Coordinates: 16°04′26″N 80°43′24″E / 16.073877°N 80.723387°E / 16.073877; 80.723387

గూడవల్లి (చెరుకుపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూడవల్లి
—  రెవిన్యూ గ్రామం  —
గూడవల్లి is located in Andhra Pradesh
గూడవల్లి
గూడవల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°04′26″N 80°43′24″E / 16.073877°N 80.723387°E / 16.073877; 80.723387
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,022
 - పురుషుల సంఖ్య 1,939
 - స్త్రీల సంఖ్య 2,083
 - గృహాల సంఖ్య 1,186
పిన్ కోడ్ 522259
ఎస్.టి.డి కోడ్ 08648

గూడవల్లి, బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చెరుకుపల్లి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రేపల్లె నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1186 ఇళ్లతో, 4022 జనాభాతో 1299 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1939, ఆడవారి సంఖ్య 2083. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1071 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 264. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590442.[1] పిన్ కోడ్: 522259.

గ్రామ చరిత్ర[మార్చు]

ఈ గూడవల్లి ప్రాచీన శాసనాలలో కుముదవల్లిగా, కుముదపల్లిగా, కుముద వెల్లిగా పేర్కొనటం జరిగింది. పూర్వం ఈ గ్రామం పులివర్రు తాలూకాలో ఉండేది.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది రేపల్లె, తెనాలి మార్గంలో ఉంది. ఈ గ్రామం అక్షాంశ పరిధి - 80°42'38" తూర్పు అక్షాంశము, రేఖాంశ పరిధి16°3'59" ఉత్తర రేఖాంశము. పొన్నపల్లి, నడింపల్లి, గూడవల్లి గ్రామాలు కలిసిపోయి వుంటాయి. ఈ గ్రామం గుంటూరు నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో,రేపల్లె నుంచి సుమారు 26 కిలోమీటర్ల దూరంలో, తెనాలి నుంచి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, పొన్నూరు నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గ్రామ సరిహద్దులు[మార్చు]

తూర్పు - కనగాల, పడమర - నడింపల్లి, ఉత్తరం - పాంచాలవరం, దక్షిణం - రాజవోలు (చెరుకుపల్లి)

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పొన్నపల్లి, కనగాల, రాజవోలు, పెద్దవరం, ఆళ్ళవారిపాలెం గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప జూనియర్ కళాశాల చెరుకుపల్లిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆరుంబాకలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ రేపల్లెలోను, మేనేజిమెంటు కళాశాల పొన్నపల్లిలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం రేపల్లెలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

పాఠశాలలు[మార్చు]

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (1-5 తరగతులు):- గూడవల్లి గ్రామంలో సుమారు 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గూడవల్లి మండేవారిపాలెంలో నూతనంగా నిర్మించిన పాఠశాల, అంతర్గత రహదారులు 2013,డిసెంబరు-11న ప్రారంభించారు.

మునిసామి నాయుడు స్మారక (ఎం.ఎన్.ఎం) ఉన్నత పాఠశాల (6-10 తరగతులు):- దీనిని 1944 లో ప్రారంభించారు. దీనిని ప్రారంభించినప్పుడు సుమరుగా 2000 మంది దీనిలో విద్యనభ్యసించేవారు. ఈ పాఠశాల 71వ వార్షికోత్సవం, 2015,మార్చి-14వ తేదీ శనివారం నాడు, ఘనంగా నిర్వహించారు.

వనజా చంద్ర విద్యాలయము (యెల్.కె.జీ-10 తరగతులు):- ఇది అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారిచే 1992 జూన్ 14 లో ప్రారంభించబడింది. ఇది ప్రారంభించినపుడు తెలుగు మాధ్యమములో విద్యాబోధన జరిగేది.ఇప్పుడు ఆంగ్ల మాధ్యమములో విద్యాబోధన జరుగుచున్నది.ఈ పాఠశాలలో ప్రయోగశాల (టాటా వారు సుమారు 14 లక్షలు ఇచ్చారు), ఆట స్థలము, కంప్యూటర్ శిక్షణాకేంద్రం (సుమారు 25 కంప్యూటర్లు ఉన్నాయి), బస్సు సౌకర్యం, మినరల్ వాటర్ సౌకర్యం ఉంది.

