ఉయ్యూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఉయ్యూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ఉయ్యూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 43,269
 - పురుషులు 22,116
 - స్త్రీలు 21,153
 - గృహాల సంఖ్య 10,323
పిన్ కోడ్ 521 165
ఎస్.టి.డి కోడ్ 08676
ఉయ్యూరు
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో ఉయ్యూరు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో ఉయ్యూరు మండలం యొక్క స్థానము
ఉయ్యూరు is located in Andhra Pradesh
ఉయ్యూరు
ఆంధ్రప్రదేశ్ పటములో ఉయ్యూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°22′0″N 80°51′0″E / 16.36667°N 80.85000°E / 16.36667; 80.85000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము వుయ్యూరు
గ్రామాలు 9
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 73,767
 - పురుషులు 37,295
 - స్త్రీలు 36,472
అక్షరాస్యత (2001)
 - మొత్తం 75.12%
 - పురుషులు 79.45%
 - స్త్రీలు 70.70%
పిన్ కోడ్ 521165

ఉయ్యూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం.521 165., యస్.టీ.డీ.కోడ్ = 08676.

ప్రసిద్ది చెందిన కే.సి.పి. చక్కెర కర్మాగారము ఇచటనే గలదు. మేజరు పంచాయతీగా ఉయ్యూరును ఎంతోకాలముగా మున్సిపాలీటీగా మార్చాలని చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వము నుండి 2011 సం.న ఆమోదము లభించినది. ఉయ్యూరులో పురుషుల కంటే స్త్రీ జనాభా అధికము. 2011 సం.నకు మొత్తము జనాభా షుమారు 40,650. మొత్తము వార్డులు పది. వార్షిక ఆదాయము షుమారు 2 కోట్లు. ఎమ్.పీ.టీ.సీ స్థానాలు మొత్తము పది ఉన్నాయి.

విశేషాలు[మార్చు]

 1. శ్రీ అన్నే బాబూరావుగారు 1980-85 లో ఈ గ్రామ పంచాయతీ సర్పంచిగా పని చేశారు. ఆ తరువాత ఉయ్యూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీచేసి 1985,1994, 1999లలో మూడుసార్లు గెలుపొందారు. గ్రామీణప్రాంతాలలో మంచిపట్టు, అభిమానం ఉన్న ఆయన శాసనసభ్యునిగా ఉంటూనే 2001 లో నిర్యాణం చెందారు.[1]
 2. శ్రీ వై.వీ.బీ.రాజేంద్రప్రసాద్ గారు 1995-2001 లో ఉయ్యూరు గ్రామ సర్పంచిగా, 2001-06 లో జడ్.పీ.టీ.సీ. సభ్యునిగా పనిచేశారు. 2006, 2007 లలో ఎం.పీ.టీ.సీ. సభ్యునిగా 2007లో ఎం.ఎల్.సీ గా ఎన్నికైనారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టతకు రాష్ట్ర స్థాయిలో కృషిచేసిన ఈయన, రాష్ట్ర సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షులుగా, రాష్ట్ర ఎం.పీ.టీ.సీ సభ్యుల సంఘం అధ్యక్షులుగా పేరు తెచ్చుకున్నారు.[1]

ఉయ్యూరు నియోజకవర్గం[మార్చు]

గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషులు స్త్రీలు
1. ఆకునూరు 826 3,243 1,637 1,606
2. బొల్లపాడు 538 1,818 920 898
3. చిన ఓగిరాల 828 3,179 1,608 1,571
4. జబర్లపూడి 56 192 95 97
5. కడవకొల్లు 373 1,432 695 737
6. కలవపాముల 993 3,663 1,794 1,869
7. కాటూరు 1,907 7,221 3,578 3,643
8. ముదునూరు 1,164 4,125 2,070 2,055
9. పెద ఓగిరాల 1,038 3,676 1,816 1,860
10. శాయపురం 225 829 421 408
11. వీరవల్లి మొఖస 288 1,120 545 575
12. ఉయ్యూరు 10,323 43,269 22,116 21,153

ప్రభుత్వ కార్యాలయములు[మార్చు]

 • మండల పరిషత్తు కార్యాలయము.

చలనచిత్ర ప్రదర్శన శాలలు[మార్చు]

 • దీపక్
 • సాయిమహల్
 • శ్రీనివాస్
 • శాంతి

వంట గ్యాస్ సరఫరా దారులు[మార్చు]

 • అరుణ్ గ్యాస్ ఏజెన్సీ (హెచ్.పి)
 • శ్రీ మహలక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ (హెచ్.పి)
 • శివకృష్ణ గ్యాస్ ఏజెన్సీ (హెచ్.పి)
 • రత్నా గ్యాస్ ఏజెన్సీ (హెచ్.పి)
 • ఉషాకిరణ్ గ్యాస్ ఏజెన్సీ (భారత్)

కళాశాలలు[మార్చు]

 • ఎ.జీ.ఎస్.జీ.ఎస్.కళాశాల:- ఈ కళాశాల విద్యార్ధిని ఎస్.కె.బాజీబీ, ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో రెండు బంగారు, ఒక రజతపతకాన్నీ గెలుచుకొని, జాతీయస్థాయి పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించినది. [6]

పాఠశాలలు[మార్చు]

 • ఫ్లోరా ఇంగ్లీషు మీడియం పాఠశాల

ప్రార్ధనమందిరాలు[మార్చు]

దేవాలయములు[మార్చు]

 1. శ్రీ జగదాంబ సమేత సోమేశ్వరాలయం.
 2. శ్రీ లక్ష్మీనాంచారమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరుణాళ్ళను, 2015,మార్చ్-5వ తేదీ (ఫాల్గుణ పౌర్ణమి) గురు వారం నాడు ఘనంగా నిర్వహించినారు. భక్తజనం ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చినారు. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు, మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారి నూతన వస్త్రాలు, పసుపు,కుంకుమల ఊరేగింపు సాగినది. రాత్రి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించినారు. శుక్రవారం అమ్మవారి ఊరేగింపు నిర్వహించినారు. [3]
 3. శ్రీ సువర్చలా సమేత ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవాలు, ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [4]
 4. శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఉయ్యూరులోని కాటూరు రహదారి సమీపంలో గల ఈ ఆలయంలో, జంపాన కుటుంబీకుల ఆధ్వర్యంలో అమ్మవారి జాతరను, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [5]
 5. శ్రీ వీరమ్మ తల్లి ఆలయం.

మసీదులు[మార్చు]

దయోరా మసీదు.

వనరులు[మార్చు]

 1. 1.0 1.1 ఈనాడు కృష్ణా జులై 12, 2013. 8వ పేజీ.
 2. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2015,మార్చ్-6; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,మే నెల-13వతేదీ; 21వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,మే నెల-15వతేదీ; 21వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-26; 32వపేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉయ్యూరు&oldid=1624107" నుండి వెలికితీశారు