జల్ మహల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జల్ మహల్ (నీటి భవంతి అని అర్ధం) భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్ర  రాజధాని జైపూర్ నగరంలో గల మన్ సాగర్ సరస్సు లో ఉన్న భవంతి. ఈ భవంతినీ, దాని చుట్టూ ఉన్న సరస్సునీ 18వ శతాబ్దంలో అంబర్  మహారాజు జై సింగ్ II పునర్నిర్మించారు. పునర్నిర్మాణం తర్వాత  ఈ సరస్సు, భవంతీ చాలా మారిపోయాయి. బృందావన్ కు చెందిన  సంప్రదాయ పడవ తయారీదారులు రాజపుత్ శైలిలో చెక్క పడవలను తయారు చేశారు. ఆ పడవల్లో పర్యాటకులు భవంతి దగ్గరకు వెళ్తూ ఉంటారు. భవంతి మొదటి అంతస్తులో సంప్రదాయ వస్తువులతో  అలంకరించిన  హాలు, దారులు ఉన్నాయి. అవి దాటితే చమేలీ భాగ్ అనే  తోటకు చేరుకోవచ్చు. ఈ సరస్సులో ప్రయాణం చేసేటప్పుడు చుట్టూ ఎత్తైన కొండలు, ప్రాచీన కోటలు, దేవాలయాలు, మరోపక్క సందడిగా ఉండే జైపూర్ నగరాన్ని వీక్షించవచ్చు. ఈ సరస్సును పునర్నించినపుడు ఆ నీటిలోని చెడు పదార్ధాలను డ్రైన్ల ద్వారా బయటకు పోయే మార్గాన్ని  తయారు చేశారు. ఈ సరస్సులోని జలచరాలనూ, చుట్టూ ఉన్న  చెట్లనూ మార్చి వేరేవి వేశారు. పక్షులు ఆవాసాలు ఏర్పరుచుకునేందుకు చిన్న చిన్న ద్వీపాలను నిర్మించారు. మొత్తానికి ఈ సరస్సు,  భవంతిల పునర్నిర్మాణం తర్వాత పర్యాటకంగా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ జల్ మహల్.

రాత్రిపూట జల్ మహల్ సోయగం.
జల్ మహల్- జైపూర్ నగరంలోని మన్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న భవంతి.

భౌగోళిక విశేషాలు[మార్చు]

రాజస్థాన్ రాజధాని జైపూర్, అమెర్ నగరాల మధ్య ఉంది ఈ సరస్సు. ఆరావళీ పర్వత శ్రేణుల మధ్య 300 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ సరస్సును ఉత్తర, తూర్పు, పడమర దిక్కులలో పూర్తిగా ఆరావళీ పర్వతాలు కప్పబడి ఉన్నాయి. దక్షిణం వైపు మాత్రం పూర్తిగా నగరం ఉంటుంది. ఈ పర్వతాలలో నహర్ గఢ్ కోట ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మన్ సాగర్ లేక్, జల్ మహల్ లు, మరోవైపు నగరం కనపడుతూ ఉంటాయి. ఈ కోట నుంచి వీటిని చూడటానికి పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఈ సరస్సును నిర్మించేందుకు ఖిలగఢ్ కొండలు, నహర్ గఢ్ ల మధ్య దర్భవతీ నదిపై ఆనకట్ట నిర్మించారు. ఈ ఆనకట్టను 16వ శతబ్ధంలో కట్టారు. ఈ సరస్సు డ్రైనేజ్ ఏరియా 23.5 కిలోమీటర్లు. ప్రతీ ఏడాదీ దాదాపు 657.4 మిల్లీమీటర్ల వర్షం పడుతూ ఉంటుంది. ఈ నీరు రిజర్వాయర్ లో నిలిచి ఉంటుంది. డ్యాం చివరి భాగంలో నీటిపారుదల వ్యవస్థ ఉంది. నాహర్ గఢ్ కొండలు, జైపూర్, బ్రహ్మపురి, నగ్టలైల నుంచి పెద్ద ఎత్తున చెత్త పదార్ధాలతో కూడిన నీ రు ఇందులోకి కలుస్తోంది.[1][2][3][4]  ఈ సరస్సు ఈశాన్య దిక్కులో  ఆరావళీ పర్వతశ్రేణుల్లో ఉన్న కొండలో ఎన్నో ఖనిజాలున్నాయి. అదే  దిక్కులో కనక్ వృందావన్ లోయలో ఒక గుడి కూడా ఉంది.

చరిత్ర[మార్చు]

జల్ మహల్ సరస్సు వద్ద ఉన్న మన్ సాగర్ డ్యామ్

గతంలో ఈ ప్రదేశం దగ్గర నీరు పేరుకుపోవడంతో బురదగా మట్టి అణిగిపోయి గుంటలు గుంటలుగా ఉండేది. 1596లో ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు సంభవించింది. ఆ సమయంలో అమెర్ ప్రాంత చక్రవర్తి ఒక డ్యాం నిర్మించి నీటి కరవు తీర్చాలని భావించారు. అమెర్, అమగఢ్ పర్వతాల్లో దొరికే మట్టి, లోహాలను ఉపయోగించి ఈ డ్యాంను నిర్మించారు. 17వ శతాబ్దంలో దీనిని పూర్తిగా రాతితో పునర్నిర్మించారు. ఈ డ్యాం 300 మిటర్ల ఎత్తు, 28.5-34.5 మీటర్ల వెడల్పుతో ఉంది. మూడు గేట్లు గల ఈ డ్యాం నుంచి నీరు వ్యవసాయానికి మళ్ళిస్తారు. అప్పట్నుంచీ రాజస్థాన్ ప్రాంత రాజులు ఈ సరస్సు, డ్యాం, భవంతికి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం ఈ భవంతి, సరస్సుల పునర్నిర్మాణం, సుందరీకరణ చేసిన అమెర్ ప్రాంతపు 18వ శతాబ్దపు రాజు జై సింగ్ IIకు ఘనత ఇస్తుంటారు అందరు. ఆయన హయాంలోనే ఈ ప్రాంతంలో అమెర్ కోట, జైగఢ్ కోట, నహర్ గఢ్ కోట, ఖలింగఢ్ ఖోట, కనక్ వృందావన్ లోయ వంటి ఎన్నో చారిత్రక కట్టడాలు నిర్మించారు. ప్రస్తుతం ఈ కట్టడాలన్నీ జైపూర్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి.[4][5][6]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జల్_మహల్&oldid=2434983" నుండి వెలికితీశారు