కళాశాలలు[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

గూడవల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

కంటి ఆసుపత్రి[మార్చు]

హైదరాబాదులోని ఎల్.వి.ప్రసాదు కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో 2011 లో కంటి ఆసుపత్రిని ప్రారంభించారు.ఈ ఆసుపత్రిలో 2017 జూన్-2న, మొదటిసారిగా కంటి నల్లగుడ్డు మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

గూడవల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు (State Bank of India), వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామస్థుల ఆర్థిక అవసరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గూడవల్లి శాఖ తీరుస్తోంది. 1999 వరకు స్తబ్దుగా వున్న బ్యాంక్ కార్యకలాపాలు, యువ అధికారులు, సిబ్బంది రాకతో 1999 తర్వాత బాగా పుంజుకున్నాయి. 1999-2001 కాలంలో పనిచేసిన శాఖాదిపతి, సిబ్బందిని ఇప్పటికీ గ్రామ ప్రజలు తలుచుకుంటూ వుంటారు.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం ( గద్దె లలితాదేవి స్మారక గ్రంథాలయం.), పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

గూడవల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 192 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 100 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1006 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 5 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1001 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

గూడవల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 999 హెక్టార్లు (పెద్ద కాలువ (రేపల్లె మురుగు కాలువ), ఛిన్నకాలువ (దేశం కాలువ))
  • బావులు/బోరు బావులు: 2 హెక్టార్లు
  • చెరువులు -రాయగుంట చెరువు

ఉత్పత్తి[మార్చు]

గూడవల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము, మొక్కజొన్న

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

భారతీయ స్టేట్ బ్యాంక్. ఫోన్ నం. 08648/258655.

గోగినేని కళ్యాణ మండపం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

మండేవారిపాలెం, గూడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

2013 జూలైలో గూడవల్లి గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, ఆలపాటి వెంకటలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

నరసింహస్వామి దేవాలయము
గద్దె లలితా దేవీ స్మారక గ్రంథాలయం

చారిత్రిక నేపథ్యం[మార్చు]

