ఇది 2014 నాటికి పనులు పూర్తి చేసుకుని సేవలను ప్రారంభిస్తుందని ఎదురు చూడబడుతుంది.

వాయుమార్గం[మార్చు]

జైపూర్ ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్ట్ సంగనర్ వద్ద ఉంది. జైపూర్ నగర కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం నుండి దేశంలోని అనేక నగరాలకు విమాన సేవలను అందిస్తూ అలాగే అంతర్జాతీయ సేవలను అందిస్తుంది. టెర్మినల్ 1 నుండి దేశీయ, అంతర్జాతీయ విమానాలు నడుస్తుంటాయి. టెర్మినల్ 2 దేశీయ వస్తురవాణాకు మాత్రమే ప్రత్యేకించబడింది. ఈ విమానాశ్రయం నుండి 2009-2010 వరకు 2,55,704 విదేశీప్రయాణీకులు, 12,67,876 ప్రయాణీకులు ప్రయాణించినట్లు అంచనా. జైపూర్ కార్గో (వస్తువులను చేరవేయడం)సర్వీసులను నడుపుతుంటాయి. ఢిల్లీలో అధికంగా కురిసే మంచు కారణంగా అనేక విమానాలు ఢిల్లీ నుండి జైపూరుకు దారి మళ్ళించబడుతుంటాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]