చార్లెస్ కొరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Charles Correa
చార్లెస్ కొరియా
జననం(1930-09-01)1930 సెప్టెంబరు 1
సికింద్రాబాదు, ఇండియా
మరణం16 జూన్ 2015(2015-06-16) (aged 84)
ముంబై, ఇండియా
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థమిచిగాన్ విశ్వవిద్యాలయం
వృత్తిఆర్కిటెక్ట్
భవనాలుజవహర్ కళా భవన్,నేషనల్ క్రాప్ట్స్ మ్యూజియం,భారత్ భవన్.

చార్లెస్ కొరియా (1 సెప్టెంబరు 1930 – 16 జూన్ 2015) భారతదేశపు అత్యుత్తమ ఆర్కిటెక్టు.ఆయన అపురూప కట్టడాల రూపశిల్పి, నగర, పట్టణ అభివృద్ధి ప్రణాళికలలో అనేక నూతన ఒరవడులను సృష్టించిన సృజనశీలిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన పట్టణాలలోని పేదప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ సాంప్రదాయ పద్ధతులను నిర్మాణాలలో ఉపయోగించేవారు.[1]

తన విశిష్ట సేవలకు 1972లో పద్మశ్రీ, 2006లో పద్మ విభూషణ్, ఆగాఖాన్ అవార్డు లాంటి అత్యున్నత అవార్డులతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకొన్నారు.1984లో రాయల్ గోల్డుమెడల్ను అందుకున్నారు. జపాన్ ప్రీమియం ఇంపీరియల్, రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాయల్ గోల్డ్ మెడల్ పురస్కారంతో సత్కరించింది. చార్లెస్‌ను బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ సంస్థ భారత దేశపు గొప్ప ఆర్కిటెక్ట్ అంటూ కీర్తించింది.

ప్రారంభ జీవితం, విద్య[మార్చు]

చార్లెస్ 1930 సెప్టెంబర్ 1న సికింద్రాబాద్‌లో జన్మించారు.[2][3] ముంబైలోని సెయింట్ జేవీయర్ కాలేజీ, అమెరికాలోని మిచిగన్(1949–53), ప్రతిష్ఠాత్మక మస్సాచుస్సెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో(1953–55) విద్యనభ్యసించారు.1958లో ఆయన బొంబాయి లో ఆర్కిటెక్ట్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.[4] ఆయన జూన్ 16 2015 న మరణించారు.[5]

కెరీర్[మార్చు]

జైపూర్ లోని జవహర్ కళాకేంద్ర (1986–1992)
మహాత్మాగాంధీ మెమోరియల్,సబర్మతి ఆశ్రమం,అహ్మదాబాద్ (1958–1963)

కొరియా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధ నిర్మాణశిల్పిగా పేరుపొందాడు.తక్కువ ఖర్చుతో పేదల సొంతింటి కలను సాకా రం చేయడానికి ప్రణాళికలు రూపొందించడమేగాక, దేశవిదేశాల్లో అద్భుతమైన కట్టడాలకు రూపకల్పన చేసి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందారు.

ఆయన మొదటి ముఖ్య ప్రాజెక్టు అహ్మదాబాదు లోని సబర్మతి ఆశ్రమం వద్ద నిర్మించిన "మహాత్మాగాంధీ సంగ్రహాలయ" (మహాత్మాగాద్ంహీ మెమోరియల్)(1958–1963),[6] తరువాత ఆయన 1967లో భోపాల్ లో మధ్యప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీని రూపొందించారు.[7] ఆయన న్యూఢిల్లీలోని నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియంను రూపొందించారు.[6] తదుపరి భారత్ భవన్, బోస్టన్‌లో మిట్స్ బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్ సెంటర్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ భవనాలను అద్భుతంగా రూపొందించడంలో ఆయన ప్రధాన పాత్రవహించారు.

