పునాదిరాళ్ళు
Jump to navigation
Jump to search
పునాదిరాళ్ళు (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గూడపాటి రాజ్‌కుమార్ |
---|---|
తారాగణం | రోజారమణి, నరసింహరాజు |
సంగీతం | ప్రేమ్‌జీ |
నిర్మాణ సంస్థ | ధర్మవిజయ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పునాదిరాళ్ళు 1979లో గూడపాటి రాజ్‌కుమార్ దర్శకత్వంఓ విడుదలైన తెలుగు చలనచిత్రం. 5 నంది అవార్డులు అందుకున్న ఈ చిత్రం చిరంజీవి తొలిచిత్రం.
కథ
[మార్చు]ఒక పల్లెటూర్లో ఆ వూరి సర్పంచి రఘురామయ్య, కరణం, పటేలు, వెంకటయ్య అనే షావుకారు ఈ దుష్టచతుష్టయం గ్రామ ప్రజలను పీల్చుకుని తింటుంటారు. వారు చేసే అత్యాచారాలకు కొదువలేదు. శాంతి అనే యువతి వారి పశుత్వానికి బలవుతుంది. స్కూలు మాస్టరైన ఆ యువతి తండ్రి కూడా వారి అఘాయిత్యానికి గురవుతాడు. శాంతి పిచ్చిదానిలా నటిస్తూ, ఆ వూర్లోనే తిరుగుతూ వుంటుంది. పట్టణంలో చదువుకుని ఇంటికి వచ్చిన రఘురామయ్య కొడుకు రవికి కొద్ది రోజుల్లోనే వూళ్ళో జరిగే భాగోతం అంతా అర్థమౌతుంది. తన మిత్రులందరినీ తోడు తెచ్చుకుని నర్సుగా ఆ వూరికి వచ్చిన రాధ సహాయంతో దుర్మార్గపు ముఠాపై తిరగబడతాడు[1].
నటీనటులు
[మార్చు]పాటల జాబితా
[మార్చు]- భారతదేశపు భావిపౌరులం ,
- చిరు చిరు నవ్వుల
- యాతవేసి పోసినా ఏరు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: గూడపాటి రాజ్‌కుమార్
- సంగీతం: ప్రేమ్‌జీ
- ఛాయాగ్రహణం:సి.ఎస్.నివాస్
- నిర్మాత: ఎస్.ఫజలుల్లా హక్
మూలాలు
[మార్చు]- ↑ పి.ఎస్. (25 June 1979). "చిత్ర సమీక్ష - పునాదిరాళ్ళు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 84. Retrieved 25 December 2017.[permanent dead link]