Jump to content

గూడపాటి రాజ్‌కుమార్

వికీపీడియా నుండి
(గూడపాటి రాజ్‌కుమార్‌ నుండి దారిమార్పు చెందింది)
గూడపాటి రాజ్‌కుమార్
గూడపాటి రాజ్‌కుమార్
జననంగూడపాటి రాజ్‌కుమార్
(1941-08-28)1941 ఆగస్టు 28
ఉయ్యూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
మరణం2020 ఫిబ్రవరి 14(2020-02-14) (వయసు 78)
హైదరాబాద్
ప్రసిద్ధిచలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత, పాటల రచయిత

గూడపాటి రాజ్‌కుమార్‌ తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. ఈయన దర్శతక్వం వహించిన తొలిచిత్రం పునాదిరాళ్ళుకు 5 నంది అవార్డులు వచ్చాయి. గీత రచయితగా, కథా రచయితగా కూడా పనిచేశాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, ఉయ్యూరు ఈయన స్వస్థలం. విజయవాడలో డిగ్రీ పూర్తిచేసిన రాజ్‌కుమార్‌ 1966లో హైదరాబాదుకు వచ్చాడు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో శిక్షణ తీసుకొని రెండేళ్లపాటు నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ స్కూల్‌లో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.

సినిమారంగం

[మార్చు]

డిగ్రీ చదివే సమయంలో నాటకాలు వేయడం, పాటలు పాడడం చేసేవాడు. పాతబస్తీ జహనుమాలోనా సదరన్‌ మూవీస్‌ స్టూడియో వాళ్ళకి సినిమాలపై తనకున్న ఆసక్తిని తెలుపగా వాళ్ళు సతీ అనసూయ, రహస్యం సినిమాలకు సహాయ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఆ స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న మరాఠీ, హిందీ సినిమాలకు కూడా సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది.

తన జీవిత అనుభవంతో 1977లో పునాదిరాళ్ళు కథ రాసుకొని, 1978లో సినిమా నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆస్తులు, పొలాలు అమ్మగా వచ్చిన డబ్బుతో మద్రాసుకు వచ్చాడు. ఫిలిం ఇన్సిట్యూట్ లో శిక్షణ పొందిన చిరంజీవి, సుధాకర్‌, నరసింహరాజు సినిమారంగానికి పరిచయంచేస్తూ తీసిన ఈ సినిమా ఎలాంటి అవంతరాలు లేకుండా పూర్తవడంతోపాటు, చిత్ర ట్రైలర్ చూసి ఇతర దర్శకులు అభినందించారు. కానీ చిత్ర విడుదలకు రాజ్‌కుమార్‌ అనేక ఇబ్బందులు ఎదుర్కున్నాడు. అన్నింటిని అధిగమించి విడుదల చేయగా చిత్రానికి 5 నంది అవార్డులు వచ్చాయి.[2]

దర్శకత్వం చేసినవి

[మార్చు]
  1. పునాదిరాళ్ళు
  2. ఈ సమాజం మాకొద్దు
  3. మన ఊరి గాంధీ
  4. మా సిరిమల్లి
  5. ఇంకా తెలవారదేమి
  6. తాండవకృష్ణ తారంగం

ఇతర వివరాలు

[మార్చు]
  1. ఎదిగొచ్చిన కొడుకు అనారోగ్యంతో మరణించిన కొద్దిరోజులకే భార్యకూడా చనిపోయింది.
  2. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్‌కుమార్‌ కు సినిరాంగానికి చెందిన దర్శకులు, నిర్మాతలు, నటులు ఆర్థిక సహాయం అందించారు.[3]

మరణం

[మార్చు]

ఇతడు 2020, ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం రాత్రి సికిందరాబాదు లాలాగూడలోని తన రెండవ కుమారుని ఇంటిలో మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, సినిమా (21 November 2019). "రాజ్‌కుమార్‌కు సినీ ప్రముఖుల చేయూత". Sakshi. Archived from the original on 21 నవంబరు 2019. Retrieved 21 November 2019.
  2. సాక్షి, తెలంగాణ (15 November 2019). "'పునాదిరాళ్ల'కు పుట్టెడు కష్టం". Sakshi. Archived from the original on 15 నవంబరు 2019. Retrieved 21 November 2019.
  3. నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (21 November 2019). "పునాది రాళ్ళు చిత్ర ద‌ర్శ‌కుడికి ఆర్ధిక సాయం". www.ntnews.com. Archived from the original on 21 నవంబరు 2019. Retrieved 21 November 2019.
  4. న్యూస్ టుడే, లాలాగూడ (16 February 2020). "పునాదిరాళ్ళు దర్శకుడు రాజ్‌కుమార్ కన్నుమూత". ఈనాడు దినపత్రిక. Archived from the original on 16 February 2020. Retrieved 16 February 2020.

ఇతర లంకెలు

[మార్చు]