ఆంధ్ర రాష్ట్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర రాష్ట్రం (Andhra State; Āndhra, IPA: [ˈɑːndʰrʌ]) భారతదేశంలో ఒక రాష్ట్రంగా 1 అక్టోబరు, 1953 తేదీన ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీ లోని తెలుగు భాష మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు. ఆంధ్ర రాష్ట్రానికి మరియు హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు తుంగభద్ర నది నుండి తుంగభద్రా రిజర్వాయి యొక్క బేక్ వాటర్స్. రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాలు ఇందులో కలిసున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్‌.ఎస్‌ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు. 1937 నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యాడు. సి.ఎం.త్రివేది గవర్నరు అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.

ఆంధ్ర రాష్ట్రం
గీతం: "మా తెలుగు తల్లికి మల్లె పూదండ"
భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర స్థానం
భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర స్థానం
దేశం India
రాష్ట్రావతరణ1 అక్టోబర్ 1953
రాజధాని నగరంకర్నూలు
పెద్ద నగరంవిశాఖపట్నం
జిల్లాలు13
ప్రభుత్వం
 • సంస్థఆంధ్ర ప్రభుత్వం
 • గవర్నరుసి.ఎం.త్రివేది
 • ఆంధ్ర ముఖ్యమంత్రులు1.టంగుటూరి ప్రకాశం పంతులు1953 అక్టోబర్ 1 నుండి 1954 నవంబర్ 15 వరకు

2.రాష్ట్రపతి పాలన 1954నవంబర్ 15 నుంచి 1955మార్చి 28 వరకు

3.బెజవాడ గోపాలరెడ్డి1955మార్చి 28నుండి1956నవంబర్ 1 వరకు
 • హైకోర్టుహైకోర్టు,గుంటూరు
ప్రజానామముతెలుగు / ఆంధ్రులు
సమయప్రాంతంIST (UTC+05:30)

ఆ తర్వాత 1 నవంబరు, 1956 తేదీన తెలంగాణ ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

58 సంవత్సరాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అమల్లోకి వచ్చింది. జూన్ 2, 2014న అధికారికంగా విభజన జరిగి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి

మూస:Infobox Former Subdivision

ఈ వ్యాసం ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఉమ్మడిఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ
ఇటీవలి చరిత్ర
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014


ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు[మార్చు]

ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు]

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు[మార్చు]

Andhra state marked in yellow which merged with Telangana in white to form the state of Andhra Pradesh in 1956

నవంబరు 1, 1956 తేదీన హైదరాబాద్ రాష్ట్రం లోని తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాన్ని కలిపి విశాలమైన ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఇతర భాషలు మాట్లాడే ప్రాంతాల్ని మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో కలిపింది.

ఇవి కూడా చూడండి[మార్చు]