సంతమాగులూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సంతమాగులూరు
—  మండలం  —
ప్రకాశం జిల్లా పటములో సంతమాగులూరు మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో సంతమాగులూరు మండలం యొక్క స్థానము
సంతమాగులూరు is located in ఆంధ్ర ప్రదేశ్
సంతమాగులూరు
ఆంధ్రప్రదేశ్ పటములో సంతమాగులూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°07′49″N 79°56′55″E / 16.130262°N 79.948654°E / 16.130262; 79.948654
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము సంతమాగులూరు
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 53,608
 - పురుషులు 27,180
 - స్త్రీలు 26,428
అక్షరాస్యత (2001)
 - మొత్తం 48.87%
 - పురుషులు 60.28%
 - స్త్రీలు 37.10%
పిన్ కోడ్ ౫౨౩౩౦౨
సంతమాగులూరు
—  రెవిన్యూ గ్రామం  —
సంతమాగులూరు is located in ఆంధ్ర ప్రదేశ్
సంతమాగులూరు
అక్షాంశరేఖాంశాలు: 16°07′49″N 79°56′55″E / 16.130262°N 79.948654°E / 16.130262; 79.948654
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతమాగులూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ కుంచాల నారాయణ
జనాభా (౨౦౦౧)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య
 - స్త్రీల సంఖ్య
 - గృహాల సంఖ్య
పిన్ కోడ్ ౫౨౩౩౦౨(523302)
ఎస్.టి.డి కోడ్ ౦౮౪౦౪

సంతమాగులూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము మరియూ గ్రామము.[1] పిన్ కోడ్ నం. ౫౨౩ ౩౦౨ ., యస్.టీ.డీ.కోడ్ ౦౮౪౦౪.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

పత్తెపురం ౪ కి.మీ, మిన్నెకల్లు ౪ కి.మీ, కామేపల్లి ౬ కి.మీ, తంగెడుమల్లి ౬ కి.మీ, కొప్పరం ౬ కి.మీ., పాతమాగులూరు ౨ కి.మీ,అడ్డ రోడ్ ౩ కి.మీ,రామిరెడ్డి పాలెం ౫ కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన రొంపిచెర్ల మండలం, పశ్చిమాన శావల్యాపురం మండలం, ఉత్తరాన నర్సరావుపేట మండలం, దక్షణాన బల్లికురవ మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

 1. రైల్వే స్టేషన్:- సంతమాగులూరు ౫ కి.మీ దూరంలో ఉంది.
 2. బస్సుస్టాండ్:-సంతమాగులూరు.
 3. గుంటూరు-కర్నూలు రహదారి ఉంది.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

 1. ప్రభుత్వ జూనియర్ కళాశాల:- ఈ కళాశాల ౩౫వ వార్షికోత్సవం, ౨౦౧౬,జనవరి-౮వ తేదీనాడు నిర్వహించారు.[2]
 2. కార్తికేయ ఐ.టి.ఐ.
 3. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల స్వర్ణోత్సవాలు ౨౦౧౬,ఫిబ్రవరి-౨౮న నిర్వహించెదరు.[3]
 4. బాలాజీ ఉన్నత పాఠశాల.
 5. మన భాలభారతి విద్యాలయం.
 6. కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్.
 7. M.K.M ఇంగ్లీష్ మీడియం స్కూల్.
 8. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
 9. సంతమాగులూరు ఎస్.సి.కాలనీలోని (సి.డి) ప్రాథమిక పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్యకేంద్రం[మార్చు]

 1. సంతమాగులూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ౨౦౧౪(2014).మార్చి-౧౮(18), ఉదయం ౧౧-00(11-00) గంటలకు స్వర్ణోత్సవం జరుపుకున్నది.[4]
 2. ఈ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ౨౦౧౪-౧౫ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువసంఖ్యలో గర్భిణిలకు (౧౦౩ మందికి) ప్రసవాలు చేసి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందినారు.[5]

బ్యాంకులు[మార్చు]

 1. ది ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్.
 2. సిండికేట్ బ్యాంక్.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

 • ఈ గ్రామానికి ముఖ్యముగా నాగార్జున సాగర్ నీటి పైన ఆధార పడివున్నది పంటలకు త్రాగునీటికి ఈ నీటినే ఉపయోగిస్తున్నారు.
 • సంతమాగులురు చెరువు కుడా ఒకటి, కాకపొతె దానిని అభివృద్ధి చెయ్యవలిసిన అవసరం ఉంది. రిజర్వాయర్ అంశం చాలా కాలంగా వాయుదా పడుతుంది.
 • బోరు బావుల నీటి వాడకం ఎక్కువ. బోరు నీటిని కుడా త్రాగు నీరు కోసం ఉపయొగించుకోవచ్చు. త్రాగునీరు కోసం రెండు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు ౧౪ గంటలు పనిచేయుచున్నవి.

