నడింపల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నడింపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,653
 - పురుషుల సంఖ్య 1,289
 - స్త్రీల సంఖ్య 1,364
 - గృహాల సంఖ్య 808
పిన్ కోడ్ 522 259
ఎస్.టి.డి కోడ్ 08648


నడింపల్లి, గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 259., ఎస్.టి.డి.కోడ్ = 08648.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

నడింపల్లి చెరుకుపల్లి మండలములోని ప్రముఖ గ్రామము. ఇది రేపల్లె, తెనాలి మార్గంలో ఉంది. ఈ గ్రామం అక్షాంశ పరిధి - 80°42'38"E రేఖాంశ పరిధి16°3'59"N.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో గూడవల్లి, రాజవోలు, కనగాల, పెద్దవరం, ఆళ్ళవారిపాలెం గ్రామాలు ఉన్నాయి.

సరిహద్దులు[మార్చు]

తూర్పు - గూడవల్లి
పడమర - పొన్నపల్లి
ఉత్తరం - పాంచాలవరం
దక్షిణం - రాజోలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

వనజాచంద్ర పబ్లిక్ స్కూల్:- ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక, చిన్నప్పటినుండి నాట్యంపై మక్కువతో కూచిపూడి నాట్యంలో శిక్షణపొంది, జిల్లా, రాష్ట్రస్థాయిలో వందకుపైగా ప్రదర్శనలిచ్చి, పలు బహుమతులను సాధించింది. ఈమె చదువుతోపాటు నాట్యంలో గూడా రాణించుచున్నది. కనగాల ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సుగా పనిచేయుచున్న ఈమె తల్లి శ్రీమతి గోవిందమ్మ, వరుసగా నాలుగు సార్లు ఉత్తమ స్టాఫ్ నర్సుగా పురస్కారాలు అందుకున్న ఘనతను సొంతం చేసుకొనది. ఈమె తండ్రి శ్రీనివాసరావు. [8]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

* ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం:- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, ప్రతి సంవత్సరం ఆరోగ్యశాఖ ప్రదానంచేయు పురస్కారానికి, ఈ కేంద్రంలో కార్యకర్తగా పని చేయుచున్న శ్రీమతి ఎం. రత్నకుమారిని ఎంపికచేసారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ముగ్గురిని మాత్రమే ఎంపికచేయగా, ఆముగ్గురిలో ఈమె ఒకరు. గ్రామస్థులకూ, రోగులకూ ఉత్తమసేవలందించుచూ వారికి ప్రభుత్వం అందించు పథకాలను వివరించుచూ, వారిని చైతన్య పరచుచుండటంతో, వీరిని ఆ పురస్కారానికి ఎంపిక చేసారు. 2017,ఏప్రిల్-7న గుంటూరులో నిర్వహించిన సభలో, మంత్రి శ్రీ నక్కా ఆనందబాబు, జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ శ్రీమతి జానీమూన్, వైద్యాధికారుల చేతులమీదుగా, వీరికి ఆ పురస్కారం అందజేసినారు. [10] 

  • త్రాగునీటి వసతి
  • భూగర్బ జలాలు

నీటి శుద్ధి పథకం[మార్చు]

ఈ గ్రామంలో 2014,అక్టోబరు-2వ తేదీన ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పేరుతో ఒక నీటి శుద్ధి పథకాన్ని, నియోజకవర్గంలోనే మొదటిసారిగా ప్రారంభం చేసారు. ఈ పథకం ప్రకారం, 20 లీటర్ల శుద్ధినీటిని రెండు రూపాయలకే అందించుచున్నారు. ఈ రకంగా ఒక రోజుకు 2,000 లీటర్ల నీటిని ఈ గ్రామస్తులకేగాక, దూరప్రాంతాలవారికి గూడా సరఫరా చేయటం వలన ఈ పథకం త్వరలోనే ప్రజల అభిమానం పొందినది. ఈ గ్రామానికి చెందిన స్వర్గీయ డాక్టర్ కొడాలి వరప్రసాదరావు ఙాపకార్ధం, వారి కుమారుడు డాక్టర్ రజనీకాంత్, నాలుగు లక్షల రూపాయలతో ఆధునిక సాంకేతిక పరిఙానాన్ని ఉపయోగించి తయారుచేసిన యంత్రపరికరాలను ఈ పథకానికి విరాళంగా అందించారు. సర్పంచ్ శ్రీమతి గోగినేని వసుధ ఈ పథకానికి 50 వేల రూపాయల వ్యయంతో నాలుగు బోర్లను ఏర్పాటుచేసి, గొట్టాలను అనుసంధానం చేయడం ద్వారా రెండు రంధ్రాలతో 5,000 లీటర్ల నీటిని భూమినుండి పైకి తోడి నిలువచేసేలాగా ఏర్పాటు చేసారు. అక్కడినుండి మూడు దశలలో నీటిని శుద్ధిచేసి, నాలుగో దశలో "బ్లూ-రే" టెక్నాలజీలో మనిషి ఆరోగ్యాన్ని హానిచేసే బ్యాక్టీరియా, వైరస్ లను తొలగించి శుద్ధిచేసెదరు. ఈ నీటిని ఒక స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంకులో నిలువచేసెదరు. అక్కడి నుండి ఫిల్టర్ పాయింట్ ద్వారా. కుళాయిలద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిఙానంతో నీటిని శుద్ధిచేయుటవలన, విటమినులు మరియూ ఖనిజ లవణాలు నశించిపోకుండా జాగ్రత్త తీసుకున్నారు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ నీటిశుద్ధి ఆర్.ఓ.ప్లాంట్ సరఫరా సంస్థ అయిన "హోలీ వాటర్" అను సంస్థవారు ఈ పథకానికి ఆధునిక యంత్ర పరికరాలను అందించారు. దాతలు వీటిని అందించారు. ఇప్పటివరకూ ఉన్న శుద్ధినీటి పథకాలన్నిటికన్నా ఈ పథకం ద్వారా సరఫరా అగుచున్న నీరు చాలా బాగుంటున్నదని ప్రజల అభిప్రాయం. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను పంచాయతీ వారే నిర్వహించుచున్నారు. ప్రజలకు వారు చెల్లించిన పైకానికి, పంచాయతీ వారు రసీదు గూడా ఇవ్వడం విశేషం. పంచాయతీవారు ఈ పథకం కొరకు ఇద్దరు ఉద్యోగులను నియమించారు. 20 లీటర్ల నీటికి ప్రజలు చెల్లించే రెండు రూపాయల్తోనే, ఈ పథకం నిర్వహణ, సిబ్బంది జీతాలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులు వగైరా వ్యయానికి సరిపోవుచున్నవి. [4]

