Coordinates: 16°02′27.0″N 80°39′27.1″E / 16.040833°N 80.657528°E / 16.040833; 80.657528

కావూరు (చెరుకుపల్లి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కావూరు
కళ్యాణ కావూరు
—  రెవిన్యూ గ్రామం  —
కావూరు గ్రామంలో చారిత్రక, పౌరాణిక వ్యక్తుల స్మారక స్థూపాలు
కావూరు గ్రామంలో చారిత్రక, పౌరాణిక వ్యక్తుల స్మారక స్థూపాలు
కావూరు గ్రామంలో చారిత్రక, పౌరాణిక వ్యక్తుల స్మారక స్థూపాలు
కావూరు is located in Andhra Pradesh
కావూరు
కావూరు
మ్యాపును పెద్దదిగా చూడండి
అక్షాంశరేఖాంశాలు: 16°02′27.0″N 80°39′27.1″E / 16.040833°N 80.657528°E / 16.040833; 80.657528
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,270
 - పురుషుల సంఖ్య 2,875
 - స్త్రీల సంఖ్య 3,395
 - గృహాల సంఖ్య 1,840
పిన్ కోడ్ 522309
ఎస్.టి.డి కోడ్

కావూరు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం. కల్యాణ కావూరు దీని మరో పేరు. ఇది మండల కేంద్రమైన చెరుకుపల్లి H/O ఆరుంబాక నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పొన్నూరు నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1840 ఇళ్లతో, 6270 జనాభాతో 1098 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2875, ఆడవారి సంఖ్య 3395. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1247 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 252. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590437[1].పిన్ కోడ్: 522309.ఎస్.టి.డి.కోడ్: 08648.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6341. ఇందులో పురుషుల సంఖ్య 3110, స్త్రీల సంఖ్య 3231, గ్రామంలో నివాసగృహాలు1760 ఉన్నాయి. అక్షరాస్యత: 53.65 శాతం, పురుషుల అక్షరాస్యత: 66.96 శాతం, స్త్రీల అక్షరాస్యత: 60.17 శాతం.

భౌగోళికం[మార్చు]

పొన్నూరు నుండి 17 కి.మీ. దూరంలోను, రేపల్లె నుండి 25 కి.మీ. దూరంలోను, తెనాలి నుండి 28 కి.మీ. దూరంలోను, మండల కేంద్రం చెరుకుపల్లి నుండి 3 కి.మీ. దూరంలోను కావూరు ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప బాలబడి చెరుకుపల్లిలో ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆరుంబాకలోను, ఇంజనీరింగ్ కళాశాల కనగాలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ పొన్నూరులోను, మేనేజిమెంటు కళాశాల పొన్నపల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల గూడవల్లిలోను, అనియత విద్యా కేంద్రం పొన్నూరులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

  • ప్రభుత్వ జూనియర్ కళాశాల: మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటైన మొట్టమొదటి గ్రామం, కావూరు.
  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల: ఇది జూనియర్ కళాశాలతో కలిసి ఉంటుంది. హైదరాబాదుకు చెందిన నాట్కో ఫార్మా కంపెనీ నిర్వాహకులు, 2014 లో 19 లక్షల రూపాయల వ్యయంతో ఈ పాఠశాలలో 4 అదనపు తరగతి గదుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. 2015 లో అదే భవనంపై 18 లక్షల రూపాయల వ్యయంతో, మరి నాలుగు తరగతి గదులను నిర్మించి ఇచ్చారు.
  • తిలక్ జాతీయ ప్రాథమిక పాఠశాల: జాతీయోద్యమంలో భాగంగా జాతీయ విద్యను బోధించేందుకు దేశావ్యాప్తంగా నెలకొల్పిన జాతీయ పాఠశాలల్లో ఇది ఒకటి.
  • బాలికల గురుకుల విద్యాశాల: వినయాశ్రమంలో ఈ పాఠశాలను నెలకొల్పారు.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కావూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఏడుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కావూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ల్యాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

పోషణ, విజ్ఞాన, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కావూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 259 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 4 హెక్టార్లు
  • బంజరు భూమి: 29 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 805 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 23 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 815 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కావూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 663 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 152 హెక్టార్లు

ప్రధానంగా ప్రకాశం బారేజి నుండి నీటి సరఫరా జరుగుతుంది. మెట్ట ప్రాంత భూములకు వర్షాలు, వ్యక్తిగత లిఫ్టులు నీటి సౌకర్యం కలిగిస్తున్నాయి. వరి ప్రధానమైన పంట. రెండవ పంటగా మినుమును ప్రధానంగా పండిస్తారు.

ఊరచెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016 మే 15 న పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్పత్తి[మార్చు]

కావూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము, వేరుశనగ

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

ఆయుర్వేద ఔషధాలు, తేనె

మౌలిక వసతులు[మార్చు]

రాజకీయాలు[మార్చు]

కావూరు ఒక గ్రామ పంచాయతీ. ఇందులో మొత్తం 14 వార్డులు ఉన్నాయి, ప్రతీ వార్డుకు ఒక వార్డు మెంబర్ ఉన్నారు. ఈ వార్డు మెంబర్లకు సర్పంచ్ ప్రాతినిధ్యం వహిస్తాడు. నదియు నాగవేణి ప్రస్తుత సర్పంచ్.[2][3]

విశేషాలు[మార్చు]

బాలికల గురుకుల పాఠశాల

వినయాశ్రమం[మార్చు]

కావూరు గ్రామంలోని వినయాశ్రమం ఒక ప్రముఖ సామాజిక సేవాకేంద్రం.

వినయాశ్రమ ప్రవేశద్వారం

1930 లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం మొదలుపెట్టినపుడు, ఆంధ్రలో జాతీయోద్యమ స్ఫూర్తిని రగుల్కొలిపేందుకు శిబిరాలను నెలకొల్పదలచారు. ఆ విధంగా మూడు చోట్ల ఆశ్రమాలను ఏర్పాటు చేసారు. తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరం వద్ద, నెల్లూరు జిల్లాలో పల్లిపాడు వద్ద, గుంటూరు జిల్లాలో కావూరు లోను వీటిని ఏర్పాటు చేసారు. 1933 డిసెంబరు 23 న కావూరులో నెలకొల్పినదే వినయాశ్రమము. ఈ ఆశ్రమాలు నిరాడంబరత్వానికి ప్రతీకగా ఉంటూ ప్రజల సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డాయి. వినయాశ్రమాన్ని గొల్లపూడి సీతారామశాస్త్రి, తుమ్మల బసవయ్య, తుమ్మల దుర్గాంబ నిర్మించారు. 65 ఎకరాల స్థలంలో ఆశ్రమం నెలకొని ఉంది. 1984లో ఆశ్రమ స్థలం నుండి కొంత భాగాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బాలికల గురుకుల పాఠశాలకు కేటాయించింది.

మహాత్మా గాంధీ సందర్శన[మార్చు]

కావూరు గ్రామాన్ని మహాత్మా గాంధీ రెండు మార్లు సందర్శించాడు. 1933 డిసెంబరు 23 న మొదటిసారి సందర్శించినపుడు వినయాశ్రమాన్ని స్థాపించాడు. ఇక్కడి దేవాలయం లోకి హరిజనులకు ప్రవేశం కల్పించాడు.[4]

రెండవసారి 1937 జనవరి 23 న సందర్శించాడు. ఆ సంవత్సరం వచ్చిన తుపాను బీభత్సం తరువాత ప్రజలను పరామర్శించేందుకు గుంటూరు జిల్లాను సందర్శించాడు. తెల్లవారు ఝామున 4 గంటలకు కావూరు చేరుకుని వినయాశ్రమంలో తుపాను బాధితుల కోసం విరాళాలు సేకరించాడు.[5] ఆ రోజున గుంటూరు, విజయవాడల్లో జరిగిన సభల్లో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నాడు:

వినయాశ్రమంలో, చుట్టూ చీకట్లు ముసిరిన ఆ సమయంలో వందలమంది స్త్రీ పురుషులు నన్ను చూసేందుకు ఆతురతతో వేచి ఉన్నారు. నేను అక్కడ భిక్షాటన మొదలు పెట్టగానే, సొమ్ములు ఇవ్వని ఆడమనిషి గాని, మగమనిషి గానీ ఒక్కరు కూడా లేరక్కడ. కొందరు సోదరీమణులు తమ నగలు ఇచ్చేసారు.[6]

దర్శనీయ స్థలాలు/దేవాలయాలు[మార్చు]

  • శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో త్రయాహ్నిక ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు, 2014 ఏప్రిల్ 4, శుక్రవారం నాడు మొదలయినవి. శనివారం నాడు, యంత్ర రాజార్చన, అస్త్రపూజ, అగ్నిప్రతిష్ఠ, అష్టభైరవ హోమం, మూర్తిహోమం, అనంతరం గ్రామంలో నగరోత్సవం నిర్వహించారు. ఆదివారం ఉదయం విగ్రహప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. అనంతరం శాంతికళ్యాణం, పూర్ణాహుతి, మహా నివేదన నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమీప గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో, కావూరు గ్రామంలో ఆరోజున ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది.
  • శ్రీ గంగా పార్వతీ సమేత సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, ప్రతి సంవత్సరం మాఘమాసంలో వైభవంగా నిర్వహించెదరు.
  • శ్రీ కావూరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు, అమ్మవారికి "సప్తాహం" కార్యక్రమం నిర్వహించెదరు. ఈ సందర్భంగా, ప్రతి రోజూ ఆలయంలో హరేరామ సంకీర్తన చేసెదరు.
  • శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి ఆలయం.
  • శ్రీ కృష్ణ గీతామందిరం.

