Jump to content

తూర్పు పడమర

వికీపీడియా నుండి
తూర్పు పడమర
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం నరసింహరాజు ,
మాధవి,
శ్రీవిద్య
సురేఖ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ శ్రీ రమణ చిత్ర
భాష తెలుగు

బాలచందర్ తమిళ్ హిట్ చిత్రం అపూర్వ రాగంగళ్ (కమల్ హాసన్, రజనీకాంత్, జయసుధ) ఆధారంగా దాసరి దర్శకత్వంలో తయరైంది. సత్యనారాయణ, నరసింహరాజు, శ్రీవిద్య, మాధవి నటించారు. బేతాళకథల్లో జవాబులేని అఖరి ప్రశ్న వంటి కథ. బాలచందర్ అనేక మిగతా చిత్రాల్లాగే ఒక పజిల్ లా చిత్రంఉంటుంది. రమేష్ నాయుడు సంగీతం సినారె సాహిత్యంతో శివరంజనీ, తూర్పు పడమర ఎదురెదురూ, నవ్వుతారూ విరగబడి నవ్వుతారు వంటి పాటలు ఈ చిత్రంలో ఉన్నాయి.

తారాగణం

[మార్చు]
  • నరసింహరాజు_ సూర్యం
  • శ్రీవిద్య_ శివరంజని
  • మాధవి_ కళ్యాణి
  • కైకాల సత్యనారాయణ_ సూర్యం తండ్రి
  • మంచు మోహన్ బాబు_ శివరంజని మొదటి భర్త
  • నగేష్_ శివరంజని ఫ్యామిలీ డాక్టర్
  • సి.నారాయణ రెడ్డి_
  • మాగంటి మురళీ మోహన్_

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: దాసరి నారాయణరావు
  • చిత్రానువాదం: దాసరి నారాయణరావు
  • కథ: కె.బాలచందర్
  • సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
  • మాటలు: దాసరి నారాయణరావు
  • పాటలు: సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • నేపథ్య గాయకులు: కోవెల శాంత, వాణిజయరాం, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
  • ఛాయా గ్రహణం: కె.ఎస్.మణి
  • ఎడిటింగ్: కె.బాలు
  • నిర్మాత: కె.రాఘవ
  • నిర్మాణ సంస్థ: ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
  • విడుదల: 23:10:1976.

పాటలు

[మార్చు]
పాట రచయిత గాయనీ గాయకులు
తూర్పూ పడమర ఎదురెదురూ నింగీ నేలా ఎదురెదురూ సి నారాయణ రెడ్డి పి సుశీల, కోవెల శాంత
శివరంజనీ సి. నారాయణ రెడ్డి బాలు
స్వరములు ఏడైనా రాగాలెన్నో సి.నారాయణరెడ్డి పి.సుశీల
  • జతి స్వరం, రచన; సి నారాయణ రెడ్డి గానం.వాణి జయరామ్
  • నవ్వుతారు, రచన: సి నారాయణ రెడ్డి, గానం. శ్రీ. పండితా రాద్యుల బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007