ఈ కేంద్రానికి, శ్రీ గోగినేని హిమాచలపతిరావు, హైమవతి దంపతుల ఙాపకార్ధం, వారి కుమారుడు శ్రీ గోగినేని వెంకటసుబ్బారావు, 20 లీటర్ల సామర్ధ్యం గల 160 నీటి డబ్బాలను విరాళంగా అందజేసినారు. వీటి విలువ 20,000 రూపాయలు. [7]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

  1. సాగునీటి వసతి - ప్రకాశం బ్యారేజి కాలువలు
  2. చెరువులు - సూరమ్మ చెరువు, అంకాలమ్మ చెరువు

గ్రామ పంచాయితీ[మార్చు]

  1. ఈ గ్రామము పూర్వం గూడవల్లి పంచాయితీలో వుండేది. గూడవల్లితో ఈ గ్రామానికి సంబంధం ఎక్కువ.
  2. ఈ గ్రామ పంచాయితీ క్రింద అనగాని పాలెం, పులిపాలెం, శివరాంపురం మొదలైన చిన్న గ్రామాలు ఉన్నాయి.
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గోగినేని వసుధ, సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె తరువాత గుంటూరు జిల్లా మహిళా సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ శిఖరేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీరాంపురం రామమందిరం[మార్చు]

గ్రామ దేవత అంకాళమ్మ ఆలయం[మార్చు]

ఈ గ్రామములోని పులి వారి ఇలవేలుపు అయిన శ్రీ అంకమ్మ తల్లి కొలుపులు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము.

జాతీయ ఆహార పథకంలో భాగంగా, 2014-15 సంవత్సరానికి గాను, "పంటల సరళి ఆధారిత గ్రామo"గా నడింపల్లి గ్రామాన్ని గుర్తించారు. ఈ పథకం క్రింద 20 హెల్టర్లలో, 50 మంది రైతులతో ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఎంపికచేసిన రైతులకు 3% రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించెదరు. [3]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ప్రధాన వృత్తి - వ్యవసాయం

గ్రామములో చాలా మంది యువకులు మద్రాసు, బెంగుళూరు మరియు హైదరాబాదులో ఉద్యోగాల్లో చేశారు, చేస్తున్నారు.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

వెన్నం జ్యోతి సురేఖ సుప్రసిద్ధ అంతర్జాతీయ విలువిద్యా క్రీడాకారిణి.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అబ్భివృద్ధి చేయాలని, ఎలీప్ (అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నిర్ణయించింది. [4]

శ్రీ కొడాలి గోకుల్:- ఈ గ్రామానికి చెందిన శ్రీ కొడాలి శివరామకృష్ణయ్య, బి.కాం., చదివి గ్రామములో వ్యవసాయం చేస్తున్నారు. వీరి శ్రీమతి అనసూయాదేవి ఇంటర్ వరకు చదువుకున్నారు. వీరి కుమారుడు శ్రీ గోకుల్, మద్రాస్ ఐ.ఐ.టి.లో బి.టెక్., చదివి అనంతరం సివిల్స్ లో ప్రవేశపరీక్ష వ్రాసినారు. ఇటీవల వెలువరించిన సివిల్స్ పరీక్షా ఫలితాలలో ఆయన 345వ ర్యాంక్ సాధించారు. [9]

ఈ గ్రామములో 2017,జూన్-27 నుండి 29 వరకు, రైతులకు ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ తరగతులు నిర్వహించుచున్నారు. [11]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,653 - పురుషుల సంఖ్య 1,289 - స్త్రీల సంఖ్య 1,364 - గృహాల సంఖ్య 808
  • 2001 వ.సంవత్సరం జనాభాా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2585.[1] ఇందులో పురుషుల సంఖ్య 1250, స్త్రీల సంఖ్య 1335,గ్రామంలో నివాస గృహాలు 777 ఉన్నాయి.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగస్టు-2; 1వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఆగస్టు-2; 1వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,అక్టోబరు-25; 1వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,డిసెంబరు-15; 2వపేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మే-4; 1వపేజీ. [7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,జూన్-18; 1వపేజీ.[8] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,ఆగస్టు-28; 1వపేజీ.[9] ఈనాడు గుంటూరు సిటీ; 2016,మే-12; 14వపేజీ. [10] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2017,ఏప్రిల్-8; 1వపేజీ. [11] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2017,జూన్-29; 2వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=నడింపల్లి&oldid=2149021" నుండి వెలికితీశారు