నరసింహ రాజు
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నరసింహ రాజు | |
---|---|
జననం | వేటుకూరి నరసింహరాజు 1951 డిసెంబరు 26 |
విద్య | పీయూసీ |
వృత్తి | నటుడు |
పిల్లలు | జగదాంబ (కూతురు) |
నరసింహ రాజు ఒక ప్రముఖ తెలుగు నటుడు.[1] 1970 వ దశకంలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. 1978 లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని అనే సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆంధ్రా కమల్ హాసన్గా పేరు పొందాడు.[1] సుమారు 110 చిత్రాల్లో నటించాడు. అందులో 90 సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించాడు.[2] పలు టీవీ ధారావాహికల్లో కూడా నటించాడు.[3]
జీవిత విశేషాలు
[మార్చు]నరసింహ రాజు 1951 డిసెంబరు 26 న పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, వడ్లూరు గ్రామంలో జన్మించాడు. అప్పట్లో ఆయన తండ్రి గారిది కలిగిన కుటుంబమే. కానీ దానగుణంతో చాలావరకు ఆస్తులు పోగుట్టుకున్నది ఆ కుటుంబం. చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి కలిగింది. పీయూసీ అయిన తర్వాత ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయాడు. మళ్లీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి చెన్నైకి తిరిగి వచ్చి అవకాశాలు దొరకబుచ్చుకున్నాడు.[2]
ఈయనకు ఒక కూతురు జగదాంబ. ఒక కొడుకు. కూతురు మానవ వనరుల విభాగంలో పనిచేస్తుంది. కొడుకు కెనడాలో బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్లో మేనేజరుగా పనిచేస్తున్నాడు.
సినిమా కెరీర్
[మార్చు]నరసింహ రాజు 1974 లో విడుదలైన నీడలేని ఆడది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో కథానాయికగా నటించిన ప్రభకు కూడా అది మొదటి సినిమానే. ఇది వందరోజులు ఆడి మంచి విజయం సాధించింది. కానీ ఒక ఏడాది పాటూ అవకాశాలు రాలేదు. మళ్లీ అదే నిర్మాతలే అమ్మాయిలూ జాగ్రత్త అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ ఈ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత దాసరి నారాయణ రావు తూర్పు పడమర సినిమాలో అవకాశం ఇచ్చాడు. మరి కొన్ని సినిమాలలో అవకాశం వచ్చింది. 1970 వ దశకం రెండో అర్ధ భాగంలో సుమారు 20 సినిమాల్లో నటించాడు. 1978లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని చిత్రం మంచి విజయం సాధించింది. దీనికి ముందుగానే కొన్ని సినిమాల్లో నటించిన ఉన్న నరసింహరాజు విఠలాచార్య దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా చిత్రీకరణకు వెళ్ళి అవకాశం కోసం అడగగా ఆయన జగన్మోహిని చిత్రంలో అవకాశం ఇస్తానని చెప్పాడు. కథానాయకుడి ఎంపికకు చాలా మందిని అనుకున్నా చివరకు ఈయనకు ఆ అవకాశం దక్కింది. 1993 నుంచి చిత్ర రంగానికి దూరమై టీవీ సీరియళ్ళపై మొగ్గు చూపించాడు.[2] ఎండమావులు, పంజరం, సుందరకాండ మొదలైనవి ఆయన నటించిన కొన్ని సీరియళ్ళు.

సినిమాల జాబితా
[మార్చు]- అంతులేని వింతకథ
- అత్తవారిల్లు
- అనుకున్నది సాధిస్తా
- అమ్మాయిలూ జాగ్రత్త
- అయ్యప్ప దీక్ష
- ఇదెక్కడి న్యాయం
- కన్యా కుమారి
- కలియుగ మహాభారతం
- గాంధర్వ కన్య
- జగన్మోహిని
- జయసుధ
- తూర్పు పడమర
- తెగింపు (2005)
- త్రిలోక సుందరి
- నీడలేని ఆడది
- పునాదిరాళ్ళు
- పున్నమినాగు
- ప్రయాణంలో పదనిసలు
- రంభ ఊర్వశి మేనక
- వెంకటేశ్వర వ్రత మహత్యం
- లక్ష్మీ పూజ
- శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం
- సర్దార్ పాపన్న
- పాఠశాల (2014)
- అనుకోని ప్రయాణం (2022)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "తెలుగు సినీ నటుడు నరసింహ రాజు". nettv4u.com. Archived from the original on 27 July 2017. Retrieved 17 September 2016.
- ↑ 2.0 2.1 2.2 "వెండితెర కన్నా బుల్లితెర మిన్న". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 23 September 2016.
- ↑ "ఆ హీరోలిద్దరూ నాకు ఎలాంటి ద్రోహం చేయలేదు!". eenadu.net. ఈనాడు. 10 April 2018. Archived from the original on 10 April 2018. Retrieved 10 April 2018.