Coordinates: 15°56′35″N 80°32′55″E / 15.942926°N 80.548731°E / 15.942926; 80.548731

కర్లపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్లపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
కర్లపాలెం is located in Andhra Pradesh
కర్లపాలెం
కర్లపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°56′35″N 80°32′55″E / 15.942926°N 80.548731°E / 15.942926; 80.548731
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం కర్లపాలెం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి విజయ
జనాభా (2001)
 - మొత్తం 19,157
 - పురుషుల సంఖ్య 9,638
 - స్త్రీల సంఖ్య 9,519
 - గృహాల సంఖ్య 4,909
పిన్ కోడ్ : 522111
ఎస్.టి.డి కోడ్ 08643.

ఇదే పేరుగల ప్రకాశం జిల్లాలోని మరియొక గ్రామం కొరకు చూడండి:- కర్లపాలెం (గుడ్లూరు)

కర్లపాలెం, బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం లోని గ్రామం.ఇది సమీప పట్టణమైన బాపట్ల నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5492 ఇళ్లతో, 19874 జనాభాతో 2623 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9940, ఆడవారి సంఖ్య 9934. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1950 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1262. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590454[1].పిన్ కోడ్: 522 111. ఎస్.ట్.డి.కోడ్ = 08643.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 19157. ఇందులో పురుషుల సంఖ్య 9638, స్త్రీల సంఖ్య 9519,గ్రామంలో నివాసగృహాలు 4909 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2623 హెక్టారులు.

గ్రామ చరిత్ర[మార్చు]

ఇక్కడ సా.శ. ఒకటో శతబ్దానికి చెందిన భౌద్ద స్తూపాలు లభ్యమయ్యాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

కర్లపాలెం పూర్వం దీని పేరు కఱులపాలెం, కఱి అనగా ఏనుగు, ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ ఉండేవి. అందుకే దీనిని కఱుల పాలెం అని పిలిచెవారు. కాలక్రమేణా అది కర్లపాలెం అయినది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో యాజలి,గుడిపూడి, భర్తిపూడి, అప్పికట్ల, ఈతేరు గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో రెండు ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 8, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం బాపట్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కర్లపాలెంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో11 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ ఉంది. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కర్లపాలెంలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కర్లపాలెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 552 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 204 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 29 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1837 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 27 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1809 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కర్లపాలెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1675 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 134 హెక్టార్లు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కాళికాంబ ఆలయం[మార్చు]

ఈ ఆలయం కర్లపాలెంలోని ఐలెండ్ కూడలిలో ఉంది.

శ్రీ పెద్దింటమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, మహిళలు అమ్మవారికి నీటిబిందెలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పసుపు, కుంకుమలతో విశేషపూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

కర్లపాలెంలోని యాదవపాలెంకు చెందిన భక్తులు, 2015,మే-24వ తేదీ ఆదివారంనాడు, పెద్దింటమ్మ కొలుపులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి చేరుకొని, అమ్మవారికి మొక్కులు చెల్లించి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

పెద్దింటమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి, వినాయక స్వామి వారల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2020,నవంబరు-7వతేదీ శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామములో 2017, ఫిబ్రవరి-9న భారతదేశ మాజీ అధ్యక్షులు ఎ.పి.జె.అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ నిర్వహించారు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".