సింధూరం
Jump to navigation
Jump to search
సింధూరం (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణ వంశీ |
---|---|
తారాగణం | బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి |
సంగీతం | శ్రీ |
నిర్మాణ సంస్థ | ఆంధ్రా టాకీస్ |
భాష | తెలుగు |
సింధూరం 1997 లో కృష్ణవంశీ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో వచ్చిన చిత్రం. ఇందులో రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి ముఖ్యపాత్రలు పోషించారు.
తారాగణం
[మార్చు]- చంటి గా రవితేజ
- బుల్లిరాజు గా బ్రహ్మాజీ
- బేబీ గా సంఘవి
- గోపాల్ రెడ్డి గా నరసింహ రాజు
- భానుచందర్
- చలపతి రావు
- బైరాగి గా పరుచూరి వెంకటేశ్వరరావు
- పృథ్వీ రాజ్
- శివాజీ రాజా
- సూర్య
- అన్నపూర్ణ
- రాజబాబు
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందించాడు.[1]
- అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా - రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- ఏడు మల్లెలెత్తు సుకుమారికి - రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి;గానం : కృష్ణంరాజు, ప్రదీప్, మాధవపెద్ది సత్యం
- హై రే హై - రచన: చంద్రబోస్; గానం : శ్రీ
- ఓ చెలీ అనార్కలి - రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి; గానం : సురేష్ పీటర్స్
- ఓ లేలె - రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి; గానం : మలేసియా వాసుదేవన్, మోహన్ దాస్, శ్రీనివాస్ చక్రవర్తి
- ఊరికే ఉండదే -రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం : కె. ఎస్. చిత్ర
అవార్డులు
[మార్చు]- ఈ చిత్రంలోని అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా (పాట) కి ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి నంది పురస్కారం లభించింది.[2]
- ఉత్తమ ద్వితీయ చిత్రంగా రజిత నంది అవార్డు కు ఎంపిక.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 September 2015). "సంగీత దర్శకుడి శ్రీ జయంతి". andhrajyothy.com. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
- ↑ హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (24 November 2018). "ప్రజాస్వామ్య పండుగ, కొన్ని ప్రశ్నల పండగా..వచ్చిన పాట". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.