అఖండ భారత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాకిస్తాన్‌, ఇండియా, బంగ్లాదేశ్ లను కలిపి అఖండ భారత్ అంటారు.అంటే 1947 ఆగస్టు15 కు ముందున్న భారతదేశం.బ్రిటీష్ వాళ్ళు హిందూ ముస్లిములు కలిసి ఉన్న ఈ విశాల దేశాన్ని పాలించి, రెండు దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి పోయారు. విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్, దుర్గావాహిని మొదలైన సంస్తలు నేటికీ అఖండ భారత్ సాధించాలని కృషిచేస్తున్నాయి.[1]. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన సరస్వతి పీఠం పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాదుకు 150 కి.మీ. దూరంలో ఉన్నదని, అలాగే వేదాలు పుట్టిన సింధూ నదీప్రాంత పవిత్రభూమి కూడా పాకిస్థాన్ లోనే ఉందని చెబుతారు.

వివాదాలు[మార్చు]

పాకిస్తాన్‌ వ్యవ స్థాపకుడు జిన్నా, కాలానుగ తంగా భిన్నవ్యక్తిత్వాలను ప్రదర్శించారని ఆరెస్సెస్‌ మాజీ చీఫ్‌ కె.ఎస్‌ సుదర్శన్‌ అన్నారు. ఒక దశలో ఆయన లోక్‌మాన్య తిలక్‌తో కలసి అఖండ భారతావనికి కట్టుబడి పనిచేశారని సుదర్శన్‌ పేర్కొన్నారు. గాంధీ గనుక విభజన కూడదంటూ పట్టుబట్టి ఉంటే, విభజన జరిగి ఉండేదే కాదని’ అన్నారు. "ముస్లింలీగ్‌ నేత జిన్నా లౌకిక వాదేనా?" అన్న ప్రశ్నకు అవునని సుదర్శన్‌ సమాధాన మిచ్చారు. టర్కీలో ఖలీఫా పదవీభ్రష్ఠుడైతే దాంతో భారత్‌కు ఏం సంబంధమని కూడా జిన్నా ప్రశ్నించి నట్లు ఈ సందర్భంగా సుదర్శన్‌ గుర్తు చేశారు. జశ్వంత్‌సింగ్‌ బహిష్కరణపై వ్యాఖ్యానిస్తూ, ‘అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని’ సుదర్శన్‌ వ్యాఖ్యా నించారు. పాకిస్తాన్‌ పర్యటన సందర్భంగా జిన్నాను ప్రశంసించిన అద్వానీ ఆ తరువాత ఆ వ్యాఖ్యలపై వివరణను ఇచ్చారన్నారు.[2] దేశ విభజనకు జిన్నా బాధ్యుడు కారని, ఆయన అఖండ భారత్‌ను కోరుకున్నారని జశ్వంత్‌సింగ్‌ అన్నారు. దేశ విభజన అంశంపై పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి నాయకులను 'కించపరిచి, పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ అలీ జిన్నాను కీర్తించవద్దని ప్రణబ్‌ముఖర్జీ కోరారు. దేశ విభజనలో హిందూ మహాసభ నాయకుడు, తర్వాత జనసంఘ్‌, బిజెపిల ఆవిర్బావానికి మూలకారకుడైన శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ, జిన్నాకు ఎలాంటి పాత్ర లేదని చెప్పడానికి జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఆయన ధ్వజమెత్తారు.[3]

మూలాలు[మార్చు]