ఎన్.జి.రంగా
గోగినేని రంగనాయకులు | |
---|---|
![]() ఎన్.జి.రంగా | |
జననం | గోగినేని రంగనాయకులు నవంబరు 7, 1900 |
మరణం | జూన్ 9, 1995 |
ఇతర పేర్లు | ఎన్.జి.రంగా భారత రైతాంగ ఉద్యమపిత |
వృత్తి | లోక్ సభ సభ్యుడు , రైతు నాయకుడు |
ప్రసిద్ధి | భారత స్వాతంత్ర్య సమరయోధుడు, |
రాజకీయ పార్టీ | కాంగ్రెసు పార్టీ భారత కృషికార్ లోక్ పార్టీ |
మతం | హిందూ మతము హేతువాది |
తండ్రి | గోగినేని నాగయ్య |
తల్లి | అచ్చమాంబ |
ఆచార్య ఎన్.జి.రంగా గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.[1] రంగా, 1900, నవంబరు 7 న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకుజన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు హేతువాది . 1924లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది.నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు.1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు , కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యులే . ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది. రంగా సుదీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యునిగా రికార్డు సృష్టించి, గిన్నీస్ బుక్‌లోకి ఎక్కారు. చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి ఎన్నికై ఆయన ప్రాతినిధ్యం వహించారు. 95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు.
స్వాతంత్ర్య సమరంలో[మార్చు]
1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రెసు పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946 లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948 లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952 లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954 లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్ లోనూ, 1955 లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.ఈయన కాంగ్రెసు పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషీకార్ లోక్ పార్టీ, ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన రాజాజీతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. 1972లో రంగా తిరిగి కాంగ్రెసు (ఐ) లో చేరాడు.
రాజకీయ జీవితము[మార్చు]
లోక్ సభ | పదవీకాలం | నియోజకవర్గం | పార్టీ |
---|---|---|---|
2వ లోక్ సభ | 1957-1962 | తెనాలి | కాంగ్రెసు పార్టీ |
3వ లోక్ సభ | 1962-1967 | చిత్తూరు | స్వతంత్ర పార్టీ |
4వ లోక్ సభ | 1967-1970 | శ్రీకాకుళం | స్వతంత్ర పార్టీ |
7వ లోక్ సభ | 1980-1984 | గుంటూరు | కాంగ్రెసు (ఐ) |
8వ లోక్ సభ | 1984-1989 | గుంటూరు | కాంగ్రెసు (ఐ) |
9వ లోక్ సభ | 1989-1991 | గుంటూరు | కాంగ్రెసు (ఐ) |
ఆయన పేరుతో జాతీయ వ్యవసాయ విశ్వ విద్యాలయము స్థాపించబడింది.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-02. Retrieved 2007-08-08.
- ఎన్.జి.రంగా, నవ భారత నిర్మాతలు, అధరాపురపు తేజోవతి, పబ్లికేషన్స్ డివిజన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము, న్యూ ఢిల్లీ, 2006
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to N. G. Ranga. |
- All articles with dead external links
- Articles with dead external links from ఫిబ్రవరి 2020
- Articles with permanently dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- 1900 జననాలు
- 1995 మరణాలు
- తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు
- పద్మవిభూషణ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- 2వ లోక్‌సభ సభ్యులు
- 3వ లోక్‌సభ సభ్యులు
- 4వ లోక్‌సభ సభ్యులు
- 7వ లోక్‌సభ సభ్యులు
- 8వ లోక్‌సభ సభ్యులు
- 9వ లోక్‌సభ సభ్యులు
- ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు
- గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు
- గుంటూరు జిల్లా నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- చిత్తూరు జిల్లా నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- శ్రీకాకుళం జిల్లా నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు