రేపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
నిర్దేశాంకాలు: 16°00′N 80°54′E / 16°N 80.9°E / 16; 80.9Coordinates: 16°00′N 80°54′E / 16°N 80.9°E / 16; 80.9
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంరేపల్లె మండలం
విస్తీర్ణం
 • మొత్తం10.97 కి.మీ2 (4.24 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2][1]
 • మొత్తం50,866
 • సాంద్రత4,600/కి.మీ2 (12,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1086
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8648 Edit this on Wikidata )
పిన్(PIN)522265 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

రేపల్లె బాపట్ల జిల్లా లోని పట్టణం, అదే పేరుతో గల మండలానికి కేంద్రం.

రవాణా సౌకర్యాలు[మార్చు]

రేపల్లె బస్సు నిలయం
రేపల్లె రైలు నిలయం నామఫలకం

రేపల్లె, గుంటూరు డివిజన్ లో తెనాలి - రేపల్లె లైన్ కు చివరి స్టేషను. రేపల్లె నుండి తెనాలి,గుంటూరు, హైదరాబాద్కు రైళ్ళు ఉన్నాయి. రేపల్లెలో బస్సు డిపో ఉంది. చుట్టుపక్కల అన్ని గ్రామాలకు రేపల్లె నుండి బస్సులు ఉన్నాయి. పెనుమూడి వారధి నిర్మాణం తరువాత రేపల్లె నుండి కృష్ణా జిల్లాలో ఉన్న గ్రామాలకు బస్సు సర్వీసులు ప్రారంభించడం జరిగింది. రేపల్లెని కృష్ణా జిల్లాతో కలుపుతూ కృష్ణా నది మీద 2006 లో వంతెన ప్రారంభించబడింది. వంతెన ప్రారంభం తరువాత కృష్ణాజిల్లాతో రాకపోకలు బాగా పెరిగాయి.

గ్రంథాలయం[మార్చు]

దశబ్దాల చరిత్ర కలిగిన రేపల్లె గ్రంథాలయంలో 32,000 గ్రంథాలుండేవి. ఈ భవనం శిథిలమవడంతో, ఒక నూతన భవనం నిర్మాణం కొరకు ప్రవాసాంధ్రుడు శ్రీ పరుచూరి శ్రీరామకృష్ణయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ అయిన పరుచూరి శ్రీనాథ్, 25 లక్షల రూపాయలు వితరణగా అందించడానికి ముందుకు వచ్చారు. పురపాల సంఘం పాలక వర్గం స్పందించి, చంద్రమౌళి పార్కులో 15 సెంట్ల స్థలం కేటాయించింది. భవన నిర్మాణానికి గ్రంథాలయ సంస్థ 35 లక్షల రూపాయల నిధులు మంజూరుచేసింది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

 1. పెనుమూడి గ్రామం వద్ద ఉన్న కృష్ణా నది ఒడ్డు. నా 214 జాతీయ రహదారి వారధిపక్కన శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం, లక్ష్మి గణపతి ఆలయం,సుబ్రహ్మణ్యేశ్వవర స్వామి ఆలయం,మాలికాపురత్తమ్మ ఆలయం శివాలయం,సత్యనారాయణ స్వామి ఆలయం,దంపతి సమేతముగా నవగ్రహ ఆలయం మొదలైన ఆలయములు నిర్మాణంలో ఉన్నవి

ప్రముఖులు[మార్చు]

 • సముద్రాల రాఘవాచార్య, సంగీత దర్శకులు.
 • ఇంకొల్లు వెంకటేశ్వరరావు, బాల సాహిత్యకారుడు,కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మత్తివారిపాలెం.
 • మోటూరి ఉదయం, ప్రజానాట్యమండలి కళాకారిణి, కమ్మవారిపాలెం.
 • విశ్వనాథ్ ,కళాతపశ్వి, దర్శకుడు, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామం.
 • జానకి,రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామం.
 • చంద్రమౌళి, గ్రంథాలయ ఉద్యమకారులు.
 • కాండూరి సీతారాయ్యగారు, స్వాతంత్ర్య సమరయోధులు.
 • పరచూరి బ్రదర్స్, సిని రచయిత, నటులు.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్‌బుక్ - పట్టణాలు (2011).
 2. http://repalle.cdma.ap.gov.in/.


"https://te.wikipedia.org/w/index.php?title=రేపల్లె&oldid=3520508" నుండి వెలికితీశారు