అక్షాంశ రేఖాంశాలు: 16°03′57″N 80°44′47″E / 16.065841°N 80.746502°E / 16.065841; 80.746502

ఆళ్ళవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆళ్ళవారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఆళ్ళవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఆళ్ళవారిపాలెం is located in Andhra Pradesh
ఆళ్ళవారిపాలెం
ఆళ్ళవారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°03′57″N 80°44′47″E / 16.065841°N 80.746502°E / 16.065841; 80.746502
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522309
ఎస్.టి.డి కోడ్ 08644

మౌలిక సదుపాయాలు

[మార్చు]

వైద్య సౌకర్యం:- ఈ గ్రామం కనగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనిది.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కూరేటి రామారావు, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

గ్రామదేవత శ్రీ అంకాళ్ళమ్మ తల్లి

[మార్చు]

ఆళ్ళవారిపాలెం గ్రామంలో కొలువైన గ్రామదేవత శ్రీ అంకాళ్ళమ్మ తల్లి కొలువులు, 2014, జూన్-1 నుండి 5 వరకు వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజు, 5వ తేదీ గురువారం నాడు, ఉదయం అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించారు. జంగమదేవర చెప్పే అమ్మవారి కథలు వినేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపినారు. సాయంత్రం అమ్మవారిని తిరిగి, ఆలయంలో ప్రవేశపెట్టినారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ రేపల్లె మాధవరావు ఒక కౌలు రైతు. వీరి కుమారుడు శ్రీకాంత్, దగ్గరలో విద్యాసౌకర్యం లేకపోవడంతో, దూరమైనా గానీ, గూడవల్లిలోని వనజాచంద్ర పాఠశాలకు రోజూ వెళ్ళి చదువుకుని, 2014=15 విద్యాసంవత్సరంలో, 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, ఆ పరీక్షలలో ఇతడు, 10/10 గ్రేడ్ మార్కులు సాధించి, తన గ్రామానికీ మరియూ తను చదువుకున్న పాఠశాలకూ పేరుతెచ్చాడు.