నితిన్ గడ్కరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నితిన్ గడ్కరి
నితిన్ గడ్కరి


కేంద్ర మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 26, 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1957-05-27) 1957 మే 27 (వయసు 66)
నాగ్పూర్,
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కామ్చన్ గడ్కరి
సంతానం నిఖిల్, సారంగ్, కెట్కి
వృత్తి న్యాయవాది, పారిశ్రామికవేత్త
మతం హిందూమతము
వెబ్‌సైటు nitingadkari.in

నితిన్ గడ్కరి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.[1] మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా ముంబాయి-పూనా ఎక్స్‌ప్రెస్‌వే వలన మంచిపేరు సంపాదించారు.[2] 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

నితిన్ గడ్కరి ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబములో నాగ్పూర్ లో జన్మించారు. చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేశారు. క్రిందిస్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించారు.[3] మహారాష్ట్రలోనే M.Com, L.L.B., D.B.Mలను పూర్తిచేశారు.

కుటుంబం[మార్చు]

నితిన్ గడ్కరి భార్య కాంచన్. వారికి ముగ్గురు సంతానం, నిఖిల్, సారంగ్, కెట్కి. నితిన్ నాగ్పూర్ లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయం ప్రక్కనే నివాసముంటున్నారు.[4]

రాజకీయ జీవితం[మార్చు]

1995 నుండి 1999 వరకు మహరాష్ట్ర ప్రభుత్వంలో నితిన్ గడ్కరి ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయములోనే అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టి పేరు సంపాదించారు. తాను చేపట్టిన శాఖను పై నుండి క్రిందివరకు పూర్తిగా వ్యవస్థీకరించినారు.[5] 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.

మూలాలు[మార్చు]