భగవధ్వజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భగవధ్వజం

కాషాయ రంగులో ఉన్న భగవధ్వజం (మరాఠీ: भगवा ध्वज), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధికారిక చిహ్నం. సంఘ స్వయం సేవకులు ఈ ధ్వజాన్నే గురువుగా ఆరాధిస్తారు. ప్రతిరోజు నిర్వహించే ఒకగంట సంఘ శాఖలో ఈ ధ్వజాన్ని ఎగురవేసి రకరకాల శారీరక, ఆధ్యాత్మిక, దేశభక్తి సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ధ్వజ వితరణ చేసి దాచిపెడతారు.[1]

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన సంఘ కార్యక్రమంలో భగవధ్వజం

చరిత్ర[మార్చు]

మధ్యయుగ కాలంలో, భారతదేశంలో ఇస్లామిక్ పాలన క్షీణించి, మరాఠా సామ్రాజ్యం ఆవిర్భావం తర్వాత హిందూ జాతీయవాదం పెరిగింది, ఆ సమయంలో శివాజీ కాషాయ జెండాను స్వీకరించారు. ఈ ధ్వజం ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్య జెండాగా ఉపయోగించాడు. 1915లో సావర్కర్ ఈ ధ్వజాన్ని అఖిల భారత హిందూ మహాసభ అధికారిక చిహ్నంగా వాడాడు. తరువాత 1925 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడినప్పటి నుండి సంఘ అధికారిక చిహ్నంగా వాడబడుతుంది. ఎటువంటి గుర్తులు, బొమ్మలు లేనటువంటి కాషాయ రంగు జెండానే సంఘం తన గురువుగా స్వీకరించింది. ఆరెస్సెస్ దీనిని విజయం, బలానికి చిహ్నంగా భావిస్తుంది.[2][3]

ఇతర ధ్వజాలు[మార్చు]

ఓంకారం, స్వస్తిక్ మొదలైన గుర్తులు ఉన్న కాషాయ భగ్వధ్వజాలను హిందువులు దేవాలయాలపై, తమ ఇళ్ళపై కూడా ఎగురవేసుకుంటారు.

ఆకారం, కొలతలు[మార్చు]

భగవధ్వజం కొలతలు తెలిపే చిత్రపటం

కాషాయ రంగులో ఉన్న ఈ భగ్వధ్వజం దీర్ఘచతురస్రాకారంలో ఉండి, మధ్యన చీలిక కలిగి ఉంటుంది. ధ్వజం కింది భాగం 94 సె.మీ.లు, ఎత్తు, పై భాగం 75 సె.మీ. లతో నిర్మించబడి ఉంటుంది.ఇలా నిర్దిష్ట కొలతలతో తయారుచేసిన భగ్వధ్వజాన్ని, 90సెం.మీ.ల వ్యాసార్థంతో గీసిన ధ్వజ మండలంలో ఉన్న రెండున్నర మీటర్ల పొడవు గల ధ్వజ స్తంభానికి సంఘ శాఖలో ఎగరవేస్తారు.[4][5]

మూలాలు[మార్చు]

  1. Gupta, Manju (2004). Hindu devī devatā (in Hindi). Star Publications. ISBN 978-81-7650-100-2.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. "RSS explains importance of saffron flag". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2021-05-20.
  3. जोशी 'शतायु', अनिरुद्ध. "हिन्दू धर्म में भगवा रंग ही क्यों, जानिए रहस्य.. | Hindu flag". hindi.webdunia.com (in హిందీ). Retrieved 2021-05-20.
  4. Lord Egerton of Tatton (18 January 2013) [1880]. Indian and Oriental Arms and Armour. Courier Dover Publications. pp. 171–. ISBN 978-0-486-14713-0.
  5. Anand, Arun (19 July 2021). "Why the saffron flag is revered as 'guru' & worshipped by RSS swayamsevaks". The Print.
"https://te.wikipedia.org/w/index.php?title=భగవధ్వజం&oldid=3713605" నుండి వెలికితీశారు