కొసరాజు రామయ్య చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొసరాజు రామయ్య చౌదరి విద్యావేత్త, రాజకీయనాయకులు, సంఘసేవకులు.[1] రావు బహుదూరు బిరుదాంకితులు

జననం,విద్య

[మార్చు]

తెనాలికి సమీపంలోని తురుమెళ్ళలో సంపన్న కుటుంభంలో కొసరాజు రామయ్యచౌదరి 1886 జన్మించారు.

రాజకీయ జీవితం

[మార్చు]

తెనాలి తాలూకా బోర్డు అధ్యక్షులుగా మూడు పర్యాయాలు వ్యవ హరించారు. గుంటూరు జిల్లా బోర్డు సభ్యులుగా వ్యవ హరించిన రామయ్యచౌదరికి బ్రిటీష్ ప్రభుత్వం రావు బహదూర్ బిరుదును ప్రదానం చేసింది.

నాటి రాజకీయ ప్రముఖులు బొబ్బిలి రాజా, ముని స్వామినాయుడు,కుప్పుస్వామి చౌదరి వంటివారితోపాటు గుంటూరు జిల్లాకలెక్టర్, మద్రాసు గవర్నర్ జనరల్ గా పనిచేసిన టీజీ రూథర్‌ఫర్డుకు అత్యంత సన్నిహితులు.

జస్టీస్ పార్టీ అభ్యర్దిగా 1934 లో డిల్లీ కేంద్ర శాసన సభకు ఎన్.జి. రంగా గారిపై పోటి చేసి పరాజయము చెందారు.

విద్యాదాత

[మార్చు]

తొలి పాఠశాల

[మార్చు]

రాష్రంలోనే మొదటిసారిగా తురుమెళ్లలో పాఠశాలను రావుబహుదూరు కొసరాజు రామయ్య చౌదరి గారు ఏర్పాటు చేసారు. ఇంటూరు లాకుల వద్ద ఉన్న ఉన్నత పాఠశాల శంకుస్థాపన, 1913 ఆగస్టు 20 న అప్పటి కలెక్టరు శ్రీ జె.ఎన్.రాయ్ చేశారు. ఆ తరువాత నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ ఉన్నత పాఠశాల, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు విద్యావసరాలు తీరుస్తూ వచ్చింది. T- ఆకారంలో పెంకులతో నిర్మించిన ఈ భవనం, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.

ఎందరో ప్రముఖులు ఈ పాఠశాలలో చదివారు. కల్లూరి చంద్రమౌళి, యలవర్తి నాయుడమ్మ ఎల్. బుల్లయ్య, ఆవుల సాంబశివరావు, జాతీయ వాలీబాల్ క్రీడాకారులు కె.వెంకయ్య బుచ్చిరామయ్య వంటి మహనీయులందరూ ఈ తురుమెళ్ల పాఠశా లలో విద్యాభ్యాసం చేసిన వారే.

నిజాంపట్నం పంట కాలువపై తురుమెళ్ళ పెదపూడి వంతెనల నిర్మాణానికి కృషి చేసి ప్రయాణ సౌకర్యాలను గణనీ యంగా మెరుగుపరిచారు. తురుమెళ్ల పాఠశాలలో హాస్టల్ నిర్మాణాన్ని చేసి పరిసర గ్రామాల విద్యారులకు సౌకర్యాలను కలిగించారు.

చిలుమూరు శ్రీరామ రూరల్ కళాశాలలో 1950లో నెహ్రూ వసతిగృహాన్ని ఏర్పాటు చేయడంలో రామయ్య కృషి చిరస్మరణీయం.

మరణం

[మార్చు]

రామయ్యచౌదరి గారు 1945లో అస్తమించారు.

మూలాలు

[మార్చు]