మార్టూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మార్టూరు
రెవిన్యూ గ్రామం
మార్టూరు is located in Andhra Pradesh
మార్టూరు
మార్టూరు
నిర్దేశాంకాలు: 16°00′N 80°06′E / 16°N 80.1°E / 16; 80.1Coordinates: 16°00′N 80°06′E / 16°N 80.1°E / 16; 80.1 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంమార్టూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,356 హె. (5,822 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం21,434
 • సాంద్రత910/కి.మీ2 (2,400/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08404 Edit this at Wikidata)
పిన్(PIN)523301 Edit this at Wikidata

మార్టూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండల కేంద్రం.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది జిల్లా సరిహద్దులో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

డేగరమూడి 4 కి.మీ, జొన్నతాళి 5 కి.మీ, నాగరాజుపల్లి 5 కి.మీ, దర్శి 6 కి.మీ, కోనంకి 6 కి.మీ.

మండల సరిహద్దులు[మార్చు]

ఈ మండలానికి ఉత్తరమున గుంటూరుజిల్లా చిలకలూరిపేట, పడమర బల్లికురవ మండలం, దక్షిణాన పంగులూరు మండలం, తూర్పున యద్దనపూడి మండలములు సరిహద్దులుగ ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన బల్లికురవ మండలం, తూర్పున యద్దనపూడి మండలం, ఉత్తరాన చిలకలూరిపేట మండలం, దక్షణాన జనకవరం పంగులూరు మండలం.

బ్యాంకులు[మార్చు]

  • ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

మార్టూరు గ్రానైటు పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం మార్టూరు గ్రామ సమీపంలో, స్థానిక జాతీయ రహదారి వెంట ఉంది.

శ్రీ రుక్మా బాయి సమేత శ్రీ పాండురంగ స్వామివారి ఆలయం[మార్చు]

స్థానిక బలరాం కాలనీలో ఒక కోటి రూపాయలు వెచ్చించి నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో మార్టూరు గ్రామం క్రిక్కిరిసినది. విచ్చేసిన వేలాదిమంది భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక చెరువు వద్ద, అన్నదానం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సహజ యోగ, ధ్యానం, సంపూర్ణ ఆరోగ్యం మీద నిర్వహించిన సదస్సు అందరినీ ఆకట్టుకున్నది.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

మార్టూరు సుబ్బులు : ఈమె మార్టూరు లో జన్మించింది. తెలుగు నాటకరంగంలో సీనియర్ నటీమణి.

మార్టూరు సుబ్బులు : ఈమె మార్టూరు లో జన్మించింది. తెలుగు నాటకరంగంలో సీనియర్ నటీమణి.నాటకరంగంలోకి ప్రవేశించిన తరువాత మార్టూరు నుండి వెళ్లి, తెనాలిలో స్థిరపడ్డారు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఆరుగాలం శ్రమించిన మునగ రైతులకు సిరుల పంట చేతికి అందివస్తున్నది. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో, ఈ దఫా మునగ సాగు చేసిన రైతులు తమ ఉత్పత్తులను, కూరగాయలకు పేరెన్నికగన్న మార్టూరు మార్కెట్టుకు తరలించి, అమ్ముకొనుచున్నారు. వ్యాపారులు తాము సేకరించిన పచ్చి సరకును, ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ ఆశించిన ధరలు లభించుటతో, రైతులు తమ ఉత్పత్తులను, పెద్ద యెత్తున ఈ మార్కెట్టుకు తెస్తుండటంతో, మార్టూరు మార్కెట్టు మునగతో కళకళలాడుచున్నది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,181.[1] ఇందులో పురుషుల సంఖ్య 7,123, మహిళల సంఖ్య 7,058, గ్రామంలో నివాస గృహాలు 3,434 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,356 హెక్టారులు.

మూలాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=మార్టూరు&oldid=3273834" నుండి వెలికితీశారు