స్వస్తిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వస్తిక్
బాలుడి తలపై గంధలేపనంతో స్వస్తిక్ గుర్తు

శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది. స్వస్తిక్‌ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉంది. విఘ్నహర్త అయిన గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుకనూ, దీన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ స్వస్తిక్‌ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు. అందుచేత అది పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట. దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలనిట. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు. ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన.

“చోడకర్మ సంస్కారము” అంటే ఓ సంవత్సర కాలం తరువాత శిశువుకు తలనీలాలు తీయడం జరుగుతుంది. ఆరవ నెల అన్నప్రాసమైన అనేక రోజులకు ఈ తలవెండ్రుకలు తీసే కార్యాన్ని చేస్తారు.

వెండ్రుకలు తీసిన అనంతరం వెన్న లేక చిలికిన పెరుగును శిశువు సున్నితమైన గుండుపై రాయడం జరుగుతుంది. ఆ తరువాత శిశువు తండ్రి శిశువు తలపై గంధలేపనంతో స్వస్తిక్ గుర్తుని రాసి నుదిటిపైన బొట్టు పెడుతాడు. స్వస్తిక్ గుర్తు “భగవంతుడి తలంపే శిశువు తలంపవుగాక” అనే అర్థాన్ని ఇక్కడి స్ఫురింపజేస్తుంది. కాసేపు తరువాత స్వస్తిక్ గుర్తున్న గుండుపై అంతటా గంధలేపనాన్ని రాయడం జరుగుతుంది. ఈ కార్యాన్ని చోడకర్మ సంస్కారం అని అంటారు.

గంధంలో ఔషదీయ గుణాలు ఉంటాయి. గంధలేపనం మెదడును చల్లబరచడమే కాక బుద్ధిని వికసింపజేస్తుంది. తల్లిదండ్రులు, ఈ కార్యానికి వచ్చిన వారు శిశువును దీవించి, దీర్ఘాయువును ప్రసాదించుమని భగవంతుడిని ప్రార్థిస్తారు.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
General
Dharmic religions