ఆయన 1970లో సముద్రం తీరం నుంచి ముంబయి వరకు కొత్తగా నిర్మించిన నవీ ముంబయి నగరానికి చీఫ్ ఆర్కిటెక్ట్ గా వ్యవహరించారు. విలాసవంతమైన భవనాలకే కాకుండా… గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ఇళ్ల నిర్మించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.1985 అప్పతి భారత ప్రధాని రాజీవ్‌గాంధీ ఆయనను జాతీయ పట్టణాభివృద్ది సంస్థకు మొదటి ఛైర్మన్ గా నియమించారు..[8].

Champalimaud Centre for The Unknown in Lisbon, Portugal (2007–2010).

1984లో ఆయన "అర్బన్ డిజైన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్" ను బొంబాయిలో ప్రారంభించారు. నాలుగుదశబ్దాలుగా ఆయన మూడవ ప్రపంచంలోని పట్టణ ప్రజలకు తక్కువ ఖర్చుతో గృహాలనిర్మాణం కొరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

2005 నుండి ఆయన ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ కు చర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

డిసెంబరు 18 2011 న లివరేషన్ ఆఫ్ గోవా ఉత్సవాల సందర్భంగా గోవాలోని అత్యున్నత పురస్కారమైన "గోమంత్ విభూషన్" అందుకున్నారు.[9] 2013లో రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రితిష్ ఆర్కిటెక్ట్స్ నివహించిన ఎగ్జిబిషన్ లో " చార్లెస్ కొరియా-భారతదేశ అత్యున్నత ఆర్కిటెక్ట్" అని ఆయన నూతన పట్టణాలను రూపొందించడంలో ప్రభావితం చేసిన భారతీయ ఆర్కిటెక్ట్ గా కొనియాడారు.[8][10]

చివరి ప్రాజెక్టులు[మార్చు]

LIC building, at Connaught Place, New Delhi, designed by Charles Correa, 1986

ఆయన కెనడా దేశంలోని టొరాంటో లో కొత్త ఇస్లామిక్ సెంటరు ప్రాజెక్టును నిర్వహించారు.[11] లిస్బన్ లోని ఛాంపలిమాడ్ సెంటర్ ప్రారంభోత్సవంలో అక్టోబరు 5 2010 న పోర్చుగీసు ప్రెసిడెంట్ చే ఆహ్వానింపబడ్డారు.[12][13]

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. An Architecture of Independence: The Making of Modern South Asia Archived 2009-06-03 at the Wayback Machine University of Pennsylvania.
  2. "Charles Correa". Encyclopædia Britannica. Retrieved 5 March 2014.
  3. Kazi Khaleed Ashraf, James Belluardo (1998), An Architecture of Independence: The Making of Modern South Asia, Architectural League of New York, p. 33, ISBN 09663-8560-8, ISBN 9780966385601
  4. "Charles Correa, Britannica".
  5. [1]
  6. 6.0 6.1 "Charles Correa – India's greatest architect?". BBC News. 13 May 2013. Archived from the original on 21 జూన్ 2013. Retrieved 2 July 2013.
  7. 7.0 7.1 "Vidhan Bhavan, (ArchNet)". Archived from the original on 2006-02-08. Retrieved 2015-07-18.
  8. 8.0 8.1 "Master class with Charles Correa". Mumbai Mirror. 9 June 2013. Retrieved 2 July 2013.
  9. "CharlesCorrea, Gomant Vibhushan". The Times of India. 19 December 2011. Archived from the original on 2012-07-01. Retrieved 2015-07-18.
  10. "Charles Correa & Out of India Season". RIBA. 2013. Archived from the original on 9 జూన్ 2013. Retrieved 2 July 2013.
  11. "Correa, Maki Tapped to Design Aga Khan Center". Architectural Record, The McGraw-Hill Companies. 6 October 2008. Retrieved 9 October 2008.
  12. [2][permanent dead link]
  13. "The Champalimaud Foundation – Arquitetura Lisboa". Archived from the original on 2013-11-13. Retrieved 2015-07-18.
  14. "List of medal winners 1848–2008(PDF)" (PDF). RIBA. Archived from the original (PDF) on 2014-02-02.
  15. "Padma Awards Directory (1954–2009)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 2013-05-10. Retrieved 2015-07-18.
  16. "Reply to a parliamentary question" (pdf) (in German). p. 1714. Retrieved 1 March 2013.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

ఇతర లింకులు[మార్చు]