వేమూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేమూరు
—  రెవిన్యూ గ్రామం  —
వేమూరు is located in Andhra Pradesh
వేమూరు
వేమూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం వేమూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 9,744
 - పురుషుల సంఖ్య 4,730
 - స్త్రీల సంఖ్య 5,014
 - గృహాల సంఖ్య 2,640
పిన్ కోడ్ 522261
ఎస్.టి.డి కోడ్ : 08644

వేమూరు (ఆంగ్లం: Vemuru), గుంటూరు జిల్లా లోని ఒక గ్రామం, మండలం. ఇది సమీప పట్టణమైన తెనాలి నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2845 ఇళ్లతో, 9796 జనాభాతో 2284 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4850, ఆడవారి సంఖ్య 4946. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4421 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 912. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590404[1].పిన్ కోడ్: 522261. ఎస్.టి.డి.కోడ్ = 08644.[2]

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[3]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

వరాహపురం 1 కి.మీ; చంపాడు 2 కి.మీ; రావికంపాడు 3 కి.మీ; పోతుమర్రు 3 కి.మీ; కొల్లూరు 4కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున కొల్లూరు మండలం, పశ్చిమాన అమృతలూరు మండలం, పశ్చిమాన తెనాలి మండలం, దక్షణాన భట్టిప్రోలు మండలం.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.

సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల తెనాలిలోను, ఇంజనీరింగ్ కళాశాల వడ్లమూడిలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల వడ్లమూడిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి.

సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కొల్లూరులోను, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

వేమూరులో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

వేమూరులో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 6 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

వేమూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 300 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 25 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 25 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1933 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 8 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1924 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

వేమూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 1924 హెక్టార్లు

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- ఈ కేంద్రానికి గుంటూరు జిల్లాలోనే ఉత్తమ ఆరోగ్య కేంద్రంగా గుర్తింపు వచ్చింది. 69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కేంద్రం వైద్యాధికారి శ్రీ సింహాచలం, 2015, ఆగస్టు-15వ తేదీనాడు, మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావుగారి చేతులమీదుగా, ప్రశంసాపత్రం అందుకున్నారు. []

రక్షిత మంచినీటి పథకం[మార్చు]

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ది గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్:- ఈ బ్యాంకుశాఖ 2015, జూన్-24 నాడు, 26వ వార్షికోత్సవం జరుపుకున్నది. [6]

కొణిజేటి రోశయ్య సమావేశ మందిరం[మార్చు]

ఈ మందిరాన్ని, శ్రీ కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. [12]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మన్నే వాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాయాలములు[మార్చు]

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము[మార్చు]

ఈ ఆలయానికి రెండు శతబ్దాల చరిత్ర ఉంది. ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో దాత, తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉప కార్యనిర్వహణధికారి, శ్రీ కోగంటి మల్లిఖార్జునరావు స్పందించి, తన స్వంతనిధులు ఆరు లక్షల రూపాయలు వెచ్చించి, అలయ పునర్నిర్మాణం చేసారు. [8]

ఈ ఆలయంలో 2015, నవంబరు-30వ తేదీ సోమవారం ఉదయం ఉత్తరద్వారా ప్రారంభం, ధ్వజస్తంభం, గరుడస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా, ఆదివారం నాడు ధ్వజస్తంభాన్నికి మేళతళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. [9]

శ్రీ కట్లమ్మ తల్లి దేవాలయo[మార్చు]

శతాబ్దాల చరిత్ర ఉన్న, ఈ గ్రామంలోని శ్రీ కట్లమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణం చేశారు. 2014, ఫిబ్రవరి-2న పండితుల వేదమంత్రోశ్ఛారణల మధ్య, అమ్మవారి విగ్రహం, పోతురాజుస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ పునర్నిర్మాణానికి గ్రామస్థులు, స్థానికులు, భక్తులు, రు.20 లక్షల విరాళాలందించారు. [1]&[2] [4]

