Jump to content

నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు

వికీపీడియా నుండి
నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు
గుంటూరులో వెంకట లక్ష్మీనర్సింహారావు విగ్రహం వద్ద నివాళి సమర్పిస్తున్న ముప్పవరపు వెంకయ్య నాయుడు
జననం1890 జనవరి 1
మరణం1978 జనవరి 16(1978-01-16) (వయసు 87)
ఇతర పేర్లుగుంటూరు కేసరీ
విద్యఎం.ఎ. ఎకనామిక్స్, బారిస్టర్
విద్యాసంస్థఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ది ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం, లింకన్స్ ఇన్
గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఉద్యమంభారత స్వాతంత్ర్య ఉద్యమం

నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహరావు, (1890 జనవరి 1- 1978 జనవరి 16) (తరచుగా ఎన్.వి.ఎల్. అని అంటారు) గుంటూరు ప్రాంత ప్రజలు ప్రముఖంగా "గుంటూరు కేసరి" అని పిలిచే మరొకపేరు ఉంది. "ఆంధ్ర కేసరి" టంగుటూరి ప్రకాశం పంతులుతో కలిసి పనిచేసిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. 1953లో అతను ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తాత్కాలిక స్పీకర్‌గా పనిచేశాడు.

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

అతను 1890 జనవరి 1న గుంటూరులో రామయ్య లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.[1] ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, గుంటూరు నుండి పట్టభద్రుడైన తరువాత తన చిన్ననాటి స్నేహితుడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యతో ఇంగ్లాండ్ వెళ్లాడు. అక్కడ ఎడిన్‌ బర్గ్‌ యూనివర్సిటీలో తన ఎంఎ., హానర్స్ (ఆర్థికశాస్రం) బారిష్టర్ లో అధ్యయనం పూర్తిచేసాడు. అప్పుడు అతడిని లింకన్స్ ఇన్‌లోని బార్‌కి పిలిచారు. [2] [3]

జీవిత గమనం

[మార్చు]

1915లో, అతను మద్రాస్ హైకోర్టులో చేరాడు.అక్కడ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కార్యాలయంలో జూనియర్‌గా చేరాడు. బ్రిటిష్ కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలోని కమిటీకి స్వాగత ప్రసంగం చేసిన తరువాత, మోతీలాల్ నెహ్రూ చేత, గుంటూరు పురపాలక సంఘం ఛైర్మన్‌గా నామినేట్ చేయబడ్డాడు.[4]1922లో, ఎన్‌విఎల్ నరసింహారావు బ్రిటిష్ పాలనలో గుంటూరు పురపాలకసంఘం భవనంపై భారత జాతీయపతాకం ఎగురవేసిన మొదటి వ్యక్తిగా గణతికెక్కాడు. [5]

కోస్తాంధ్ర ఉప్పుసత్యాగ్రహం

[మార్చు]

1930లో మహాత్మాగాంధీ నేతృత్వంలో కోస్తాంధ్రాలో జరిగిన ఉప్పుసత్యాగ్రహం చురుకుగా పాల్గొన్నాడు. మునిసిపాలిటీ ఛైర్మన్‌గా అతను ఉద్యోగులందరినీ ఉప్పు సత్యాగ్రహంలో స్వచ్ఛందంగా పాల్గొనటానికి ప్రొత్సహించాడు.[6]

ఆంధ్ర శాసనసభ

[మార్చు]

1953లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినతర్వాత, కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు,అతను కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రొటెం స్పీకరుగా నియమితులయ్యాడు.

సేవలు

[మార్చు]

మద్రాసులో ఉండగా అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమం లో పాల్గొన్నారు. కార్మికులను కలపడానికి నియోఫేబియన్ సొసైటీ ని స్థాపించారు .1923 సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ గుంటూరు పట్టణం సందర్శించినప్పుడు స్వాగతం ఇవ్వ రాదని అల్లూరి సీతారామరాజు చంపించిన అప్పటి కలెక్టర్ రూథర్ ఫర్డ్ వీటో జారీ చేయడం జరిగింది. అప్పటి మునిసిపల్ చైర్మన్ , ఉప చైర్మన్ ఈ ఆదేశమునకు భయపడి స్వాగతం ఇవ్వలేదు. అయితే నడింపల్లి మోతిలాల్ నెహ్రూ కు స్వాగతం పలికాడు . దీనితో మోతిలాల్, నడింపల్లి ధైర్యానికి మెచ్చుకొని, నడింపల్లి ని మునిసిపల్ చైర్మన్ గా నియమిస్తానని ప్రజల సమక్షంలో అడుగగా అందరూ ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. మునిసిపల్ చైర్మన్ గా స్వాతంత్రం రాకముందు 11 సంవత్సరాలు, వచ్చిన తర్వాత రెండు నెలలు పట్టణానికి  ఎన్నో సేవలను అందించాడు . ఆయన హయాంలోనే గాంధీ పార్క్ నిర్మాణం జరిగింది. ప్రజలతో జీవితాంతం కలిసి ఉన్న నడింపల్లి 16 జనవరి 1978 సంవత్సరంలో మరణించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. The Law Times. Published at the office of The Law times. 1815.
  2. Rao, P. Rajeswar (1991). The Great Indian Patriots, Volume 1. New Delhi: Mittal Publications. pp. 128–131. ISBN 9788170992806.
  3. "Makers of Modern India - Gem of an Andhra by Rama Rao Vadapalli V.B." {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. Bhadriraju, Seshagirirao (1976). History of Freedom Movement in Guntur District, 1921-47. Andhra University. p. 422.
  5. Bhadriraju, Seshagirirao (1976). History of Freedom Movement in Guntur District, 1921-47. Andhra University.
  6. Ch. M. Naidu (1986). Salt Satyagraha in Coastal Andhra. Mittal Publications. p. 103.
  7. "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2022-04-26.

వెలుపలి లంకెలు

[మార్చు]