ఇక్కడ పూర్వము నాగేశ్వరస్వామి దేవాలయము, మల్లిఖార్జునస్వామి, గణపేశ్వరుల దేవాలయములు వృద్ధిగా ఉండటం తెలుసుకున్న కుళోత్తుంగ చోళ మహారాజు స్వాముల మహిమ గురించి తెలుసుకుని ఆ దేవులకు నిత్యనైవేద్య ధూపదీపారాధనలకు, మహోత్సవములు జరుగుటకు, శాలివాహన శకం 1050 లో (సా.శ. 1172 లో) కుముద వెల్లిలో దానము ఇచ్ఛి శిలాశాసనములు వ్రాయించి ఆలయమునకు మండప ప్రాకారాదులు నిర్మాణము చేయించారు. పూర్వము ఈ గ్రామంనకు నడింపల్లివారు, ముక్కామల వారు కరణాలుగా పనిచేసారు. శాలివాహన శకం 1067 (సా.శ. 1139 లో) గణపతిదేవ చక్రవర్తి కాలములో ఈ గ్రామాన్ని గోపరాజు రామన్నగారు దానముగా స్వీకరించారు. ఆ రోజులలో ఆగిరిపలిల శోభనాద్రి స్వామివారి అర్చకుడు, వైఖానస సూత్రీకుడు ఉత్తర తాళ్ళపాక అన్నమయ్యగారు తిరుమల వెళ్ళుచూ ఈ గ్రామానికి వచ్చి గ్రామానికి తూర్పుగా ఉన్న కృష్ణపాయలో (కరకట్టలు ఏర్పడటానికి పూర్వము ఇప్పట్టి గంగోలు కాలువ) స్నానము చేసి అనుష్టానము చేసుకొనుచూ గట్టున కూర్చున్నారు. ఆ సమయములో జాలరులు వలలు వేసి దానిలో ఇరుక్కున్న లక్ష్మీనృశింహస్వామివారి విగ్రహన్ని (5 అడుగుల ఎత్తు) తీసి బయట పడవేసినారు (దీనితో పాటు స్తంభోద్భవ నారసింహము సుమారు 8.6 అడుగుల ఎత్తుగల స్తంభము దొరికింది). తాళ్ళపాక సుబ్బయ్య గారు ఆ విగ్రహన్ని చూసి ఆశ్చర్యపడి అంతటి విగ్రహన్ని స్వామి యొక్క అనుగ్రహ బలముతో ఒక్కరే తీసుకువచ్చి గ్రామంలో తూర్పుభాగమునకు వచ్చారు. అచ్చట నుంచి ఆ విగ్రహము ఒక్క అడుగు కూడా కదలలేదు. ఆ స్వామివారిని అచ్చటనే ప్రతిష్ఠ చేసి సుబ్బయ్య గారు తమకు బంధువైన బృందావనం వారు అనే వైఖానసలైన వారిని అర్చకత్వములో నియోగించారు. కుళోత్తుంగ చోళ మహారాజు చేసిన దానశాసనము నృశింహస్వామివారి గుడి గోడపైననూ, ఘంటావారి బజారులో ఉన్న తిరుగుట నంది ఉన్న స్తంభముపైననూ కనిపిస్తాయి. పూర్వము ఈ తిరుగుడు నందిని త్రిప్పితే గర్బవతులు తేలికగా ప్రసవించే వారని పెద్దలనే వారు. ఆ నంది కాలక్రమేణ కాలగర్బములో కలసిపోయిన నాగేశ్వరస్వామివారి దేవాలయ ధ్వజస్తంభమని అంటారు. ప్రస్తుతము శ్రీ లక్ష్మీనృశింహస్వామివారి ఆలయము ఒక్కటే మంచి స్థితిలో ఉంది. మిగిలిన ఆలయాలన్నీ లక్ష్మీనృశింహస్వామివారి ఆలయానికి వాయవ్య మూల భూమిలో పూడిపోయివున్నవి.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం[మార్చు]

