Jump to content

బజరంగ్ దళ్

వికీపీడియా నుండి

బజరంగ్ దళ్ అనే ది ఒక హిందూ ధార్మిక సంస్థ. విశ్వ హిందూ పరిషత్కు ఇది యువ విభాగం. దీన్ని 1984, అక్టోబర్ 1ఉత్తర ప్రదేశ్లో స్థాపించారు.[1][2][3][4] తరువాత ఇది దేశమంతటా విస్తరించింది. దీని నినాదం సేవ, సురక్ష, సంస్కృతి. గోవధను నిషేధించడం దీని ముఖ్యోద్దేశాలలో ఒకటి. అయోధ్యలో రామాలయం నిర్మించడం, మధురలో క్రష్ణ దేవాలయాన్ని నిర్మించడం, వారణాసిలో కాశీ విశ్వనాథునికి దేవాలయం నిర్మించడం వీరి లక్ష్యాలలో ముఖ్యమైనవి. ఈ మూడు ప్రదేశాలు ధర్మ పరంగా సున్నితమైనవి. ఇంకా హిందూ ధర్మం నుంచి ఇతర మతాలలోకి జరిగే మతమార్పులను అరికట్టడం కూడా వీరి ఉద్దేశాలలో ఒక భాగమే.

పుట్టుక

[మార్చు]
Bajrang Dal members protesting at St. Aloysius College, Mangaluru
నిరసన ప్రదర్శిస్తున్న బజరంగ్ దళ్ సభ్యులు

1984 లో విశ్వహిందూ పరిషత్ నేతలు కొంతమంది రామ్-జానకీ రథయాత్ర పేరుతో ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో తరచుగా ఊరేగింపులు నిర్వహించేవారు. దీని ద్వారా వారు సాధించదలచిన లక్ష్యం హిందూ జన జాగృతి. అయితే విశ్వ హిందు పరిషత్ నేతలు దీన్ని ఇతర మతాలకు వ్యతిరేకం కాదని ప్రకటించినప్పటికీ చాలా మంది దీన్ని హిందూ అతివాదంగా భావించడంతో ఆ ప్రదేశంలో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకోవడం ప్రారంభించాయి. ఊరేగింపునకు అడ్డంకులు ఎదురు కాసాగాయి. దీంతో కలత చెందిన కొంతమంది విశ్వ హిందు పరిషత్ నేతలు హిందూ యువతను ఈ ఊరేగింపులకు రక్షణగా నిలబడమన్నారు. అలా ఏర్పడ్డదే, బజరంగ్ దళ్ సంస్థ.

మూలాలు

[మార్చు]
  1. ""Bajrang Dal: The militant face of the saffron family?"". The Times of India. Retrieved 2008-09-30.
  2. ""Militant Hindu Valentine threat"". BBC. Retrieved 2001-02-12.
  3. Chetan Bhatt (2001). Hindu Nationalism: Origins, Ideologies and Modern Myths. Berg Publishers. p. 199. ISBN 9781859733486.
  4. Cracking down on ‘violations of moral code’ in Dakshina Kannada Archived 2009-02-17 at the Wayback Machine The Hindu