జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారి విగ్రహము, గుంటూరు

జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి మహాదాత, గొప్ప విద్యాపోషకుడు. కవి పండిత పోషకునిగా . నిష్కలంక రాజకీయవేత్తగా. సంఘ సేవకునిగా . ధార్మికవేత్తగా . విద్యాదాతగా జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి చరిత్ర గుంటూరు జిల్లా పుటల్లో సువర్ణాక్షర లిఖితం[1].

జననం[మార్చు]

కుప్పుస్వామి చౌదరి ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామములో ఒక సంపన్న భూస్వాముల కుటుంబములో జన్మించాడు.

రాజకీయాలు[మార్చు]

భూస్వామ్య కుటుంబంలో జన్మించినా రైతాంగ సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. ఆంగ్ల భాష ఆవశ్యకతను గుర్తించి కులమతా లతో సంబంధం లేకుండా విద్య అందరికీ చేరువ కావడానికి కృషి చేశారు. జస్టిస్ పార్టీలో చేరినా ఆ పార్టీ సిద్ధాంతాలకు లోబడక విద్యా వ్యాప్తికి అన్ని కులాల వారినీ పోత్సహించారు. 1920లో మద్రాసు రాష్ర శాసనసభకు గుంటూరు జిల్లా నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1936 వరకు అన్ని ఎన్నికలలోనూ కుప్పస్వామి గెలుపొందడం గమనా రం. 1927లో గుంటూరు జిల్లా బోరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. పదవీ కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థల స్థాపనకు కృషి చేశారు. జిల్లాలో అన్ని ప్రాంతాలకు రోడ్డు వసతి మొదటిగా కల్పించింది వీరి హయాంలోనే.

భాష పరిరక్షణ[మార్చు]

తెలుగు సంస్కృతిని పరిరక్షించుటకు, విద్యాసంస్థలు నెలకొల్పుటకు, కవి పండితులను ప్రోత్సహించుటకు విశేష కృషి చేశాడు. ఆంధ్రాభ్యుదయోద్యమాలలో ముఖ్య పాత్ర వహించి, 1931లో చెన్నపట్టణములో జరిగిన ఆంధ్ర మహా సభలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తీర్మానాన్ని ప్రవేశబెట్టి నెగ్గించాడు.

గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులుగా, మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 18 సంవత్సరాలు సేవ చేశాడు.

కావూరు గ్రామములో స్వామి సీతారాం గారి వినయాశ్రమానికి 100 ఎకరాలు దానం చేశాడు. గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించిన శారదానికేతన్కు భూరి విరాళమిచ్చాడు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను కష్టకాలములో ఆదుకున్నాడు. ఎందరో పేద విద్యార్థులకు దానాలు చేశాడు. కవులను ఆదరించి భాషాసేవ చేశాడు. మైసూరు అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు ఆచార్య శంకరలింగ గౌడ చే 'గుంటూరు మండల చరిత్ర' అనే పరిశోధనా గ్రంథము వ్రాయించాడు. ఏటుకూరి. తుమ్మల, జాషువా వంటి మహాకవులను డిగ్రీ లతో నిమిత్తం లేకుండా తెలుగు ఉపాధ్యాయులుగా నియమించారు. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదా నికేతనానికి భూరి విరాళం ఇచ్చారు. కావూరులో గొల్లపూడి సీతారామశాస్త్రి స్థాపించిన వినయాశ్రమా నికి కూడా భూమిని దానంగా ఇచ్చారు. విద్యావ్యాప్తి, అనాథ పోషణ, దేవా లయాల పనర్నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు.

కవికోకిల గుర్రం జాషువా కుప్పుస్వామి గురించి ఇలా శ్లాఘించాడు:

శరణంబిచ్చిరి నా అనాధ కవితా చంద్రాస్య నీక్షించి
ముగ్గురు శ్రీమంతులు వర్ణ ఖండన విగగ్ధున్
గొనబు పంటల అసామి కుప్పుసామి

గుంటూరు పట్టణములోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల కుప్పుస్వామి పేరిట స్థాపించబడింది[2][3].

కుటుంబం[మార్చు]

కుప్పుస్వామి కుమారుడు జాగర్లమూడి చంద్రమౌళి. ఇతడు కూడా దాత, విద్యాపోషకుడు.

మరణం[మార్చు]

1960 డిసెంబరు 14న కుప్పస్వామి చౌదరి కన్నుమూశారు.

మూలాలు[మార్చు]

  1. http://epaper.andhrajyothy.com/c/11695336
  2. "J K C College".
  3. "Language lab in JKC College". www.hindu.com.