ఇది చాలా పురాతనమైన దేవాలయము. పూర్వము ఈ ఆలయమందు శ్రీ జ్వాలానారసింహ సాలగ్రామం గలదు. ఈ స్వామి చాలా శక్తిగలవారు. ఈ స్వామికి ఎదురుగా గ్రామస్థులు గడ్డివాములు, ఇండ్లు మొదలైనవి వేసిన ఆ స్వామి జ్వాలకు అవి అన్నియు మండిపోయెడివి.అందువలన గ్రామస్తులందరు స్వామి దృష్టి తప్పించి నిర్మంచుకొనేవారు. ఈ గ్రామంనకు దక్షిణమున అనగా శ్రీ నరసింహ స్వామి వారికి యెదురుగా నిర్మంచినవి తగలబడిపోవుటచే శ్రీ స్వామి వారి దృష్టికి ఎదురుగా ఒక వీధి వదలి గ్రామం నిర్మంచినారని ప్రతీతి. కొంతకాలము జరిగిన పిదప గూడవల్లికి పడమటి దిక్కున పదునాల్గుమైళ్ళ దూరంలో పొన్నూరు గ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ భావనారాయణ స్వామివారి ప్రతిష్ఠ జరుగు సమయమున ఈ జ్వాలానారసింహ సాలగ్రామం, స్వామివద్ద వుంచిన చాలా ప్రతిభ వచ్చునని అప్పుడు సాలగ్రామం ఎవరికి తెలియకుండా దొంగిలించి తీసుకుపోయిరి. అట్లు తీసుకుపోవునప్పుడు వారి వళ్ళు అంతా బొబ్బలెక్కి మంటలతో బాధపడలేక భావనారాయణస్వామి వారికి ఎదురుగా ఉన్న కోనేరులో పడవేసిన ఆ కోనేటిలోని నీరు తుక తుకా ఉడికి ఇంకిపోయినదట. ఆ సమయమున కృష్ణానది ఒడ్డున కోటిపల్లె అనే గ్రామంలో శివాలయ ప్రతిష్ఠ జరుగుతోంది. ఈ జ్వాలానారసింహ సాలగ్రామం లింగము క్రింద వుంచి ప్రతిష్ఠచేసిన శివునికి గొప్ప మహత్యం వస్తుందని పొన్నూరు కోనేరులో గల సాలగ్రామాన్ని అనేక బాధలకు ఓర్చి తీసుకువెళ్ళి లింగం క్రింద వుంచి ప్రతిష్ఠ జరుప ప్రయత్నించిరి. ఆ సమయమున ప్రజలందరు చూస్తుండగా పెద్ద ధ్వనితో లింగము బ్రదలై కంటినలుసు లంతగా పగిలిపోయి దేదీప్యమనమైన తేజస్సు తాళ్ళ వృక్షము ఎత్తున వెలుగుతూ ఐదు ఘడియల కాలము నిలచి అంతర్థానమయిపోయిందట! ఈ ఆలయము సుమారు 37 సం"ల నుండి దేవాదాయశాఖ వారి స్వాధీనంలో వుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నృసింహ జయంతి కార్యక్రమం కన్నులపండువగా నిర్వహించెదరు.

సుమారు 200 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన ఈ ఆలయ ధ్వజస్థంభం శిధిలావస్థకు చేరటంతో నూతన ధ్వజస్థంభం ఏర్పటు అవసరమైనది. ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ గోగినేని గోపీచంద్, ఆయన సోదరుడు శ్రీ బుల్లిప్రసాద్, వీరి సోదరి శ్రీమతి జి.బుల్లెమ్మ, తమ తల్లిదండ్రులు కీ.శే.వెంకటరత్నం, సూర్యకోటిప్రకాశరావు ల ఙాపకార్ధం, ఈ ఆలయానికి ఒక నూతన ధ్వజస్థంభాన్ని విరాళంగా అందించినారు. ఈ ఆలయంలో ఈ నూతన ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు 2017,జూన్-రెండవతేదీ శుక్రవారంనుండి ప్రారంభించినారు. ఈ కార్యక్రమం కోసం ఒక యాగశాల నిర్మించినారు. 5వతేదీ సోమవారం ఉదయం 8-50 కి నూతన ధ్వజస్థంభ ప్రతిష్ఠా నిర్వహించినారు. అనంతరం స్వామివారి శాంతికళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. ఆ పిమ్మట నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో ఐదువేలమందికి పైగా భక్తులు పాల్గొన్నారు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ గోకర్ణేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ శివకేశవుల దేవస్థానములను మహయోగిని శ్రీ సూరమ్మగారు 1961 సం" మే 7,8 తేదీలలో నిర్మాణం గావించారు. ఈ ఆలయాలలో జీవ, ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మార్చి-9వ తేదీ, సోమవారం నాడు, వైఖానస, శైవాగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాల నుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారలను కొలిచేటందుకు పోటీ పడినారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొని, స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు.