౧.అట్లా కోటేశ్వరమ్మ జ్ఞాపకార్ధం శ్రీ అట్లా చిన వెంకట రెడ్డి గారు. ౨.మౌమిత ఫౌండేషన్ తరుపున శ్రీ బాదం మాధవ రెడ్డి గారు నెలకొల్పినారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. ౧౫ ఏళ్ళపాటు పగ, ప్రతీకారం అక్కడ రాజ్యమేలినవి. ౧౯౯౧ నుండి ౧౦౦౫ వరకూ వర్గ పోరు రావణాకాష్టంగా రగిలిన ఈగ్రామం, తరువాత మార్పు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ౧౦౦౬ పంచాయతీ ఎన్నికలలో సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటినుండి గ్రామంలో సుమారు ౪ కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు జరిగినవి.[6]
 2. ౨౦౧౩ జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ గడ్డం వెంకటరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. ఈయన తరువాత డిసెంబరు-౧౨, ౨౦౧౩ నాడు, సంతమాగులూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనారు.[7]

గ్రామంలోని దర్శనీయ స్థలాలు/ప్రార్ధనా ప్రదేశాలు[మార్చు]

 1. శ్రీ పరశువేదేశ్వర స్వామివారి ఆలయం.
 2. శ్రీ రాధాకృష్ణ దేవాలయం.
 3. శ్రీ వినాయక దేవాలయం.
 4. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతీ హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించెదరు.[8]
 5. గ్రామదేవతల దేవాలయములు.

సంతమాగులురు చెరువు కుడా ఒకటి, కాకపొతె దానిని అభివృద్ధి చెయ్యవలిసిన అవసరం ఉంది. రిజర్వాయర్ అంశం చాలా కాలంగా వాయుదా పడుతుంది.

శ్రీ వీరభద్రేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ అంకమ్మ తల్లి ఆలయం, శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం, శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

గ్రామంలోని ఈ ఆలయాల జీర్ణోద్ధరణకు, ౨౦౧౫,జూన్-౧౨వ తేదీ శుక్రవారంనాడు, శంకుస్థాపన నిర్వహించారు.[9]

ఈ ఆలయాల పునఃప్రతిష్ఠా మహోత్సవం, ౨౦౧౬,ఏప్రిల్-౨౫వ తేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. ౨౦౧౬,మే-౧౦వ తేదీ మంగళవారంనాడు, ౧౬ రోజుల పండుగను వైభవంగా నిర్వహించారు.[10]

సుమారు 38 సంవత్సరముల తరువాత అంకమ్మ తల్లి,పోలెరమ్మ తల్లి కోలుపులు వైభవోపేతంగా 2016 ఆగస్టు 2 వ తేదిన ఘనంగా ప్రారంభమైననవి.ఈ కోలుపుల మహోత్సవం 2016 ఆగస్టు 8 వరకు వైభవంగా జరిగినవి.

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

వరి,మిరప,పసుపు,మొక్క జొన్న,ప్రత్తి,సజ్జ,కూరగాయ పంటలు.సుబాబుల్.

గ్రామంలోని వృత్తులు[మార్చు]

ముఖ్యంగా వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పనులు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

 • పోతరాజు పురుషోత్తమరాయ కవి, ఆశు కవి,వేదాంత పండితుడు,రచయిత
 • కీ.శే. బల్లేపల్లి సుబ్బారావు, డోలు విద్వాంసులు.

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

౨౦౦౧ వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా ౭౯౧౬.[11] ఇందులో పురుషుల సంఖ్య ౪,౦౭౭, మహిళల సంఖ్య ౩,౮౩౯, గ్రామంలో నివాస గృహాలు ౧౯౪౩ ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం ౨,౬౯౧ హెక్టారులు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,జనవరి-7; 1వపేజీ.
 3. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,ఫిబ్రవరి-27; 2వపేజీ.
 4. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,మార్చ్-19; 2వపేజీ.
 5. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మే-2; 2వపేజీ.
 6. ఈనాడు ప్రకాశం; 2013,జులై-20; 8వపేజీ
 7. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,డిసెంబరు-13; 2వపేజీ.
 8. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మే-12; 1వపేజీ.
 9. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,జూన్-13; 1వపేజీ.
 10. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,మే-11; 1వపేజీ.
 11. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18