సంఘవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంఘవి
జన్మ నామంకావ్య రమేష్
జననం (1977-10-04) అక్టోబరు 4, 1977 (వయస్సు 43)
భారతదేశం మైసూరు, భారతదేశం
ఇతర పేర్లు సంఘవి
క్రియాశీలక సంవత్సరాలు 1993-ప్రస్తుతం
భార్య/భర్త సురేష్ వర్మ
వెబ్‌సైటు www.sangavi.com

సంఘవి, కన్నడ, తెలుగు సినిమా నటి. 95కు పైగా సినిమాలలో నటించిన సంఘవి తెలుగులో 45 సినిమాలు, కన్నడంలో ఒక అరడజను సినిమాలు. తక్కినవి తమిళ సినిమాలలో నటించింది.

జీవిత విశేషాలు[మార్చు]

సంఘవి, కావ్య రమేష్‌గా కర్ణాటకలోని మైసూరులో 1977 అక్టోబరు 4న పుట్టింది. ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చెవి, ముక్కు, గొంతు విభాగానికి అధిపతి. ఈమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో సాగింది. సంఘవి యుక్త వయసునుండే మోడలింగ్ చేయటం ప్రారంభించింది. చిన్నపట్టి నుండే సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది. ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి, సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు. ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది. అప్పుడే సినిమాలలో నటించాలన్న అభిరుచికి బీజం పడింది.[1] ఈమె అజిత్ సరసన నటించిన తమిళ సినిమా అమరావతితో ప్రసిద్ధి చెందినది. సంఘవికి సిందూరం సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే నంది అవార్డు అందుకున్నది

సంఘవి తెలుగు సినిమా దర్శకుడు సురేష్ వర్మను శివయ్య సినిమా నిర్మాణ సమయములో ప్రేమించి పెళ్ళి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరమైనది. ఆ తర్వాత సినీరంగంలో పునఃప్రవేశించి ఆనై అనే తమిళ చిత్రంలో తల్లి పాత్ర పోషించింది.[2] అదే కాక "గోకులత్తిల్ సీత" అనే టీవీ సీరియల్ తో బుల్లితెరపై కూడా అడుగుపెట్టింది.

సంఘవి నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.hindu.com/2006/12/07/stories/2006120716510200.htm
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-01-27. Retrieved 2009-07-19.
  3. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020. CS1 maint: discouraged parameter (link)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సంఘవి&oldid=3009245" నుండి వెలికితీశారు