శ్రీ రామాలయం[మార్చు]

గ్రామ దేవత - దేశమ్మ, నాంచారమ్మ[మార్చు]

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-15వతేదీ బుధవారంనాడు, నవగ్రహాల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నిర్మించిన ప్రత్యేక మండపంలో నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠను ఋత్విక్కులు వైభవం నిర్వహించారు. నాగేంద్రస్వామి వల్మీకాల వద్ద 11 జంట నాగుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. శాంతిహోమం ఏర్పాటుచేసారు. అనంతరం నాలుగు వేలమందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి, 16 రోజులైన సందర్భంగా, 2017,మార్చి-4వతేదీ శనివారంనాడు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. నాగేంద్రస్వామివారి పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

శ్రీ పోతురాజుస్వామివారి ఆలయం[మార్చు]

గూడవల్లి గౌడపాలెంలో వేంచేసియున్న ఈ స్వామివారి ఆలయంలో వార్షిక కొలుపులు 2017,జూన్-11వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామికిగ్రామోత్సవాన్ని నిర్వహించగా, మహిళలు, మేళాతాళాల నడుమ పొంగళ్ళను తలపై పెట్టుకుని స్వామివెంట నడచారు. ఆలయం వద్ద 101 మంది అక్కదేవతలకు పసుపు, కుంకుమ, గాజులు, పూలు సమర్పించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం స్వామికి పొంగళ్ళను సమర్పించి మొక్కులుతీర్చుకున్నారు.

శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం[మార్చు]

శ్రీ సత్యసాయి ధ్యాన పాదుకా మందిరం[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • షేక్ మస్తాన్ వలీ లింకా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్ విజేత.

గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన వీరు ఇంటరు వరకు, విద్యనభ్యసించి, ఆర్థికభారంతో, కుటుంబ భారాన్ని మోయాలనే ఉద్దేశంతో, 18 సంవత్సరాల వయసులోనే, 1986లో ఆర్మీలో చేరి, మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ లో బాధ్యతలు తీసికొన్నారు. ఈయనకు తొలిసారిగా 1996లో అంటార్కిటికా ఖండంలో పరిశోధనలకు వెళ్ళుచున్న శాస్త్రవేత్తల బృందానికి, "లాజిస్టిక్స్ సపోర్టరు"గా వెళ్ళే అవకాశం కలిగింది. రెండు శాతం కొండలు, 98 శాతం మఛుతో కప్పబడిన, జనసంచారం లేని మంచు ఎడారి అది. భారత ప్రభుత్వం వారు అక్కడ దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అను మూడు ఇండియన్ అంటార్కిటికా సైంటిఫిక్ స్టేషనులను ఏర్పాటుచేసారు.

పరిశోధనలలో ఆ శాస్త్రఙులకు కావలసిన సదుపాయాల కల్పనను చూడటం మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ వారి కర్తవ్యం. బుల్ డోజర్, క్రేన్, ఎస్కలేటర్ డ్రైవర్ గా అనుభవం ఉన్న మస్తాన్, ఆ ప్రతికూల వాతావరణంలో, శాస్త్రఙులు ఎక్కడ టవర్లు నిర్మించాలన్నా, అక్కడ అనుకున్న కాలానికి చేసిపెట్టేవారు. ఈ మంచుఖండంలో ఈయన 1996, 2008, 2010,2013 సంవత్సరాలలో, అత్యధికంగా మొత్తం 1990 రోజులు విధి నిర్వహణ చేసి, "లింకా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్"లో స్థానం సంపాదించుకున్నారు.

కోటపాటి మురహరిరావు
  • కోటపాటి మురహరిరావు స్వాతంత్ర్య సమరయోధులు, హేతువాది.
  • ఎంఏఎల్ నరసింహారావు చీమకుర్తి కళ్ళ డాక్టరు.తొలిసారి కంటిలోని నల్లగుడ్డును మార్చిన వైద్యులు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామం నుండి సుమారు 5౦౦ మంది, అమెరికాలో స్థిరపడిన వారు ఉండటం ఈ గ్రామ విశిష్టత.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3785. ఇందులో పురుషుల సంఖ్య 1847, స్త్రీల సంఖ్య 1938,గ్రామంలో నివాసగృహాలు 1153 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులు[మార్చు]