హిందూ మున్నాని
హిందూ మున్నాని | |
---|---|
స్థాపకులు | రామగోపాలన్ |
స్థాపన తేదీ | 1980 |
రాజకీయ విధానం | హిందుత్వం భారతీయ జాతీయవాదం |
హిందూ మున్నాని అనేది హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఏర్పడిన తమిళనాడులోని ఒక సాంస్కృతిక సంస్థ. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుభంద సంస్థ.
చరిత్ర
[మార్చు]మీనాక్షిపురం మత మార్పిడుల నేపథ్యంలో రామగోపాలన్ 1980 లో హిందూ మున్నాని స్థాపించారు. ఇది హిందువుల హక్కుల కోసం పనిచేస్తూ, మత మార్పిడులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.[1] [2] [3][4][5]
లక్ష్యాలు
[మార్చు]హిందూ మున్నాని వెబ్‌సైట్ దాని లక్ష్యాలను ఈ క్రింది విధంగా నిర్ణయించుకొని ఉంది: [6]
1. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి స్వాధీనం చేసుకోవడం, వాటిని ప్రజా సంస్థ సంరక్షణకు అప్పగించడం.
2. కుటుంబ నియంత్రణను తప్పనిసరిగా అమలు చేయడానికి కృషి చేయడం.
3. మత మార్పిడి వ్యతిరేక చట్టం కోసం కృషి చేయడం.
4. గోవధ నిషేధం.
6. హిందూ హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడం.
సంస్థ చేపట్టిన చర్యలు
[మార్చు]దక్షిణ భారతదేశానికి చెందిన ఇషాతుల్ ఇస్లాం సభ చేపట్టిన మీనాక్షిపురం మతమార్పిడులను వ్యతిరేకిస్తూ 1982 లో రామనాథపురం జిల్లాలోని హిందూ జనాభాను సమీకరించడం ప్రారంభించి, హిందూ మున్నాని మొదటిసారిగా ప్రజలకు పరిచయం అయింది . అప్పటి నుండి, హిందూ మున్నాని తరచుగా హిందువులకు అండగా నిలుస్తుంది.
హిందూ మున్నాని తమిళనాడులో వినయక చతుర్థి ఉత్సవాలను నిర్వహిస్తుంది. 16 మే 2006 న, హిందూ మున్నాని వెల్లూరులోని జలకాంతేశ్వర ఆలయంలో శివలింగ స్థాపనకు సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించింది.[4][7] [8][9][10][11] [12]
ఇవికూడా చూడండి
[మార్చు]బాహ్య లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "About the Hindu Munnani". Official website of the Hindu Munnani. Retrieved 15 జూన్ 2008.
- ↑ K. Suryanarayana Rao, Pg 19
- ↑ FOC. "Hindu Munnani turns 25". Organiser. Archived from the original on 15 ఫిబ్రవరి 2006. Retrieved 15 జూన్ 2008.
- ↑ 4.0 4.1 P. G. Rajamohan. "Tamil Nadu: The Rise of Islamist Fundamentalism". Faultlines. Retrieved 16 జూన్ 2008.
- ↑ N. Sathiya Moorthy (22 మే 1998). "Hinduism and fundamentalism are contradiction in terms". Rediff. Retrieved 16 జూన్ 2008.
- ↑ "Objectives of the Hindu Munnani". Official website of the Hindu Munnani. Retrieved 15 జూన్ 2008.
- ↑ Katju, Manjari (2003). Vishva Hindu Parishad and Indian Politics. Orient Longman. p. 34. ISBN 978-81-250-2476-7.
- ↑ Hoskote, Ranjit (12 సెప్టెంబరు 2004). "From pedestal to pavement". The Hindu: Magazine. Retrieved 17 జూన్ 2008.[permanent dead link]
- ↑ C. J. Fuller (2001). "The 'Vinayaka Chaturthi' Festival and Hindutva in Tamil Nadu" (PDF). Economic and Political Weekly. 43 (24).[permanent dead link]
- ↑ Fuller, C. J. (2003). The Renewal of the Priesthood. Princeton University Press. p. 132. ISBN 978-0-691-11657-0.
- ↑ Fuller, C. J. (2004). The Camphor Flame: Popular Hinduism and Society in India. Princeton University Press. p. 265. ISBN 978-0-691-12048-5.
- ↑ Murthi, P. V. V. (10 మార్చి 2006). "Silver Jubilee". The Hindu. Archived from the original on 21 నవంబరు 2007. Retrieved 17 జూన్ 2008.