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

పరిశ్రమలు[మార్చు]

2007 లో డాక్టస్ పేరుతో మెడికల్ ట్రాన్‌స్క్రిప్షన్ కంపెనీని గ్రామంలో ఏర్పాటు చేసారు. గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తుమ్మల రామకృష్ణ ఈ సంస్థను స్థాపించాడు. గ్రామంలోనే కాక, చుట్టుపక్కల గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది.

ప్రముఖులు[మార్చు]

  • తుమ్మల సీతారామమూర్తి: తెలుగులెంక, బిరుదు పొందిన కవి, తుమ్మల సీతారామమూర్తి కావూరు గ్రామంలో జన్మించాడు.
  • నన్నపనేని వెంకన్న చౌదరి: నాట్కో ఫార్మస్యూటికల్స్ స్థాపకుడు .కావూరు గ్రామంలోనే చదువుకున్నాడు.
  • తుమ్మల రామకృష్ణ: హైదరాబాదులోని ప్రముఖ మెడికల్ ట్రాన్‌స్క్రిప్షను సంస్థ డాక్టస్ స్థాపకుడు
  • నాగళ్ల కృష్ణ పశువైద్య శాస్త్రవేత్త, రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అయిన వీరికి 2011 నవంబరు 4 న జాతీయ స్థాయి జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. వీరు ప్రస్తుతం, "జాతీయ స్థాయి పథకాల అమలు" అను కార్యక్రమానికి అధ్యక్షులు
  • కావూరు పాఠశాల విద్యార్థిని అక్కల మహిత, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు, అండర్-14 విభాగంలో వెళ్ళే, రాష్ట్ర బాలికలజట్టుకు ఎంపిక అయినది. ఈమె అక్టోబరు-2014లో అనంతపురంలో నిర్వహించిన స్కూల్ గేంస్ లోనూ, నవంబరు-2014లో ప్రకాశం జిల్లా పొదిలిలో నిర్వహించిన సంఘం కబడ్డీ పోటీలలోనూ, జిల్లా జట్టుకి ప్రాతినిధ్యం వహించి, ప్రతిభ కనబరచడంతో, రాష్ట్ర జట్టుకి ఎంపికైంది.
  • కేసన సింధుప్రభ కావూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న కోటేశ్వరరావు కుమార్తె సింధుప్రభ క్యాలికట్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.టెక్., చదువుతూండగా, మానవ సహాయం లేకుండా, విద్యుత్తు పరికరాలతో, మంచంలో ఉన్న రోగికి సమయానికి ఔషధాలను అందించే ప్రాజెక్టును చేపట్టి, ప్రపంచ సాంకేతిక పరికరాల ఉత్పత్తిదారుల సమాఖ్యకు నామినేషన్ పంపింది. 2015,నవంబరు-1 నుండి 4 వరకు, చైనాలో నిర్వహించిన ఐ.ఈ.ఈ.ఈ, రీజియన్-10 సదస్సులో ఈమెను యువశాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికచేసారు. 2015 నవంబరు 5న ఛైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈమెకు నగదు, ప్రశంసాపత్రం అందజేసారు.
  • నాగళ్ల గురుప్రసాదరావు: ప్రాచీన, మధ్యయుగ సాహిత్యానికి గాను 2015 లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి భాషా సమ్మాన్ పురస్కారం పొందాడు. [7]

మూలాలు వనరులు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. Social Science (in ఇంగ్లీష్). Vk Publications. p. 117. ISBN 9788179732144. Archived from the original on 2016-06-11. Retrieved 2017-06-21.
  3. "List of elected Sarpanchas in Grampanchayat of Guntur district, 2013" (PDF). State Election Commission. Archived from the original (PDF) on 29 జూన్ 2016. Retrieved 5 June 2016.
  4. "Chronology of Mahatma Gandhi's life/India 1933". Archived from the original on 2018-07-17. Retrieved 2022-07-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "గుంటూరు జిల్లాలో మహాత్ముని సంచారము:విజ్ఞప్తి". ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రపత్రిక. 25 January 1937. Archived from the original on 17 July 2018.
  6. "Mahatma Gandhi collected works Vol-70" (PDF). p. 354. Archived from the original on 2017-06-28. Retrieved 2016-12-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "లిస్ట్ ఆఫ్ భాషా సమ్మాన్ అవార్డీస్" (PDF). సాహిత్య అకాడమీ. Archived from the original (PDF) on 2022-12-13. Retrieved 2022-12-13.

బయటి లింకులు[మార్చు]