ఈ ఆలయ వార్షిక వేడుకలను, 2016, ఫిబ్రవరి-2వ తేదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహించారు. [10]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయ వార్షికోత్సవం, 2015, మార్చి-5వ తేది. ఫాల్గుణ పౌర్ణమి, గురువారం నాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో భక్తి గీతాలాలపించారు. భక్తులు స్వామివారికి విశేష పూజలు చేసి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. [4]

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మండలంలోని ప్రముఖులు[మార్చు]

సినీ, రాజకీయ రంగాలలో వేమూరు నియోజకవర్గనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయా రంగాలలో పలువురు ఉద్దండులు ఈ ప్రాంతానికి చెందినవారే కావటం విశేషం. సంగీత ప్రపంచంలో తనకంటూ కొన్ని పేజీలు ఏర్పరచుకున్న శ్రీ ఘంటశాల వెంకటేశ్వరరావు, భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామంలో కొంతకాలం పాటు నివాసం ఉన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి శ్రీ కె.విశ్వనాధ్, గూడా ఆ గ్రామానికి చెందినవారే. సుప్రసిద్ధ చలనచిత్ర నటులు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గూడా ఈ నియోజక పరిధిలోని కొల్లూరు మండలానికి చెందిన రావికంపాడు గ్రామస్థులే. [3]

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామంలో జన్మించాడు ప్రముఖ రంగస్థల నటుడు వేమూరి గగ్గయ్య దృశ్య చిత్రం
 • కొణిజేటి రోశయ్య: మాజీ ముఖ్యమంత్రి
 • నిమ్మగడ్డ బ్రహ్మయ్య: చాలా కాలం ఈ గ్రామ సర్పంచ్ గా పనిచేశారు.
 • దేవు శంకర్: అంతర్జాతీయ శిల్పి. ఆయన చేయిపడితే ఎటువంటి శిల అయినా అద్భుతరూపాన్ని సంతరించుకుంటుంది. సజీవరూపాన్ని సాక్షాత్కరింపజేసే ఆ శిల్పాలు దేశవిదేశాలలో ఖ్యాతికెక్కినవి. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో హైదరాబాదు ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించిన 105 అడుగుల ఎత్తయిన తెలుగుతల్లి విగ్రహం ఈయన తయారుచేసినదే. లోక్ సభలో కొలువుదీరిన వారు. టంగుటూరి ప్రకాశం, ఎన్.జి.రంగా, నందమూరి తారకరామారావుల విగ్రహాలు దేవు శంకర్ రూపొందించినవే. ఆయన ప్రతిభను గుర్తించి ఆయనకు, పంచశిల్పబ్రహ్మ బిరుదును ఇచ్చి సత్కరించారు. 2016, ఏప్రిల్-8వ తేదీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వీరిని హంస పురస్కారానికి ఎంపీచేసింది. 2016 డిసెంబరు 16 న కన్నుమూశారు.
 • నాదెండ్ల భాస్కరరావు
 • యడ్లపాటి వెంకటరావు
 • ఆలపాటి ధర్మారావు
 • ఆలపాటి రాజేంద్రప్రసాద్
 • కల్లూరి చంద్రమౌళి
 • నక్కా ఆనందబాబు
 • సోమరౌతు పాల్ రాజు
 • కొడాలి వీరయ్య చౌదరి
 • ఎస్.రామస్వామిచౌదరి
 • తాడేపల్లి లోకనాథ శర్మ (శాస్త్రీయ సంగీత విద్వాంసులు)

గణాంకాలు[మార్చు]

 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 9744
 • పురుషుల సంఖ్య 4730
 • మహిళలు 5014
 • నివాస గృహాలు 2640
 • విస్తీర్ణం 2284 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

మూలాలు[మార్చు]

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
 4. ఈనాడు గుంటూరు రూరల్ /వేమూరు, డిసెంబరు-12, 2013. 2వ పేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=వేమూరు&oldid=3270867" నుండి వెలికితీశారు