Coordinates: 24°53′06″N 72°51′45″E / 24.885°N 72.8625°E / 24.885; 72.8625

సిరోహి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరోహి
హిరోహి
సిరోహి is located in Rajasthan
సిరోహి
సిరోహి
భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రం పటం
సిరోహి is located in India
సిరోహి
సిరోహి
సిరోహి (India)
Coordinates: 24°53′06″N 72°51′45″E / 24.885°N 72.8625°E / 24.885; 72.8625
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాసిరోహి
స్థాపించినదిసా.శ. 1450
Founded byరావు శోభాజీ, సెహస్త్రామల్
Government
 • Typeమునిసిపల్ కౌన్సిల్
 • Bodyసిరోహి నగరపాలక సంస్థ
Area
 • Total5,179 km2 (2,000 sq mi)
Elevation
321 మీ (1,053 అ.)
Population
 (2012)
 • Total8,51,107
 • Density164/km2 (420/sq mi)
Demonymసిరోహియన్
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
307001
ప్రాంతీయ ఫోన్‌కోడ్02972
Vehicle registrationRJ-24
సమీప నగరాలుఅహ్మదాబాద్, జలోర్, పాలీ, బార్మర్, ఉదయపూర్,
ఎండాకాలం సగటు ఉష్ణోగ్రత42 °C (108 °F)

సిరోహి, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నగరం. ఇది సిరోహి జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. ఇది గతంలో సిరోహి రాజ్‌పుత్ పాలకులు పాలించిన సిరోహి రాచరిక రాజధాని. 2014 సంవత్సరంలో "స్వచ్ఛ భారత్ అభియాన్" కింది రాజస్థాన్ లోని జిల్లాలలో ఈ నగరం మొదటి శ్రేణి గుర్తింపు పొందింది.

భౌగోళికం

[మార్చు]

సిరోహి 24°53′06″N 72°51′45″E / 24.885°N 72.8625°E / 24.885; 72.8625 వద్ద ఉంది.[1] ఇది 321 మీటర్లు (1053 అడుగులు) సగటు ఎత్తులోఉంది

చరిత్ర

[మార్చు]

రావు శోభాజీ సిరన్వా 1405లో, తూర్పుకొండ వాలుపై శివపురి పట్టణాన్ని స్థాపించాడు.శివపురి నేడు శిథిలావస్థలో ఉంది.[2] 1425 లో, శోభాజీ కుమారుడు, సెహస్త్రామల్ (లేదా సైన్స్మల్), అదే కొండ తూర్పు వాలుపై ఒక కోటను స్థాపించాడు.ఇది అతని రాజధానిగా మారింది. అదే ప్రస్తుత సిరోహి పట్టణంగా పెరిగింది.

స్వాతంత్ర్యం తరువాత కేంద్ర ప్రభుత్వం, సిరోహి అప్పటి రాష్ట్ర పాలకుడు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనితో సిరోహి రాష్ట్ర పరిపాలనను అప్పటి బాంబే ప్రభుత్వం 1949 జనవరి 5 నుండి 1950 జనవరి 25 వరకు పరిపాలించింది. బాంబే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి నిర్వాహకుడు ప్రేమా భాయ్ పటేల్.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం సిరోహి నగర జనాభా మొత్తం 39,229 మంది ఉన్నారు. అందులో 20,612 మంది పురుషులు కాగా, 18,617 మంది మహిళలు ఉన్నారు.

0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4485, ఇది సిరోహి (ఎం) మొత్తం జనాభాలో 11.43%గా ఉంది. స్త్రీల సెక్స్ నిష్పత్తి రాష్ట్ర సగటు 928 కు వ్యతిరేకంగా 903 గా ఉంది. అంతేకాక, రాజస్థాన్ రాష్ట్ర సగటు 888 తో పోలిస్తే సిరోహిలో బాలల లైంగిక నిష్పత్తి 831 గా ఉంది. సిరోహి నగర అక్షరాస్యత రాష్ట్ర సగటు 66.11% కంటే 79.21% ఎక్కువ. సిరోహిలో, పురుషుల అక్షరాస్యత 89.69% కాగా, మహిళా అక్షరాస్యత 67.73%గా ఉంది.

సిరోహి నగర పరిధిలో మొత్తం 8,335 ఇళ్లు ఉన్నాయి. వాటికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలన సంస్థ సమకూర్చింది.మునిసిపాలిటీ పరిధిలో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి అధికారం ఉంది.[3]

చదువు

[మార్చు]

సిరోహిలోని పాఠశాలలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నియంత్రణలో అనుబంధించబడ్డాయి. నగరంలోని ఉన్నత విద్యాసంస్థలలో ప్రభుత్వ పి.జి. కళాశాల, మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం చేత అనుబంధించబడిన కళాశాల. బాలికల కళాశాల మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం, ఉదయపూర్, ప్రైవేట్ కళాశాలలకు అనుబంధంగా ఉంది. సాంకేతిక విద్య కోసం ప్రభుత్వం పాలిటెక్నిక్, ప్రభుత్వం మహిళలు బి.ఎడ్ కళాశాల, ఐటిఐ కళాశాలలు ఉన్నాయి.

జాతీయ, రాష్ట్ర రహదారులు

[మార్చు]

సిరోహి భారతదేశ రహదారులకు బాగా అనుసంధానించబడి ఉంది. జాతీయ రహదారి 62 సిరోహిని నుండి, పిండ్వారా నుండి ఉత్తరం వరకు, రాజస్థాన్ లోని పాలీ జిల్లా వరకు కలుపుతుంది. అది బేవార్ వరకు కొనసాగుతుంది. జాతీయ రహదారి 168 సిరోహి గుండా రాష్ట్ర రహదారి 27 (ఢిల్లీ-కండ్లా) గుజరాత్ రాష్ట్రంలోని దీసా వద్ద ముగుస్తుంది. రాష్ట్ర రహదారి 38 సిరోహికి పశ్చిమాన, జాతీయ రహదారి 62 నుండి, జలోర్ ద్వారా జాతీయరహదారి 112 ను అనుసంధానిస్తుంది. ఇది బార్మర్ జిల్లాలోని బలోత్రా వద్ద ముగుస్తుంది. సిరోహికి తూర్పున ఉన్నజాతీయ రహదారి 10 రాజస్థాన్‌లోని ఉదయపూర్ వద్ద, జాతీయ రహదారి 8 కూడలి వైపు వెళుతుంది. జాతీయ రహదారి 10 రాజస్థాన్‌లోని బన్‌స్వార జిల్లా వరకు కొనసాగుతుంది.

ప్రస్తావనలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc - Sirohi
  2. Adams, Archibald (1899). A medico-topographical and general account of Marwar, Sirohi, and Jaisalmir. Junior Army and Navy Stores.
  3. "Sirohi Municipality City Population Census 2011-2021 | Rajasthan". www.census2011.co.in. Retrieved 2021-03-01.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సిరోహి&oldid=3950061" నుండి వెలికితీశారు