Jump to content

తుమ్మల దుర్గాంబ

వికీపీడియా నుండి
తుమ్మల దుర్గాంబ
జననంతుమ్మల దుర్గాంబ
1907
తురుమెళ్ళ
మరణం1984 నవంబర్ 26
తురుమెళ్ళ
ప్రసిద్ధిస్వాతంత్ర సమర యోధురాలు,

కావూరు వినయాశ్రమం నిర్మాత.

సుప్రసిద్ధ సర్వోదయ కార్యకర్త
మతంహిందూ
భార్య / భర్తతుమ్మల బసవయ్య
తండ్రిపర్వతనేని కృష్ణయ్య
తల్లిభూషమ్మ

తుమ్మల దుర్గాంబ (1907 - 1984) స్వాతంత్ర్య సమర యోధురాలు. కావూరు లోని వినయాశ్రమం వ్యవస్థాపకురాలు.[1] సుప్రసిద్ధ సర్వోదయ కార్యకర్త,

బాల్యం

[మార్చు]

దుర్గాంబ గారు 1907లో గుంటూరు జిల్లా తురుమెళ్ళ గ్రామంలో పర్వతనేని కృష్ణయ్య భూషమ్మ దంపతులకు జన్మించింది. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం ఈమెకు కావూరుకు చెందిన తుమ్మల బసవయ్య తో వివాహం జరిగింది.

స్వాతంత్ర పోరాటం లో

[మార్చు]

వీరు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించి దహనం చేసి మరలా రాయవెల్లూరు జైల్లో ఆరు నెలలు శిక్షను అనుభవించారు.

మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఆంధ్రలో జాతీయోద్యమ స్ఫూర్తిని రగుల్కొలిపేందుకు శిబిరాలను నెలకొల్పదలచారు. వాటిలో భాగంగా స్వామి సీతారాం సూచన మేరకు దుర్గాంబ గారు భర్తతో కలిసి గుంటూరు జిల్లాలో కావూరులో వినయాశ్రమం ఏర్పాటు చేసారు. దుర్గాంబ బసవయ్య దంపతులు తమ యావదాస్థినీ ఈ ఆశ్రమానికి అర్పించారు. 65 ఎకరాల స్థలంలో ఈ ఆశ్రమం నెలకొని ఉన్న ఈ ఆశ్రమాన్ని గాంధీజీ చేతులమీదుగా 1933 డిసెంబరు 23 తేదీన ప్రారంబించబడింది. గాంధీజీ వినయాశ్రమంలో రెండురోజులు ఉండి దుర్గాంబ దంపతుల అతిధ్యం స్వీకరించి ప్రజలలో స్వాతంత్ర్య ఉద్యమం గురించి ప్రేరణ కలిగించారు.

వినయాశ్రమంలో 1934 ఆయుర్వేద వైద్యశాల స్థాపించారు. పిల్లలకోసం గురుకుల పాఠశాల స్థాపించారు.

1935లో మీరా బెన్ చేత స్వరాజ్య స్థూపం ఆవిష్కరింపజేశారు.

హరిజన సేవాయాత్రలో భాగంగా గాంధీజీ 1937 జనవరి 23 న రెండవసారి వినయాశ్రమం సందర్శించి తుపాను బాధితుల కోసం విరాళాలు సేకరించాడు. గ్రామ పారిశుద్ధ్యం, హరిజన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తపల్లి అన్నపూర్ణమ్మ, గుత్తికొండ బుల్లెమ్మ, దావులూరి వెంకట నరసమ్మ,కల్లూరి తులశమ్మ మొదలైన సోదరీమణుల సహకారంతో హరిజన వాడలను పరిశుభ్రం చేయడానికి వెళ్ళేవారు.

1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 16 నెలలు రాయవెల్లూరు మహిళాసెంట్రల్ జైల్లో నిర్భంధించారు.

1951 లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనకు స్వామి సీతారాం గారికి మద్దత్తుగా దీక్షవహించారు.1951 సెప్టెంబరు 20న ఆచార్య వినోబా భావే అభ్యర్ధనపై ఆయన తన దీక్షను విరమించింది.

మరణం

[మార్చు]

దుర్గాంబ గారి భర్త సాధు బసవయ్య గారు 1971 సెప్టెంబరు 17 న మరణిచారు. సాత్విక జీవనం గడిపిన తుమ్మల దుర్గాంబ గారు 1984 నవంబర్ 26 తేదీన వినయాశ్రమంలో పరమపదించారు.

మూలాలు

[మార్చు]
  1. దుర్గాంబ, తుమ్మల (1907-1984), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 245.