నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధులు, గుంటూరు కేసరి. నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు ఆత్మకథ (రెండవ ముద్రణ) గ్రంథావిష్కరణ సభను 2017, మార్చి-5న గుంటూరు, హిందూ కళాశాలలోని ఏకాదండయ్య పంతులు సమావేశమందిరంలో నిర్వహించారు. తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య, కేంద్రమంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారల చేతులమీదుగా ఈ గ్రంథావిష్కరణ నిర్వహించారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన నడింపల్లి వారి కథను, యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఆత్మకథను రూపొందించారు. రాజకీయాలకు విలువలు పడిపోతున్న తరుణంలో, ఎలాంటి పదవీ కాంక్ష లేకుండా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుబడిన వ్య్క్తి, అని వీరిని ఈ సందర్భంగా పలువురు వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 1958 లోనే గుంటూరులో ట్రాఫిక్ సమస్య దృష్ట్యా బ్రిడ్జిని నిర్మించడానికి వీరు చేసిన కృషి అమోఘమని కొనియాడారు. ఈ సభలో నడింపల్లి వారి అత్మకథను తెలుసుకొని, స్ఫూర్తి పొందినవారిని సన్మానించారు. ఈ సభలో నడింపల్లి వారి మనుమడు శ్రీ నడింపల్లి గురుదత్తు పాల్గొంటారు. [ఈనాడు గుంటూరు సిటీ; 2017, మార్చి-6; 2వపేజీ]